ఆర్థిక మందగమనానికి ఆర్బీఐ మందు

ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి కీలక నిర్ణయాలు తీసుకున్న ఆర్ బీఐ గవర్న్ ర్ శక్తి కాంత దాస్ 

  • ఇప్పటి వరకు జీడీపీలో 3.2శాతం అందుబాటులోకి
  • లాక్ డౌన్ తర్వాత రూ. 1.2 లక్షల కోట్లు విడుదల
  • సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ
  • రివర్స్ రెపోరేటు 4 నుంచి 3.75శాతానికి తగ్గింపు
  • రాష్ట్రాలకు 60 శాతం మేర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్
  • రెపో రేటు యథాతథం ..2021-22లో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగు
  • ఆర్బీఐ నిర్ణయాలతో రైతులు, పేదలకు చేయూత: మోదీ

“ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ద్రవ్య లభ్యత, రుణ సరఫరా సామర్థ్యం పెరగనుంది. చిన్న స్థాయిపరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, రైతులు, పేదలు ఎంతగానో లబ్దిపొందనున్నారు. ‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్’ (డబ్ల్యూఎంఏ) పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలు కూడా ప్రయోజనం పొందనున్నాయి”  -నరేంద్రమోదీ

ముంబయి: కరోనా వైరస్ నేపథ్యంలో ఇటు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ గవర్న్ ర్ శక్తి కాంతదాస్ అన్నారు. అన్నింటినీ అంచనా వేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పై వైరస్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న బ్యాంకు సిబ్బందిని ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పలు కీలక ప్రకటనలు చేశారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. జీ-20 దేశాల్లో భారత వృద్ధి రేటే మేలు… ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం నెలకొందని శక్తి కాంతదాస్ అన్నారు. 1930 తర్వాత ఇంతటి సంక్షోభం ఎప్పుడూ ఎదుర్కోలేదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, చమురు ధరలు భారీ ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు. వృద్ధి రేటు పాజిటివ్ గా ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటని తెలిపారు. 2020లో భారత్ 1.9శాతంగా ఉండనుందని చెప్పిన గవర్నర్ జీ20 దేశాల్లో కెల్లా ఇదే అత్యధికమని వెల్లడించారు. బ్యాంకుల్లో నిధుల కొరత లేదు…. కరోనా కష్టకాలంలో ఏటీఎంల వినియోగం పెరిగిందని శక్తి కాంత దాస్ తెలిపారు. బ్యాంకుల్లో నిధుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. బ్యాంకు కార్యకలాపాలు యథాతథంగానే జరుగుతాయని స్పష్టం చేశారు. లాక్ డౌన్ వేళ మొబైల్ బ్యాంకింగ్ సేవలు సజావుగా సాగుతున్నాయన్నారు. ఆర్ బీఐ చర్యల వల్లే బ్యాంకుల్లో ద్రవ్య లభ్యత మెరుగ్గా ఉందని 2021-22లో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ ఏడాది 7.4శాతం వృద్ధి నమోదు కానుందని అంచనా వేశారు. మార్చిలో ఆటోమొబైల్, ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయని, తెలిపారు. విద్యుత్ వినియోగం భారీగా తగ్గిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 9 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆర్ బీఐ కీలక ప్రకటనలు… – ఇప్పటి వరకు జీడీపీలో 3.2శాతం అందుబాటులోకి – లాక్ డౌన్ తర్వాత రూ. 1.2 లక్షల కోట్లు విడుదల – సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ – రివర్స్ రెపోరేటు 4 నుంచి 3.75శాతానికి తగ్గింపు. -రెపో రేటు యథాతథం – రాష్ట్రాలకు 60 శాతం మేర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ) పెంపు. ఇది సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటుంది. స్వల్పకాలిక చెల్లింపుల్లో తేడా వచ్చినప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్ బీఐ సహకారాన్ని తీసుకుంటాయి. ఇలా ఆర్ బీఐ నుంచి ప్రభుత్వాలు తీసుకునే స్వల్పకాలిక రుణాలను వేస్ డబ్ల్యూ ఎంఏగా వ్యవహరిస్తారు. – జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ.10 వేల కోట్లు- నాబార్డుకు రూ.25వేల కోట్లు -మారటోరియం సమయంలో 90 రోజుల ఎస్పీఏ గడువు వర్తించదు. – బ్యాంకుల లిక్విడిటీ కవరేజ్ రేషియో(ఎల్ సీర్)ను 100శాతం నుంచి 80శాతానికి తగ్గింపు. దీని వల్ల బ్యాంకుల నగదు నిల్వలు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని తిరిగి 2020 అక్టోబర్ 1 నాటికి 90 శాతం, ఏప్రిల్ 1, 2021 నాటికి 100 శాతానికి పునరుద్ధరణ. దేశీయ కరెన్సీ రూపాయి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత దాస్ ప్రకటించిన చర్యలు ఊతమిచ్చాయి. కరోనా కల్లోలంతో ఇటీవలి రికార్డు పతనాన్ని నమోదు చేసిన రూపాయి డాలరు మారకంలో 45 పైసలు పుంజుకుంది. 76.59 వద్ద ప్రారంభమైన రూపాయి గవర్నర్ శక్తి కాంత దాస్ మీడియా సమావేశం అనంతరం మరింత పుంజుకుని 76.42 గరిష్టాన్ని తాకింది. గురువారం, అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి 76.87 కనిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. సానుకూల దేశీయ ఈక్విటీలు, డాలరు బలహీనతకు తోడు, ఆర్ బీఐ ప్రకటించిన ద్రవ్య లభ్యత , ఆర్థిక పటిష్టతకు తీసుకున్న చర్యలు రూపాయికి మద్దతిచ్చినట్టు ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. మరోవైపు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర (బ్రెంట్ ఫ్యూచర్స్) 2.05 శాతం పెరిగి బ్యారెల్ 28.39 డాలర్లకు చేరుకుంది. కోవిడ్-19 మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత దాస్ వ్యవస్థలో తగిన ద్రవ్యత ఉండేలా చర్యలు ప్రకటించారు. ఆర్థిక మందగమనానికి వ్యతిరేకంగా లిక్విడిటీని పెంపు, క్యాష్ ఫ్లోకు మద్దతు లాంటి అదనపు చర్యలను ఆర్బిఐ ప్రకటించింది. నాబార్డ్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సిడ్బీ వంటి ఆర్థిక సంస్థలకు రూ .50 వేల కోట్ల రీ ఫైనాన్సింగ్ విండో, రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల లాంటి చర్యలను ఆర్ బీఐ తీసుకుంది. మరోవైపు ఆర్ బీఐ మీడియా సమావేశం వార్తలో దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా ఎ గిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 563 పాయింట్ల లాభానికి పరిమితం కాగా నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 9149 వద్ద 9200 స్థాయి దిగువకు చేరింది. ప్రధానంగా ఎన్బీఎఫ్ సీలకు అవసరమైన ద్రవ్య లభ్యతకోసం భారీ ఉద్దీపన ప్యాకేజీ కోసం ఎదురుచూసినట్టు ఐఎఫ్ఎ గ్లోబల్ వ్యవస్థాపకుడు సీఈవో, అభి షేక్ గోయెంకా అన్నారు