67 ‌వసంతల ‘కేసీఆర్‌’

  • ‌నేడు సీఎం కేసీఆర్‌ ‌జన్మదినం
  • భారీగా మొక్కలు నాటేలా కోటి వృక్షార్చన
  • శంషాబాద్‌లో ప్రయాణీ•కులకు మొక్కల పంపిణీ
  • జోగులాంబ ఆలయంలో కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యుల పూజలు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
ఈ ‌నెల 17న బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని టిఆర్‌ఎస్‌ ‌నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటడడం ద్వారా హరితహారాన్ని పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదాం అని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులకు, సభ్యులకు పిలుపునిచ్చా రు. సీఎం కేసీఆర్‌కు హరితహారం అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. సీఎం కేసీఆర్‌ ‌పుట్టినరోజున కోటి వృక్షార్చ న నినాదంతో మొక్కలు నాటుదామని ఎంపి సంతోష్‌ ‌పిలుపునిచ్చారు.ఈ నెల 17న కేసీఆర్‌ 67‌వ వసంతం లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ మేరకు టిఆర్‌ఎస్‌ ‌నేతలంతా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చా రు. తెలంగాణ రాష్ట్రాన్ని మనకు అందించిన సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు సందర్భంగా హరిత తెలంగాణను కానుక గా ఇద్దామని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ రాజ్యసభ సభ్యులు సంతోష్‌ ‌కుమార్‌ ‌విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ‌పుట్టినరోజున విరివిగా మొక్కలు నాటుదామని ఆయన ట్విట్టర్‌ ‌ద్వారా పిలుపునిచ్చారు. గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్క లు నాటాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కాలుష్యం పెరుగుతున్న ఈ సమయంలో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నీ చెట్లను పెంచాలి అని కొరారు.మరోవైపు తాను చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులకు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌మొక్కలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరై శంషాబాద్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్‌ ‌పనికర్‌తో కలిసి ప్రయాణికులకు ఔషధ మొక్కలను అందజేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్ర మాన్ని విజయవంతం చేయాల్సిందిగా సంతోష్‌ ‌కుమార్‌ ‌పిలుపునిచ్చారు. ఈనెల 17న సీఎం కేసీఆర్‌ ‌జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమం ప్రారంభించారు.
జోగులాంబ ఆలయంలో కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యుల పూజలు
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్‌ ‌జోగులాంబ అమ్మవారి ఆలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో సీఎం కేసీఆర్‌ ‌సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్‌ ‌సతీమణి శైలిమ, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు అబ్రహం, వెంకటేశ్వర్‌ ‌రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే వారణాసి వెళ్లి వచ్చిన వీరు తాజాగా జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.