మామిడి రైతు గుండె చెరువు

ఇటీవల కురిసిన అకాల వర్పాలకు రాలిపోయిన పూత, పిందె మామిడికాయలు

  • అసలే కరోనా..ఆపై అకాల వర్షం
  • నిండా మునిగిపోయాం అని రైతన్నల ఆందోళన
  • దిగుబడి లేదు..డిమాండ్ అంతకన్నా లేదు
  • మామిడి పండ్లు లేక బోసిపోయిన పండ్ల మార్కెట్లు
  • ప్రతి సంవత్సరం మామిడి పండ్లతో కళకళలాడే మార్కెట్లు
  • ఊరగాయలు పెట్టేందుకు దొరకని మామిడి కాయలు 

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గత గురువారం కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. అనేక చోట్ల మామిడి పూత రాలిపోగా కోత కు వచ్చిన మామిడికాయలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల మామిడి తోట లకు నష్టం వాటిల్లింది. ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, మణుగూరు, అశ్వాపురం, సత్తుపల్లి మండలాల్లో మామిడి కాయలు నేలరాలాయి. సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొమురవెళ్లి మండలంలో వడగళ్లు పడ్డాయి. నంగునూరు, గజ్వేల్ మండలంలో మామిడితోటలకు విపరీతమైన నష్టం జరిగింది. ంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మామిడిపై కరోనా ఎఫెక్ట్ పడింది. అసలే ఈ ఏడాది దిగుమతి తక్కువగా రావడంతో దిగాలుగా ఉన్న రైతులకు కరోనా ఆశనిపాతంగా మారింది. దీంతో వారి పరిస్థితి ఇప్పుడు అయోమయంగా తయారైంది. సురభి రాజు పూర్వీకులు కొల్లాపూర్‌లో మామిడి తోటల పెంపకాన్ని ప్రోత్సహించి బేనీషాన్, తోతపురి, రాణిపసంద్, దిల్ పసంద్, కాలమిస్ట్రీ లాంటి రకాలను న్యూజివీడు నుంచి ప్రత్యేకంగా తెప్పించి వందల ఎకరాల్లో ఇక్కడ తోటల పెంపకం చేపట్టారు. తెలంగాణలో మామిడి తోటల పెంపకంలో నాగర్ కర్నూల్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 24,400 ఎకరాల్లో మామిడి తోటలుండగా, ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 14,400 ఎకరాల్లో పంట సాగవుతోందని ఉ ద్యానవన శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మారు మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి 40శాతం మాత్రమే వచ్చిందని మామిడి రైతులు వాపోతున్నారు. అయితే కొల్లాపూర్ మామిడికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా అగ్రికల్చర్ ప్రాసెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్పర్టు డెవల్‌పమెంట్ అథారిటీ (అపెడా) పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేర్ మండలాల్లోని రైతులతో ఒప్పందం చేసుకుంది. దీంతో ?స్థానిక మార్కెట్ కంటే అధిక ధరలకు రైతుల నుంచి కొనుగోలు చేసి నాలుగేళ్ల నుంచి అపెడా ఈ మామిడిని ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా అనేక దేశాలు రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో వారం రోజులుగా ఎగుమతులు లేక గత్యంతరం లేని స్థితిలో రైతులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు చెందిన దళారులకు విక్రయిస్తూ నష్టాలు చవి చూస్తున్నారు. కష్టమంతా వృథా మామిడి తోటలకు పుష్కలంగా నీరు ఉన్నా కష్టపడి తోటలకు లక్షల పెట్టుబడి పెట్టినా ఈ ఏడాది పంట దిగుబడి లేదు. చేసిన కష్టమంతా వృథా అయింది. రెండు ఎకరాల్లో పంటకు లక్ష పెట్టుబడి పెట్టా. కనీసం పెట్టుబడి కూడా రాదు. అప్పులే మిగులుతాయి. ప్రభుత్వం మామిడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఈ ఏడాది మామిడి రైతులకు జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ద్వారా వ్యవసాయ శాఖ మంత్రికి వివరిస్తా. కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే వారికి కన్నీళ్లే మిగిలాయని మంత్రికి చెబుతామంటున్నారు స్థానిక రైతులు. ఈ ఏడాది వాతావరణం, ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పుల కారణంగా 40 శాతమే దిగుబడి వచ్చింది. దీనికి తోడు దేశ విదేశాలకు మామిడి ఎగుమతి నిలిచిపోవడంతో దర కూడా తగ్గింది. మామిడి రైతుల పంట వివరాలను సేకరించి జిల్లా ఉ న్నతాధికారులకు నివేదిస్తా మంటున్నారు. ఇర జగిత్యాల జిల్లాలోని మామిడి మార్కెట్ పై కరోనా ఎఫెక్ట్ కనబడుతోంది. పంట అమ్మకాలకు గడువు సమీపిస్తున్నా, వ్యాపారులు మామిడి మార్కెట్ వైపు చూడడం లేదు. ఏప్రిల్ మొదటి వారం నుంచి కొనుగోళ్లు మొదలు కావాల్సి ఉంది. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడంతో ఈసారి మామిడి మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళనలో ఉ న్నారు. జిల్లా నుంచి దేశవ్యాప్తంగా సరఫరా జగిత్యాల మామిడి మార్కెట్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ సాగైన మామిడి రకాలు దేశవ్యాప్తంగా సరఫరా అవుతుంటాయి. బంగినపల్లి రకానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి. పంజాబ్, ఢిల్లీ, హర్యానా, జమ్మూ కశ్మీర్, డెహ్రాడూన్, లూథియానా, బెంగళూర్, ఉత్తప్రదేశ్, జార్ఖండ్, జైపూర్, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి పంట కొనుగోలు చేసుకుని ఆయా రాష్ట్రాలకు తరలిస్తారు. మార్చి చివరి వారంలోనే జగిత్యాలకు చేరుకుని మూడు మాసాల పాటు ఇక్కడే ఉండి పంటను కొనుగోలు చేస్తూ ఉంటారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇతర రాష్ట్రాల వ్యాపారులదే పెద్ద బిజినెస్. యేటా 100 కోట్లకు పైగా మామిడి వ్యాపారం సాగుతుంది. అయిఏ ప్రస్తుతం సీజన్ దగ్గర పడుతున్నా మామిడి మార్కెట్లో హడావుడి లేదు. కరోనా వైరస్ ప్రభావం వల్లే మామిడి వ్యాపారులు రావడం లేదని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఆందోళనలో మామిడి రైతులు జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది. ఐదారు సంవత్సరాలుగా మామిడి విక్రయం జూదంలా మారింది. ఈ ఏడాది పూత ఆలస్యంగా రావడంతో పాటు తక్కువగా ఉ ండటంతో దిగుబడి తగ్గుతుందని ఓవైపు రైతులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది. గత ఏడాది బంగినపల్లి రకం కిలోకు రూ.30 నుంచి రూ.35 వరకు ధర పలికింది. ఈసారి పంట దిగుబడి తక్కువగా ఉండగా కిలోకు రూ.50 నుంచి రూ.55 వరకు వస్తుందని రైతులు భావిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఇబ్బందికరమే కరోనా ప్రభావం మామిడి మార్కెట్ పై తీవ్రంగా కనిపిస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అందరికీ ఇబ్బందికరమే. ఇతర రాష్ట్రాల నుంచి పంట కొనుగోలుకు ఇక్కడికి వ్యాపారులు ఎక్కువగా వస్తుంటారు. అయితే, ఈ సారి ఇప్పటికీ ఎవరూ రాలేదు. కరోనా ప్రభావంతో ఎవరూ కొనుగోలుకు ముందుకు రావడం లేదు. పరిస్థితులు ఇలాగే ఉంటే రైతులు, స్థానిక వ్యాపారులకు ఇబ్బందులు తప్పవు. రాజన్‌కు అరుదైన గౌరవం ఐఎంఎఫ్ సలహా బృందంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ కోవిడ్ -19: 12 మంది నిపుణులతో సలహా కమిటీ వాషింగ్టన్ : ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (57) కీలక గౌరవాన్ని దక్కించుకున్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారత దేశంలో అనుసరించాల్సిన ఆర్థిక విధానాలపై పలు కీలక సూచనలు చేసిన ఆయన తాజాగా అంతర్జాతీయ ద్యవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బృందంలో చోటు దక్కించుకన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12మంది ఆర్థిక నిపుణులతో ఏర్పాటైన ఈ కమిటీలో రఘురామ్ రాజన్ ను కూడా చేరుస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఒక ప్రకటన జారీ చేశారు. గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాలను అందిస్తుందని ఐఎంఎఫ్ శుక్రవారం తెలిపింది. ఆర్థికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్న తమ సభ్యదేశాలను ఆదుకునేందుకు, ఆర్థిక సహాయం, సంబంధిత విధానాల రూపకల్పనలో అసాధారణమైన నైపుణ్యం, అగ్రశ్రేణి నిపుణుల సలహాలు తమకిపుడు చాలా అవసరం అని ఆమె చెప్పారు. వీరంతా తమ అమూల్య సేవలను అందించేందుకు అంగీకరించడం తనకు గర్వంగా ఉందన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న అసాధారణ సవాళ్లు, కీలక పరిణామాలు, ఇతర విధి విధానాలపై ఈ టీం సూచనలు చేయనుంది. సింగపూర్ సీనియర్ మంత్రి, సింగపూర్ ద్రవ్య అథారిటీ చైర్మన్ షణ్ముగరత్నం, మసాచుసెట్స్ ఇన్నిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ క్రిస్టిన్ ఫోర్ట్స్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, యుఎన్ మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లార్డ్ మార్క్ మల్లోచ్ బ్రౌన్ తదితరులు కమిటీలో వున్నారు. కాగా కోవిడ్-19 మహమ్మారి గడచిన శతాబ్దంలో ఎదురైన సంక్షోభాలన్నికంటే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామంటూ ఇప్పటికే క్రిస్టలినా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర మందగనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ మహమ్మారి మరింత దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్ సభ్య దేశాల్లోని సుమారు 170 దేశాల్లో తలసరి ఆదాయం క్షీణించిందని పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ గా పనిచేసిన రాజన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు