వీధిబాలలను విద్యా కుసుమాలుగా చేస్తోంది
బడికి వెళ్లాల్సిన వయసులో ఆ పిల్లలు ముంబయి రైల్వేస్టేషన్లలో, వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ కనిపించేవారు. ఎంతోమంది వారిని చూసి చూడనట్టే వెళ్లేవారు. కానీ 22 ఏళ్ల హైమంతీ సేన్ చదువుకునే హక్కుని వాళ్లకు తెలియజెప్పాలనుకుంది. అందుకోసం రైల్వేస్టేషన్ దగ్గర్లోని స్కైవాక్‌నే బడిగా మార్చేసింది.
ముంబయిలోని కండీవలి రైల్వేస్టేషన్ వద్ద ఉన్న స్కైవాక్ (బ్రిడ్జీ) ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అక్కడే కొందరు పిల్లలు బిచ్చమెత్తుకుంటూ కనిపిస్తారు. ఈ సీన్ ఆ స్టేషన్‌కు వచ్చేవారు రోజు చూసేది. అదే మార్గంలో ఆఫీసుకు చేరుకునే హైమంతీ సేన్ ఆ పిల్లల్ని చూసి చలించిపోయింది. అక్షరాలు దిద్దాల్సిన ఆ చిట్టిచేతులు చిల్లర కోసం చేయిచాచడం ఆమెకు అస్సలు నచ్చలేదు. ఆ పిల్లలను సమీపంలోని స్కూల్లో చేర్పించి, వారికి బతుకు దారి చూపించాలని నిర్ణయించుకుంది. పిల్లల వద్దకు వెళ్లి ‘మీ అమ్మానాన్న వద్దకు నన్ను తీసుకెళ్లండి’ అని అడిగింది. హైమంతీని వాళ్లు నివసించే ప్రాంతానికి తీసుకెళ్లారు. వారితో ‘మీ పిల్లలు బడికి వెళతారో? లేదో? నాకు తెలియదు.
నేను మాత్రం రోజు విడిచి రోజు మధ్యాహ్యం మూడు గంటలకు వీరికి చిత్రలేఖనం, బొమ్మలు తయారుచేయడం నేర్పిస్తాను’ అని తన ఉద్దేశాన్ని చెప్పింది. దానికి వారు ‘మేము మా పిల్లల్ని స్కూలు మానిపించాం. అయినా నువ్వు మా పిల్లలకు పాఠాలు చెప్పడం ఏంటి?’ అని కాస్త కటువుగానే బదులిచ్చారు.
అయితే హైమంతీ తన పట్టు విడవలేదు. స్థానికంగా ఉన్న స్కూలు యాజమాన్యంతో మాట్లాడి వీరిలో కొందరు పిల్లల్ని చేర్చుకోవాలని కోరింది. ‘మేము వీరిని బడిలో చేర్చుకుంటాం. అయితే వీరికి గానీ, వీరి తల్లిందడ్రులకు గానీ స్కూలంటే పట్టింపే ఉండదు. ఈ పిల్లల్ని స్కూలుకు రప్పించడం చాలా కష్టమైన పని. ఈ పిల్లలు ఇకనుంచి బుద్ధిగా స్కూలుకు వస్తారని మీరు మాటిస్తే, మేము మీకు సాయం చేయగలం’ అని స్పష్టంగా చెప్పారు స్కూలువాళ్లు. దాంతో ఏం చేయాలో పాలు పోలేదు హైమంతికి. తనే ఈ పిల్లలకు ప్రాథమిక శిక్షణ ఇవ్వాలనే నిర్ణయానికొచ్చింది.
2018 మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలో పిల్లలకు రోజు విడిచి రోజు పాఠాలు చెప్పేది. నవంబర్ నుంచి ప్రతిరోజు గంట పాటు క్లాసులు తీసుకోవడం మొదలెట్టింది. హైమంతీ సేవాకార్యక్రమాన్ని చూసి కొంతమంది తాము కూడా స్వచ్ఛందంగా పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ముందుకొచ్చారు. దాంతో మరింత మంది పిల్లలకు పాఠాలు చెప్పాలనే ఆలోచనతో హైమంతీ ‘జునూన్’ ఎన్జీవోను స్థాపించింది.
ప్రతి మంగళ, గురు, శుక్రవారాల్లో పిల్లలకు డ్యాన్స్, ఆర్ట్, క్రాఫ్ట్ తరగతులు నిర్వహిస్తారు. ప్రతి బుధవారం పిల్లల కోసం వీధినాటకాల ప్రదర్శన ఏర్పాటుచేస్తారు. పిల్లల్లో క్రమంగా ఈ తరగతుల పట్ల ఆసక్తి పెరిగింది. హైమంతీ టీమ్ ఎఫర్ట్ పిల్లల్లో చాలా మార్పు తెచ్చింది. పాఠాలు వినడమే కాదు చక్కగా తల దువ్వుకోవడం, పరిశుభ్రంగా ఉండడం వంటి మంచి అలవాట్లు పిల్లలకు అలవడ్డాయి.. ఈ పిల్లల్లో చాలామందికి తమ పేరును సొంతగా రాయడం వచ్చింది. ‘ఈ ప్రయాణం కొంతవరకూ కష్టంగానే ఉంది. ఈ 15 మందిలో అయిదుగురు పిల్లలైనా ఈసారి స్కూల్లో చేరతారని గ్యారంటీ ఇవ్వగలను. మిగతా పిల్లలకు కూడా ప్రాథమిక విద్య అందించేందుకు కషి చేస్తా’ అంటోంది హైమంతీ.
అవమానాలు, పోలీసు కంప్లైంట్…
హైమంతీ సేవాకార్యక్రమం గిట్టని వాళ్లూ, విమర్శించే వాళ్లూ ఉన్నారు. స్కైవాక్ మీద ఈ పిల్లలకు క్లాసులు చెప్పడం వల్ల పాదచారులకు ఇబ్బందిగా ఉందని హైమంతీ మీద ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆ సమయంలో కొందరు హైమంతీకి సపోర్టుగా నిలిచారు. రేపటి పౌరులైన ఈ పిల్లల బాల్యం మురికివాడల్లో, రైల్వేస్టేషన్లోనే బందీ కాకూడదనే సమున్నత లక్ష్యంతో మొదలెట్టిన తన సేవా ప్రయాణాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంది.
ముంబయిలోని కండీవలి రైల్వేస్టేషన్ వద్ద ఉన్న స్కైవాక్ (బ్రిడ్జీ) ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అక్కడే కొందరు పిల్లలు బిచ్చమెత్తుకుంటూ కనిపిస్తారు. ఈ సీన్ ఆ స్టేషన్‌కు వచ్చేవారు రోజు చూసేది. అదే మార్గంలో ఆఫీసుకు చేరుకునే హైమంతీ సేన్ ఆ పిల్లల్ని చూసి చలించిపోయింది. అక్షరాలు దిద్దాల్సిన ఆ చిట్టిచేతులు చిల్లర కోసం చేయిచాచడం ఆమెకు అస్సలు నచ్చలేదు. ఆ పిల్లలను సమీపంలోని స్కూల్లో చేర్పించి, వారికి బతుకు దారి చూపించాలని నిర్ణయించుకుంది. పిల్లల వద్దకు వెళ్లి ‘మీ అమ్మానాన్న వద్దకు నన్ను తీసుకెళ్లండి’ అని అడిగింది. హైమంతీని వాళ్లు నివసించే ప్రాంతానికి తీసుకెళ్లారు. వారితో ‘మీ పిల్లలు బడికి వెళతారో? లేదో? నాకు తెలియదు. నేను మాత్రం రోజు విడిచి రోజు మధ్యాహ్యం మూడు గంటలకు వీరికి చిత్రలేఖనం, బొమ్మలు తయారుచేయడం నేర్పిస్తాను’ అని తన ఉద్దేశాన్ని చెప్పింది. దానికి వారు ‘మేము మా పిల్లల్ని స్కూలు మానిపించాం. అయినా నువ్వు మా పిల్లలకు పాఠాలు చెప్పడం ఏంటి?’ అని కాస్త కటువుగానే బదులిచ్చారు.
అయితే హైమంతీ తన పట్టు విడవలేదు. స్థానికంగా ఉన్న స్కూలు యాజమాన్యంతో మాట్లాడి వీరిలో కొందరు పిల్లల్ని చేర్చుకోవాలని కోరింది. ‘మేము వీరిని బడిలో చేర్చుకుంటాం. అయితే వీరికి గానీ, వీరి తల్లిందడ్రులకు గానీ స్కూలంటే పట్టింపే ఉండదు. ఈ పిల్లల్ని స్కూలుకు రప్పించడం చాలా కష్టమైన పని. ఈ పిల్లలు ఇకనుంచి బుద్ధిగా స్కూలుకు వస్తారని మీరు మాటిస్తే, మేము మీకు సాయం చేయగలం’ అని స్పష్టంగా చెప్పారు స్కూలువాళ్లు. దాంతో ఏం చేయాలో పాలు పోలేదు హైమంతికి. తనే ఈ పిల్లలకు ప్రాథమిక శిక్షణ ఇవ్వాలనే నిర్ణయానికొచ్చింది.
2018 మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలో పిల్లలకు రోజు విడిచి రోజు పాఠాలు చెప్పేది. నవంబర్ నుంచి ప్రతిరోజు గంట పాటు క్లాసులు తీసుకోవడం మొదలెట్టింది. హైమంతీ సేవాకార్యక్రమాన్ని చూసి కొంతమంది తాము కూడా స్వచ్ఛందంగా పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ముందుకొచ్చారు. దాంతో మరింత మంది పిల్లలకు పాఠాలు చెప్పాలనే ఆలోచనతో హైమంతీ ‘జునూన్’ ఎన్జీవోను స్థాపించింది. ప్రతి మంగళ, గురు, శుక్రవారాల్లో పిల్లలకు డ్యాన్స్, ఆర్ట్, క్రాఫ్ట్ తరగతులు నిర్వహిస్తారు. ప్రతి బుధవారం పిల్లల కోసం వీధినాటకాల ప్రదర్శన ఏర్పాటుచేస్తారు. పిల్లల్లో క్రమంగా ఈ తరగతుల పట్ల ఆసక్తి పెరిగింది. హైమంతీ టీమ్ ఎఫర్ట్ పిల్లల్లో చాలా మార్పు తెచ్చింది. పాఠాలు వినడమే కాదు చక్కగా తల దువ్వుకోవడం, పరిశుభ్రంగా ఉండడం వంటి మంచి అలవాట్లు పిల్లలకు అలవడ్డాయి.. ఈ పిల్లల్లో చాలామందికి తమ పేరును సొంతగా రాయడం వచ్చింది. ‘ఈ ప్రయాణం కొంతవరకూ కష్టంగానే ఉంది. ఈ 15 మందిలో అయిదుగురు పిల్లలైనా ఈసారి స్కూల్లో చేరతారని గ్యారంటీ ఇవ్వగలను. మిగతా పిల్లలకు కూడా ప్రాథమిక విద్య అందించేందుకు క షి చేస్తా’ అంటోంది హైమంతీ…