ఆపరేషన్‌ కశ్మీర్‌!!

అర్టికల్‌ 370, 35 ఏ రద్దు దిశగా కేంద్రం అడుగులు?

”కశ్మీరం వేడెక్కుతోంది. గడిచిన రెండు వారాలుగా చోటు చేసుకున్న పరిణామాలతో ఏం జరగనుంది? మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు..ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో తొలిసారి అసాధారణ నిర్ణయాలు తీసుకునే దిశగా మోడీ సర్కారు అడుగులు వేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల్ని పలువురు ప్రస్తావిస్తూ.. మోడీ సర్కారు ఆపరేషన్‌ కశ్మీర్‌ చేపట్టనున్నట్లుగా చెబుతున్నారు ” 
  • -శాంతి భద్రతల దృష్ట్యా అదనపు బలగాలు 
  • -పార్లమెంటు సమావేశాల పొడిగింపు అందుకేనా? 
  • -సమావేశాల ముగింపులోగా కీలక నిర్ణయం 
  • -కాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి తొలగింపుపై కసరత్తు 
  • -అమర్‌నాధ్‌ యాత్రికులను వెనక్కి పిలిపింపు 
  • -వివిధ ప్రాంతాల విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్న సైన్యం 
  • -కీలక నేతల హౌస్‌ అరెస్టుకు రంగం సిద్ధం 
  • -నివురుగప్పిన నిప్పులా ఉన్న కాశ్మీరం 
  • -కాశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరివేయాలంటే రద్దు తప్పదు 
  • -అసలేం జరుగుతోందని నిలదీస్తున్న ప్రతిపక్షాలు 
  • -రేపోమాపో కీలక నిర్ణయం తీసుకోనున్న మోదీ సర్కారు 

హైదరాబాద్‌: 
కశ్మీరం వేడెక్కుతోంది. గడిచిన రెండు వారాలుగా చోటు చేసుకున్న పరిణామాలతో ఏం జరగనుంది? మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు..ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో తొలిసారి అసాధారణ నిర్ణయాలు తీసుకునే దిశగా మోడీ సర్కారు అడుగులు వేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల్ని పలువురు ప్రస్తావిస్తూ.. మోడీ సర్కారు ఆపరేషన్‌ కశ్మీర్‌ చేపట్టనున్నట్లుగా చెబుతున్నారు. 
అమరనాథ్‌ యాత్రికులకు రక్షణ కల్పించేందుకు 40 వేల మంది సైనికులు కశ్మీర్‌ లో విధులు నిర్వర్తిస్తున్నారు. కశ్మీర్‌ వ్యాలీలో ఉండే పోలీసులు.. భద్రతా సిబ్బంది.. సైనికులకు వీరు అదనం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తొలుత పది వేలు.. ప్రస్తుతం మరో పాతిక వేల మంది అదనపు సైనికుల్ని యుద్ధ ప్రాతిపదికన కశ్మీర్‌ కు పంపుతూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో పలు ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. జాతీయ భద్రతా సలహాదారు.. ఇండియన్‌ జేమ్స్‌ బాండ్‌ గా అభివర్ణించే అజిత్‌ డోవల్‌ ఇటీవల కశ్మీర్‌ ను సందర్శించి.. ఢిల్లీకి వెళ్లిన అనంతరం ఎడా పెడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
అదనపు సైన్యాన్ని ఎందుకు తీసుకెళుతున్నారన్న దానిపై పలు వర్గాలు.. పలు వాదనల్ని వినిపిస్తున్నాయి. వారి అంచనా ప్రకారం చూస్తే.. ఏమైనా జరగొచ్చని.. అసాధారణ నిర్ణయాలు తీసుకోవటంలో దిట్ట అయిన మోడీ.. తాజాగా తన తీరుతో మరోసారి షాకివ్వనున్నారన్న మాటను పలువురు వ్యక్తం చేస్తుంటే.. రాచపుండులా మారిన కశ్మీరానికి శాశ్విత పరిష్కారం కోసం మోడీ సాహసోపేతమైన చర్య తీసుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసి ఉంటారన్న మాట వినిపిస్తోంది. 
మోడీ ఏం చేసే అవకాశం ఉందన్న విషయంలో పలు వర్గాల వాదనల్ని పరిగణలోకి తీసుకుంటే..దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా.. ప్రత్యకంగా చూసేలా చేస్తున్న ఆర్టికల్‌ 35ఏ.. 370 అధికరణాల రద్దు దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నిర్ణయం తీసుకున్నంతనే కశ్మీర్‌ లోయలో విపరిణామాలు చోటు చేసుకునే వీలున్న నేపథ్యంలో.. వాటిని అడ్డుకునేందుకు వీలుగా సైన్యాన్ని భారీ ఎత్తున మొహరిస్తున్నట్లుగా పలువురు చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా బీజేపీ 2014.. 2019 ఎన్నికల ప్రణాళికను చూపిస్తున్నారు. 
జమ్ముకశ్మీర్‌ను మూడు ముక్కలుగా చేసి.. జమ్మును ప్రత్యేక రాష్ట్రంగా.. కశ్మీర్‌ లోయను.. లద్దాఖ్‌ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మర్చొచ్చన్న అంచనాలు ఉంది. అయితే.. ఈ ఊహాగనాల్ని ప్రజలు పట్టించుకోవద్దని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కొట్టిపారేయటం గమనార్హం. అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరించటం మోడీకి మొదట్నించి అలవాటు. తాజాగా వేలాది సైన్యాన్ని కశ్మీర్‌ వ్యాలీకి పంపటం వెనుక.. ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఢిల్లీతో పాటు కశ్మీర్‌ లో కూడా ప్రధాని ఎగురవేస్తారన్న మాటను చెబుతున్నారు. 
ఆగస్టు 15న కశ్మీరంలోని ప్రతి గ్రామంలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని బీజేపీ భావిస్తోందని.. అందుకు తగ్గట్లే తాజా ఏర్పాట్లు అని చెబుతున్నారు. తీవ్రవాదులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోకుండా ఉండేందుకే ఇంత భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. 
ప్రస్తుతం గవర్నర్‌ పాలనలో ఉన్న కశ్మీరంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన కేంద్రానికి ఉందని.. అందులో భాగంగానే సైన్యాన్ని తీసుకొస్తున్నారన్న మాటను చెబుతున్నారు. పశ్చిమ పాకిస్థాన్‌ శరణార్థులకు ఓటింగ్‌ హక్కులు కల్పిస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. కశ్మీర్‌ లోని ఒక వర్గం దీర్ఘకాలంగా చేస్తున్న ఈ డిమాండ్‌ కు మోడీ సానుకూలంగా స్పందిస్తారన్న మాట ఉంది. 
ఆగస్టు 7న ముగిసే పార్లమెంట్‌ సెషన్‌ అనంతరం కశ్మీర్‌కు సంబంధించి మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేస్తుందని.. దాని అనంతరం చోటు చేసుకునే పరిణామాలకు అధిగమించేందుకు తాజా కసరత్తు అని చెప్పేటోళ్లు లేకపోలేదు. 
ఇదేమీ కాదని.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో భాగమని.. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న అర్థం వచ్చేలా ఆర్మీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లే.. ఆ దిశగా ఏదైనా సంచలన నిర్ణయాన్ని తీసుకోనున్నారా? అన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఏది ఏమైనా కశ్మీర్‌ విషయంలో సంచలన నిర్ణయం దిశగా మోడీ సర్కారు అడుగులు వేస్తుందని చెప్పక తప్పదు. 
అసలే అస్థిరతలో కొట్టుమిట్టాడుతున్న కశ్మీర్‌ లోయలో 10 వేల మంది అదనపు భద్రతా బలగాలను మోహరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశంతో అక్కడ ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ శ్రీనగర్‌ పర్యటనకు వెళ్లి వచ్చిన వెంటనే ఈ ప్రకటన చేయడంతో కశ్మీర్‌లో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. 
ఆగస్టు 15 వరకూ జరగనున్న అమర్‌నాథ్‌ యాత్ర కోసం, అదే రోజు స్వతంత్ర దినోత్సవం కూడా ఉండడంతో ఇక్కడ అదనంగా 40 వేల పారామిలిటరీ బలగాలను మోహరించారు. 
లోయలో సాధారణంగా ఎంత సంఖ్యలో భద్రతా బలగాలు ఉంటాయో, ప్రస్తుతం దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మానవ హక్కుల సంస్థల అంచనా ప్రకారం సరిహద్దుల దగ్గర ఉన్నవారితో కలిపి ప్రస్తుతం జమ్ము-కశ్మీర్‌లో 7 లక్షల మంది జవాన్లు ఉన్నారు. 
కశ్మీర్‌ లోయలో 15 నుంచి 25 మంది పౌరులకు ఒక జవానును మోహరించినట్లు కనిపిస్తోంది. అధికారులు మాత్రం ఈ గణాంకాలను అతిశయోక్తిగా చెబుతున్నారు. 
భారీగా భద్రతా బలగాల మోహరింపు 
ఇక్కడ సైనికుల సంఖ్య ఎంతైనా, సైనిక దళాల్లో ఎక్కువ మంది లోయలోనే ఉంటారు. 
కశ్మీర్‌ లోయలో చాలా ఎక్కువ సైన్యం కనిపిస్తోంది. చాలా తక్కువ దూరాల్లోనే జవాన్లు, బంకర్లు, బ్యారికేడ్లు, పోస్టులు కనిపించడం ఇక్కడ ఈ మోహరింపు ఎంత అసాధారణ స్థాయిలో ఉందో చెబుతోంది. 
ఆర్టికల్‌ 35-ఏ అంటే ఏంటి? 
సైన్యాన్ని భారీగా మోహరించడం వల్ల ఇప్పటికే ఆంక్షలు ఎదుర్కొంటున్న స్థానికుల్లో కోపం, వేర్పాటువాద భావనలు మరింత పెరగవచ్చు. 
అదనంగా సైనికులను మోహరించడం వల్ల లోయలో తిరుగుబాటు భావన మరింత పెరుగుతుంది. ఈ తొందరపాటు చర్యల వల్ల కశ్మీరీల మనసులో కేంద్ర ప్రభుత్వంపై ఉన్న సందేహాలు మరింత తీవ్రం అవుతాయి. ప్రభుత్వం అదనపు భద్రతా దళాలను విమానాల్లో, రోడ్డు మార్గంలో వారి స్థావరాల దగ్గరకు చేర్చింది. వీరిలో సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ జవాన్లు ఉన్నారు. 
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన ‘ఆర్టికల్‌ 370’ రద్దు సాధ్యమేనా? 
వదంతుల జోరు..సైనికుల మోహరింపుతోపాటు స్థానిక మీడియాలో కొన్ని అస్పష్ట వార్తలు వెలుగు చూశాయి. రెండు విషయాలపై వదంతులు వ్యాపిస్తున్నాయి. 
వీటిలో మొదటిది… ప్రభుత్వం జమ్ము-కశ్మీర్‌ స్థానికుల కోసం నిర్వచించిన ఆర్టికల్‌ 35-ఏను తొలగించాలని అనుకుంటోందని చెబుతున్నారు. 
ఇక రెండోది… ప్రభుత్వ మార్గనిర్దేశాలకు సంబంధించినది. ప్రభుత్వం వివిధ విభాగాల తరఫున విడుదల చేసిన కొన్ని పత్రాల్లో నిత్యావసర వస్తువులను సేకరించాలని సూచించింది. దీంతో సామాన్యుల జీవితాలపై ఈ ప్రభావం సుదీర్ఘంగా ఉండవచ్చని చెబుతున్నారు. 
ఈ వదంతులు అదనపు సైన్యాన్ని మోహరించక ముందే వ్యాపించాయి. 
ఆర్టికల్‌ 35-ఏ: కశ్మీర్‌ అమ్మాయిలు ఇతర రాష్ట్రాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా? 
కానీ, ఆర్టికల్‌ 35-ఏ సవరణ, కేంద్రం మార్గనిర్దేశాలు, సైన్యం మోహరింపు గురించి ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి వివరణా రాలేదు. 
భద్రతా దళాల మోహరింపు సర్వసాధారణం అని చెబుతున్న కొంతమంది స్థానిక పోలీసులు ఈ సందేహాలను దూరం చేయడానికి ప్రయత్నించారు. అదనపు జవాన్లు దశలవారీగా అంతకు ముందు ఉన్న భద్రతా దళాల స్థానంలోకి వస్తారని చెప్పారు. 
అయితే, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం కశ్మీర్‌ లోయలో భారీ దాడి గురించి నిఘా వర్గాలకు సమాచారం అందిందని, అందుకే అదనపు బలగాలను మోహరించారని జాతీయ మీడియా చెబుతోంది. కానీ ఈ విషయంలో స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వ మౌనంతో ప్రజల్లో అశాంతి పెరుగుతోంది. ఇదే కారణంతో అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా తీవ్ర స్పందనలు వస్తున్నాయి. 
బీజేపీ ‘ఆర్టికల్‌ 370, 35ఎ రద్దు’ హామీని వ్యతిరేకిస్తున్న జమ్ముకశ్మీర్‌ పార్టీలు 
విరుద్ధ వాదనలు 
”లోయలో పరిస్థితి మెరుగుపడుతోంది”, ”తీవ్రవాదం వెన్ను విరిచాం” అని కేంద్ర ప్రభుత్వం, జమ్మూ-కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మలిక్‌ చెబుతున్నారు. కానీ అదనపు భద్రతా బలగాల మోహరింపు ఆ వాదనలను కొట్టిపారేస్తోంది. 
అధికారిక గణాంకాలు ఈ వాదన తప్పని చెబుతున్నాయి. 2018లో గత పదేళ్లలో లోయలో అత్యధిక రక్తపాతం జరిగిన ఏడాదిగా నిలిచింది. ఇదే ఏడాదిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక యువకులు ఆయుధం పట్టడం కూడా కనిపించింది. 
2017లో వీరి సంఖ్య 135గా ఉంటే, అది 2018లో 201కి పెరిగింది. అధికారులు మాత్రం 2019 మార్చి నుంచి జూన్‌ వరకూ లోయలో 50 మంది యువకులు తీవ్రవాదం బాట పట్టారని చెబుతున్నారు. 
ముఖ్యంగా చనిపోయిన మిలిటెంట్ల సంఖ్య ఆధారంగా తీవ్రవాద వ్యతిరేక ప్రచారంలో ఎంత విజయం సాధించామో ప్రభుత్వం చెబుతుంటుంది. 
2019లో మొదటి ఆరు నెలల్లో కశ్మీర్లో పోలీసులు, భద్రతా దళాల వేర్వేరు ఆపరేషన్లలో 126 మంది మిలిటెంట్లు మతి చెందారు. 2017లో 206, 2018లో 246 మంది చనిపోయారు.