కరోనా కట్టడికి కీలక నిర్ణయం

హెం క్వారంటైన్ గడువును 14 నుంచి 28 రోజులకు పెంచిన టి.సర్కార్

హైదరాబాద్: కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెూం క్వారంటైన్ గడువును 14 నుంచి 28 రోజులకు పెంచింది. రాష్ట్రంలో కొంత మందికి వైరస్ లక్షణాలు 28 రోజులవరకు బయటపడటం లేదని.. దీని వల్ల సమస్యలు ఉ త్పన్నమవుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో హెూం క్వారంటైన్లో ఉన్నవారు ఇక పై 14 రోజులు కాకుండా 28 రోజులు ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కరోనా టెస్టుల విషయంలోనూ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. కేవలం ప్రైమరీ కాంటాక్టులకే కరోనా పరీక్షలు చేయాలని.. సెకండరీ కాంటాక్టులను టెస్టు చేయొద్దని అధికారులకు స్పష్టం చేసింది. దాంతోపాటు వైరస్ బాధితుడితో ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న వ్యక్తికి మాత్రమే పరీక్షలు చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. సెకండరీ కాంటాక్ట్ ను టెస్ట్ చేయొద్దని.. వారిని ఏం క్వారంటైన్ లో ఉంచితే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెకండరీ కాంటాక్ట్ కు స్టాంప్ వేసి.. 28 రోజులపాటు హెూంక్వారంటైన్లో ఉంచాలని సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఒడిశా, కేరళ, అస్సాం, జార?ండ్ రాష్ట్రాలు కూడా హెం క్వారైంటన్ కాలాన్ని 28 రోజులకు పెంచాయి.