నగరం స్వేచ్ఛగా…..
భాగ్యనగరంలో 30 శాతం తగ్గిన కాలుష్యం..స్వచ్ఛమైన గాలి లభ్యం
- రెండు దశాబ్దాల క్రితం వాతావరణం ప్రత్యక్షం
- తగ్గిన ఆక్సేస్ ఆఫ్ నైట్రోజన్ ఎన్ వాయిస్ లెవెల్స్
- వాహనాలు, పరిశ్రమల ప్రభావం లేదు
- గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగింది
- భారీగా తగ్గిన నైట్రోజన్ ఆక్సైడ్లు
- పల్లెలను మరిపిస్తున్న పట్నవాసం
హైదరాబాద్: పపంచవ్యాప్తంగా విధ్వసం సృష్టిస్తున్న కరోనా.. ఓ మేలు కూడా చేసింది. కమ్మేసిన కాలుష్యాన్ని ఇప్పటికే సగానికి పైగా తగ్గించేసింది. ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం కల్పించింది. ఇదే క్రమంలో భారత్ లో కూడా కాలు ష్యం తగ్గిపోయిందని ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా భారత్ లోని 5 అత్యంత కాలుష్య నగరాలైన ఘజియాబాద్, ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గుర్గాలలో 50 శాతానికి పైగా తగ్గిందని తెలిపింది. లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ లో 30 శాతం కాలుష్యం తగ్గింది. గాలిలో ధూళికణాలు తగ్గడం.. ఆక్సేస్ ఆఫ్ నైట్రోజన్ ఎన్వోయిస్ లెవెల్స్ తగ్గాయని, 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఎలా ఉండేదో.. ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాస్త్రవేత్త మీడియాతో మాట్లాడుతూ గతంతో పోలిస్తే పొల్యూషన్ గణనీయంగా తగ్గిందన్నారు. హైదరాబాద్ లో 21 స్టేషన్లను పరిశీలిస్తున్నామని, మొత్తంగా చూస్తే చాలా తగ్గిందన్నారు. పరిశ్రమలు ఆగిపోయాయని, ప్రధానంగా వాహనాలు తిరగడం లేదు కాబట్టి పొల్యూషన్ తగ్గిందని చెప్పారు. మేజర్ ట్రాఫిక్ సెంటర్లలో పొల్యూషన్ బాగా తగ్గిందని ఎర్కొన్నారు. జనతా కర్ఫ్యూ.. లాక్ డౌన్లో కాలుష్య తీవ్రత భారీగా తగ్గిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) తేల్చింది. దేశవ్యాప్తంగా ఒకటి రెండు నగరాలు, పట్టణాల్లో మినహా మిగిలిన అన్ని చోట్ల వాయు నాణ్యత చాలా వరకు మెరుగుపడిందని స్పష్టం చేసింది. హైదరాబాద్ లో మార్చి 22న వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) సంత ృప్తికరం నుంచి అత్యంత సంతృప్తికర కేటగిరీకి చేరుకుందని తేల్చింది. తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నట్లు ప్రత్యేక నివేదికలో వివరించింది. దేశంలోని 115 నగరాలు, పట్టణాల్లోని సీఏఏక్యూఎంఎస్(కంటిన్యూయస్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్) కేంద్రాల్లో కాలుష్య తీవ్రతను సీపీసీబీ లెక్కిస్తోంది. సూక్ష్మధూళి కణాలు(పీఎం 10), అతిసూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5), నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమ్మోనియా తదితర 8 కాలుష్య ఉద్గారాల తీవ్రత ఆధారంగా ఏక్యూఐని లెక్కిస్తారు. మార్చి 22కు ముందు, తర్వాత ఎలా ఉందో ఆరా తీసింది. వాహనాల రాకపోకలు లేకపోవడంతో గాలి స్వచ్చంగా మారినట్లు గుర్తించారు. సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 10), నైట్రోజన్ ఆక్సైడ్లు భారీగా తగ్గినట్లు తేల్చారు. రోనా కారణంగా స్వచ్ఛమైన గాలి అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు శబ్ద కాలుష్యం నుంచి విముక్తి లభించి ప్రశాంతంగా ఉంటున్నారు. లాక్ డౌన్ తో కాలుష్యం భారీగా తగ్గింది. హైదరాబాద్ లో వాయు కాలు ష్యం 30 శాతం మేర తగ్గి స్వచ్ఛత పెరిగిందని గుర్తించారు. 20 ఏళ్ల క్రితపు నగరం ఇప్పుడు మళ్లీ ఇప్పుడు పునరాగమనమైందని నిపుణులు అంటున్నారు. పల్లె వాసులతో సమానంగా నగరవా సులు, స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారు. లాక్ డౌ తో వాహనా లు, ఇతర త్రా రద్దీ తగ్గడంతో కాలు ష్యం పూర్తిగా కనుమరు గైంది. తద్వారా వాయు నాణ్యత పెరిగిందని వాతావ రణ స్టేషన్లు రిపోర్టు చేస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశం లో పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత మెరుగుపడిందని వెల్లడైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాయు కాలు ష్యం భారీగా తగ్గిందని వెల్లడైంది. హైదరాబాద్ తోపాటు, రాష్ట్రమంతటా రవాణా, వాణిజ్య, వ్యక్తి గత వాహనాలు పూర్తిగా స్థంభించడంతో కాలు ష్యం గణనీయంగా తగ్గిందని గుర్తించారు. దీంతో గత 20ఏళ్లలో ఏనాడు వేసవిలో ఇంత స్వచ్చత నమోదు కాలేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగైన పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణలోని ఉ మ్మడి 9 జిల్లాల పరిధిలో మంచి ఫలితాలు న్నాయని గుర్తించారు. ఎయిర్ క్వాలిటీ ప్రమాణా ల్లో గత వేసవిలో వంద పాయింట్లు ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం వాయు నాణ్యత ప్రమానాల్లో 68 పాయిం ట్లు, ఏపీ రాజధాని అమరావతి 54 పాయింట్లు ఉంది. ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్)లో 50 పాయింట్లలోపు ఉంటే స్వచ్చమైన వాతావరణం, అతినాణ్యమైన గాలి ప్రజలకు లభిస్తుందని, 50 నుంచి 100పా యింట్లు ఉంటే గాలి నిణ్యతతో ఉ న్నట్లు నిర్ధారిస్తారు. సున్నా నుంచి 50 పాయింట్ల వరకు ఉంటే గుడ్ గానూ పేర్కొంటూ అతి తక్కువ ప్రభావంగా గుర్తిస్తారు. 50నుంచి 100 పాయిం ట్లకు స్వల్ప ప్రభావమని, 100నుంచి 200 పాయింట్లకు ఉంటే స్వల్ప ఆస్తమా, గుండెకు ముప్పు ఉంటుందని నిర్ధారిస్తారు. 200 నుంచి 300 పాయింట్లకు పూర్ కేటగిరీగా పేర్కొంటుం డగా.