శివారుల్లో కరోనా కలకలం
రంగారెడ్డిలో 33.. మేడ్చల్ లో 24..అధికారుల అప్రమత్తత
- జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు
- రాజేంద్రనగర్ పరిధిలో ఎక్కువ ప్రభావం
- మేడ్చల్ జిల్లాలో బోడుప్పల్ కార్పొరేషన్లో విస్తరణ
- జల్ పల్లి, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లలో అత్యధిక కేసులు
- అప్రమత్తమైన అధికార యంత్రాంగం
- కట్టుదిట్టంగా, కఠినంగా ఏర్పాట్లు ముమ్మరం
- ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టిన అధికారులు
హైదరాబాద్: ఓ పెళ్లికి వచ్చి నెల రోజులుగా పెళ్లి వారింట్లోనే చిక్కుకుపోయారు 40 మంది బంధువులు. తెలంగాణలోని సంగారెడ్డిలో ఉన్న బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఇరుక్కుపోయారు. గాలి నారాయణరావు అనే వ్యక్తి కొడుకు పెళ్లి మార్చి 20న నిర్ణయించారు. అందు కోసం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, ఒడిశా నుంచి బంధువులు వచ్చారు. మార్చి 20న పెళ్లి జరిగింది. అయితే, వెళ్లిపోవడానికి రెడీ అవుతున్న సమయంలో 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ వచ్చింది. ఆ తర్వాత 23న వెళ్లాలనుకున్నారు. అయితే, లాక్ డౌన్ వచ్చేసింది. దీంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. వారంతా ఒకే ఇంట్లో ఉన్నారు. 40 మంది బంధువులు ఉన్నారు. అందులో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అందరికీ ఒకే బాత్రూమ్. వారితో పాటు ఇంటి యజమాని నారాయణరావు కుటుంబసభ్యులు మరో ఆరుగురు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా సామాజిక దూరం పాటించడం అనేది అసంభవం. అయితే, తమ వారిని ఇళ్లకు పంపేందుకు ఏవైనా ఏర్పాట్లు చేయాలంటూ నారాయణరావు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మాత్రం అది కుదరదని తేల్చి చెప్పారు. అవసరమైతే సరుకులు ఇస్తామంటూ మూడు క్వింటాళ్ల బియ్యం, కొన్ని కూరగాయలు ఇచ్చి వెళ్లారు. రాత్రి పూట మగవారు బిల్డింగ్ మీద నిద్రిస్తున్నారు. అయితే, పగలంతా ఎండ వాయిస్తుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. కొన్ని చోట్ల మాత్రం నగర శివారుల్లో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండటంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పాజిటివ్ కేసుల నమోదు తగ్గింది. మేడ్చల్ జిల్లా పరిధిలో రెండు రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. గురువారం రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసూ వెలుగు చూడలేదని అధికారులు ప్రకటించారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ , అమోయ్ కుమార్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకున్నారు. దీంతో వైరస్ ఇతరులకు విస్తరించకుండా ఉండేందుకు వీలు కలిగింది. రంగారెడ్డిలో 33.. మేడ్చల్ లో 24… వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరి వ. చివరగా బుధవారం నాలుగు కేసులు నమోదు కాగా.. ఇఎం . రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో వెలుగు చూశాయి. గురువారం అటు రూరల్.. ఇటు జీహెచ్ఎంసీలోని జిల్లా పరిధి ప్రాంతాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. జిల్లాలో 8 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి 128మంది అనుమానితులను ఉంచారు. మర్కజ్ యాత్రికుల కుటుంబీకులైన మరో 77 మందిని క్వారంటైన్లకు తరలించారు. , మేడ్చల్ జిల్లాలో చివరగా మంగళవారం శామీర్ పేట మండలం తుర్కపల్లిలో పాజిటివ్ కేసు వెలుగు చూసింది. తర్వాత ఎక్కడా వెలుగు చూడలేదు. అప్పటివరకు జిల్లా పరిధిలో 24 కేసులు వెలుగు చూశాయి. ఇవి కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ముందునుంచి తక్కువగానే ఉంది. జిల్లాలో నాలుగు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే.. జిల్లాకు చెందిన 152 మందిని రాజేంద్రనగర్‌లోని జిల్లా క్వారంటైన్ కేంద్రంతోపాటు నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఉంచారు. ముందస్తుగా ఏర్పాట్లు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధికారులు పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల విషయంలో అప్రమత్తమై పనిచేశారు. ఎక్కడైనా పాజిటివ్ కేసు నమోదైతే కుటుంబీకులతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనికి తోడు జిల్లాలో వైద్యారోగ్య, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సర్వే చేపట్టారు. అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. స్థానికంగా శానిటైజేషన్ చేశారు. దీనివల్ల కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. శివారు మున్సిపాలిటీల్లో కొవిడ్-19 విస్తరిస్తోంది. రోజు రోజుకీ కరోనావైరస్ తీవ్రత పెరుగుతోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 21 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పటివరకు అయిదు మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాతో పోలిస్తే మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కేసుల తీవ్రత తక్కువగా ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో బోడుప్పల్ కార్పొరేషన్ మినహా మిగిలిన వాటిల్లో ఎక్కడా పాజిటివ్ కేసులు వెలుగు చూడలేదు. ఆ ఒక్కటీ మంగళవారమే బయట పడింది. రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో తీవ్రత ఎక్కువగా ఉండటం వెనుక దిల్లీకి వెళ్లిన యాత్రికులే కారణంగా కనిపిస్తోంది. ఎందుకిలా..? ఆయా మున్సిపాలిటీల్లో వచ్చిన కేసుల్లో ఎక్కువగా జల్ పల్లి, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లలోనే ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిల్లీ లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జల్ పల్లిలో వెలుగు చూసిన కేసులకు నేరుగా ఈ లింకులు ఉన్నాయి. బండ్లగూడ జాగీర్ లో తొలుత ఓ వ్యక్తికి పాజిటివ్ రాగా.. అతను మెహిదీపట్నంలో ఓ హోటల్ లో పనిచేస్తుండేవాడు. అతనికి అక్కడ కొవిడ్ వచ్చినట్లు తెలిసింది. బడంగ్ పేట కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిశాడు. అతని కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించారు. ముగ్గురికి సంబంధించి నమూనాలు మంగళవారం పరీక్షలకు పంపించారు. వీరికి ఫలితాల్లో నెగెటివ్ రావడంతో అక్కడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పకడ్బందీ చర్యలు మున్సిపాలిటీల్లో పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ కట్టడి చర్యలు చేపడుతున్నారు. కంటెయిన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతం చుట్టూ బారికేడ్లు ఏర్పాటుచేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇంటింటి సర్వే చేపట్టి అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు పంపించి కేసులు విస్త ృతి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్ జిల్లాలో బోడుప్పల్ కార్పొరేషన్లో తొలి కేసు నమోదు కాగా.. కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కంటెయిన్మెంట్ జోన్ ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.