బహుజనోద్ధరకుడు అంబేద్కర్

అంబేద్కర్ జయంతి

భీం రామ్ రాంజీ అంబేద్కర్,ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖ మంత్రి, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, వృత్తి న్యాయవాది, ఇండియన్, బౌద్ధుడు, తత్వశావేత్త, ఆంత్రోపాలజీస్ట్, పునరుద్ధరణ కర్త, బాల్యంలోనే అనేక అవమానలేదు,, పేదరికాన్ని ఎదుర్కొంటూ, స్వయంకృషితో స్వీయ ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహా మనిషి, శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహూం అను ఊరిలో రాంజీ మలోజీ సాక్పాల్, భీమాబాయ్ దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబవడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు వంశీకులు మహార్ కులానికి చెందినవారు బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు. ఇతని తండ్రి రత దేశానికి మో హెూ సైనిక స్థావరంలోని బ్రిటీష్ సైన్యంలో పనిచేసి సేవలు అందించాడు.చిన్నతనంలోనే అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది. వేసవి సెలవుల్లో మామగారున్న గోరెగావ్ కు భీమ్ రావ్, అన్న, మేనల్లుళ్ళతో పాటు వెళ్ళాడు. అనుకున్నట్లు, మామ స్టేషన్? కు రాలేకపోయాడు. స్టేషన్ నుండి, గ్రామానికి వెళ్ళటానికి బండిని కుదుర్చుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బండివాడికి, వీళ్ళు మెహర్ కులస్థులని తెలిసింది. అందరినీ బండి నుండి దిగమన్నాడు. ఎండాకాలం. పిల్లలు ఆ బండివాణ్ణి బతిమాలు కొన్నారు. రెండింతలు బాడుగ ఇస్తామన్నారు. భీమ్ రావ్ అన్న బండి తోలేటట్లు, బండివాడు నడచి వచ్చేటట్లు మాట్లాడుకున్నారు. ఆకలి దప్పులతో అలమటిస్తూ అర్ధరాత్రికి గోరేగావ్ చేరారు పిల్లలు. వీధికుళాయి నీరు తాగుతూ వున్న భీమ్ రావ్ ను కొట్టి మంచినీరు త్రాగకుండా గెంటివేశారు. కులం పేర భీమ్ రావ్ ను అవమానాలకు గురిచేశారు.రామ్? జీ, సతారా వదలి పిల్లల చదువుకోసం బొంబాయి చేరాడు.భీమ్ రావ్ ఎల్ఫిన్స్టన్ హైస్కూల్ లో చేరి మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. సంస్కృతం చదువు కోవాలని ఆశించాడు. కులం అడ్డు వచ్చింది. ఇష్టం లేకున్నా పర్షియన్ భాష చదివాడు. 16వ ఏటనే పెద్దలు అతనికి పెళ్ళి చేశారు. జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యులనుండి పూర్తీ స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజము యొక్క ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారతసమజమ లో ఉన్నదని ఆయన సమర్ధించాడు. అయితే అంటరానివారుగా చూడబడుతున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగము చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొనెను. ఇలా కుల, అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక, సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు.బహుజనం కోసం అనేక పోరాటాలు చేసాడు. 1931 జరిగిన ఓ సంఘటన ఏంటంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశం కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. గాంధీ, జిన్నా, అంబేద్కర్, ముగ్గురు వెళ్లారు. బ్రిటిష్ వారు గాంధీని అడిగారు మీరు ఎవరి తరపున ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చారు అని, నేను భారతదేశం తరఫున నుంచి వచ్చానని చెప్పాడు గాంధీ. జిన్నా అని అడిగారు మీరు ఎవరి తరపున వచ్చారు రౌండ్ టేబుల్ సమావేశానికి , నేను భారతదేశంలో ఉన్న ముస్లింల తరఫున వచ్చానని చెప్పాడు జిన్నా. తర్వాత అంబేద్కర్ గారిని అడిగారు భారతదేశంలో పుట్టాను గనుక ప్రజల తరఫున వచ్చాను నేను ఆ దేశంలో నిలబడిన ఈ గాంధీ లాంటి వాళ్ళ ప్రకారం అంటరాని అస్పృశ్య కులంలో పుట్టాడు కనుక నేను అస్పృశ్య ప్రజల తరఫున ప్రతినిధిగా వచ్చాను అని చెప్పాడు. రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం వాళ్ళ మధ్య చర్చ జరిగింది ఆ చర్చ కొన్నాళ్లు జరిగింది ఆ జరుగుతున్న క్రమంలో గాంధీ ఉండడానికి ఒక చోట ఇచ్చారు, జిన్నా ఉండడానికి ఒక చోట, అంబేద్కర్ ఉండడానికి ఒక చోట ఇచ్చారు. ఆ ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి జర్నలిస్టు ఒకతను వీరి ముగ్గురి ఇంటర్వ్యూ చేద్దామనుకుని బయల్దేరాడు. రాత్రి 10 గంటల సమయంలో గాంధీ దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరున్న సేవకులు గాంధీ గారు పడుకున్నారు ఇప్పుడు మాట్లాడటం సాధ్యం కాదు అని చెప్పి పంపించారు. ఆ విలేకరు అక్కడి నుండి జిన్న దగ్గరికి వెళ్ళాడు.11 గంటల సమయంలో సరిగ్గా అక్కడ కూడా అదే సమాధానం వచ్చింది. ఆ తర్వాత అంబేద్కర్ దగ్గరికి వచ్చాడు రాత్రి రెండు గంటల సమయం అవుతుంది నిధి ఆకాశానికి నుంచి నిశీధి వేలాడుతున్న సమయం గబ్బిలాలు తలకిందులుగా వేలాడుతున్న సమయం. ఈ ప్రకృతి అంతా జోరుగా నిద్రపోతున్న సమయం. ఆ సమయంలో అంబేద్కర్ గారి దగ్గరికి విలేకరి గారు వచ్చాడు. అంబేద్కర్ లైట్ కింద కూర్చుని పుస్తకాన్ని చదువుతూ నోట్స్ రాసుకుంటు కూర్చున్నాడు. విలేకరి వెళ్లి ఆశ్చర్యానికి గురై అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే అంబేద్కర్ గారు మేము గాంధీ దగ్గరికెళితే 10 గంటలకే పడుకున్నాడు జిన్న దగ్గరికి వెళ్తే పదకొండు గంటలకి పడుకున్నారు. మీరు రాత్రి 2:00 అవుతున్నది ఇంకా చదువుతూ కూర్చున్నారు ఏంటని ప్రశ్నించాడు. అంబేద్కర్ గారు చెప్పిన సమాధానం ఏమిటంటే గాంధీ కి సంబంధించిన ప్రజలు చైతన్యవంతులై ఉన్నారు మేల్కొని వున్నారు గాంధీ నిద్రపోతే ఆ ప్రజలకు నష్టం లేదు. జిన్నా ప్రజలు మేల్కొని వున్నారు చైతన్యం కలిగి ఉన్నారు తను నిద్ర పోయినా వారికి వచ్చే నష్టం లేదు. నా ప్రజలు చైతన్యం లేకుండా ఉన్నారు నిద్రపోతున్నారు, చైతన్యం లేని ప్రజలకు చైతన్యం ఇవ్వాలి. నిద్రపోతున్న ప్రజలని మేల్కొల్ప డం కోసం నిద్రలేని రాత్రులు నేను కడప వలసింది ఇది నా కర్తవ్యం నా బాధ్యత అని అన్నాడు. మనకోసం కోట్లాదిమంది ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం అంబేద్కర్ కిందట నిద్ర లేని రాత్రులు గడిపాడు.ఆనాడు అంబేద్కర్ చెప్పిన విధంగా బహుజనులు సకల కులాల వారు బేదభిప్రాయాలకు భేషజాలకు పోకుండా ఐక్యం కావాలి అప్పుడే వర్ణాలను ఎదురించి రాజ్యాధికారం సాధించగలం అగ్రవర్ణాల అవసరాలు తీర్చడానికి బహుజనులు ఉన్నారని ఎలా ఆధిపత్య భావజాలాన్ని కూలద్రోసి తమ దోపిడీని నిరాటంకంగా కొనసాగించడానికి పెత్తనాన్న స్థిర పరచుకోవడానికి అవలంబిస్తున్న దుష్ట ఆచారానికి తెరదించి వారి పై తిరగబడి బుద్ది చెప్పాలి. పోరాటాలు చేయకుండా తిరగబడ్డ కుండా ఇంతవరకు ఏది అయినా అదిరా స్వతంత్రమైన మన తెలంగాణ రాష్ట్రమైన అయినా రాజ్యాంగ హక్కు లైన ఏవైనా వట్టిగా రాలేదు అందుకే అంబేద్కర్ చెప్పిన విధంగా రాజ్యం కోసం ఐక్యంగా కులమత భేదాలను గౌరవం పెంపొందించుకుందాం. అదే అంబేద్కర్ గారికి మనం ఇచ్చే 

నిజమైన నివాళి 

– వెంకట్ మర్రి  ,తెలుగు ఉపాద్యాయులు నల్లగొండ