ఇలాగైతే…విధులు నెరవేర్చేదెలా?!
తెలంగాణలో ఆశావర్కర్లకు ఆకతాయిల వేధింపులు
- ఇంటింటి సర్వేకు వెళితే ఇక్కట్లపాలు
- అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఇంటి యజమానులు
- వివరాలు అడిగితే బెదిరింపుల పర్వం
- పోలీసుల సమక్షంలోనే దూషణలు
- అక్కడక్కడా రాళ్లు రువ్వి గాయపరిచిన ఘటనలు
- కన్నీరుమున్నీరవుతున్న ఆశావర్కర్లు
- ఆరోగ్యాన్ని లెక్కచేయక డ్యూటీ చేస్తున్నాం
- రక్షణ కల్పించండి సారూ అని మొత్తుకుంటున్న సిబ్బంది
హైదరాబాద్: ప్రజల శ్రేయస్సు కోరి పనిచేస్తోన్న ఏఎన్ఎంలు, ఆశావర్కర్ల పై పలుచోట్ల ఆకతాయిలు వేధింపులకు పాల్పడుతున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వేకు వెళ్తున్న సిబ్బందికి.. పలుచోట్ల చేదు సంఘటనలు ఎదురవుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఈ తరహా దుర్ఘటనలు చోటు చేసుకోగా… తాజాగా నగరంలోని దోమలగూడ, పాతబస్తీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. మంగళవారం జలపల్లి పరిధిలో ఆరోగ్య సిబ్బందికి తీవ్ర అవమానం ఎదురైంది. ఆరోగ్యం, విదేశీ, దిల్లీ ప్రయాణం వంటి వివరాలు అడిగితే.. సిబ్బందికి తిరుగు ప్రశ్నలు ఎదురయ్యాయి. పలువురు అసభ్యంగా మాట్లాడి సిబ్బందిని వేధింపులకు గురిచేశారు. కన్నీరు పెట్టుకొంటూ.. నగరంలోని ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 320 మంది ఏఎన్ఎంలు, 600ల మంది ఆశావర్కర్లు పని చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లోనూ దాదాపు ఇంతే సంఖ్యలో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. భోజనం, తాగునీటి సౌకర్యాలు లేకపోయినా తాము కష్టపడి పనిచేస్తున్నామని, ప్రోత్సహించాల్సిన వారే అసభ్యంగా మాట్లాడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను, దిల్లీ వెళ్లిన వారికి సూచనలు చేసేందుకు వెళ్లితే ఒక్కొక్క ప్రదేశంలో ఆకతాయిలు తమను వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. మా కష్టాలు చూస్తూ కూడా బస్తీల్లోనే పలువురు వేధింపులకు దిగుతున్నారని సిబ్బంది వాపోయారు. ఇదే విషయమై బాలాపూర్ మండల పర్యవేక్షణాధికారి గోవింద్ రెడ్డి స్పందించారు. బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీసులను సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదట కొంత స్లో గా అనిపించినా ఎప్పుడైతే ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లో తఘీ జమాత్ మత ప్రచార సభ జరిగిందని , అందులో వారు ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారని తెలిసిందో అప్పటి నుండి ఊహించని విధంగా కేసులు పెరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో కొంతమేర ప్రభావం తగ్గినా , ఢిల్లీ మత ప్రచార సభ మాత్రం కొంప ముంచేసింది. ఇప్పటికే పాజిటివ్ కేసులు 3043 కేసులు నమోదవ్వగా 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న సర్కార్ ఈ క్రమంలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మీటింగ్ లో పాల్గొన్న వారందరినీ కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక జిల్లాల వారీగా వారిని గుర్తించే పనిలో పడ్డాయి. ఒక్క తెలంగాణా నుండే వెయ్యి మందికి పైగా ఈ సభకు వెళ్లి వచ్చారు. ఇక వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఈ నేపధ్యంలో ఆ సభకు వెళ్లి వచ్చిన వారు క్వారంటైన్ లోనే ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి .. జిల్లాల వారీగా వారి కోసం జల్లెడ అంతేకాదు అక్కడికి ఎవరెవరు వెళ్లారో స్వచ్ఛందంగా వచ్చి సమీప అధికారులకు వివరాలు తెలపాలని సూచించారు. అయినా చాలా మంది బయటకు రావటం లేదు . అయితే అక్కడికి వెళ్లి వచ్చి ఇప్పటి వరకు అధికారులకు సమాచారం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అయితే ఆ సభకు వెళ్లి వచ్చిన వారిని గురించి ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. వారిని తక్షణమే గుర్తించి కరోన పరీక్షలు చేయించాలని సూచించింది. ఇక తెలంగాణా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా దీని పై సర్వే జరుగుతుంది . ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మర్కజ్ మీటింగ్ లకు హాజరైన వారిని గుర్తించేందుకు ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. సర్వే చేస్తున్న ఆశా వర్కర్ పై దాడికి యత్నం ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లో ఓ ఆశా వర్కర్ పై ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తి దాడికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. వివరాలు సేకరించటానికి వెళ్ళిన ఆశా వర్కర్ పై అతను ,అతని కుటుంబం దుర్భాషలాడుతూ దాడికి దిగబోయారు. దీంతో వెంటనే వారు అక్కడి నుంచి ఆమె డీ అండ్ హెచ్ వో ఆఫీలో అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వే చెయ్యాలంటే భయపడుతున్న ఆశావర్కర్లు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు .. రక్షణ కావాలని విజ్ఞప్తి పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లి ఫిర్యాదు చేసిన ఆమె తమకు రక్షణ లేదని వాపోయారు . అయితే ఆశా వర్కర్లు ప్రజల క్షేమం కోసమే ప్రభుత్వ ఆదేశాల మేరకు , వారి ఆరోగ్యం కోసం సర్వే చేస్తుంటే వారిక సహకరించాల్సింది పోయి ఇలా దాడులకు పాల్పడుతున్న తీరు విస్మయం కలిగిస్తుంది. చాలా మంది మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు పోలీసులకు, వైద్యులకు సహకరించకపోవటం పరిస్థితి ఎలా మారుతుందో అన్న భయం ఆకలిగిస్తుంది. ఇంటింటికీ తిరిగి అనుమానితులను గుర్తించి, వైద్య పరీక్షలు చేయించి, వారికి అవగాహన కల్పించడంలో ఆశా వర్కర్లది కీలక పాత్ర. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజల రక్షణే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం రూ.కోట్ల సంపదను సైతం ప క్కన పెట్టి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రెండు వారాలుగా లాక్ డౌన్ ప్రకటించి, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో వైద్య సిబ్బందిలో భాగమైన ఆశా వర్కర్ల సేవలు వెలకట్టలేనివి. క్షేత్రస్థాయిలో కరోనా చైన్ ను తెంచేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. జిల్లాలోని 20 పీ హెచ్ సీ పరిధిలో 672 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,991 అనుమానితులను ఏం క్వారంటైన్లో ఉంచారు. వీరిలో 946 మంది క్వారంటైన్ గడువు పూర్తి కాగా మరో 1,045 మంది సం క్వారంటైన్లో కొనసాగుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసు లేకపోవడంతో జిల్లా ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. డోర్ టూ డోర్ సర్వే.. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రకటించిన నాటి నుంచి ఆశా వర్కర్లు రంగంలోకి దిగారు. కరోనా కట్టడి చేసేందుకు సర్వైలెన్స్ టీంల్లో భాగస్వాములవుతూ ఇంటింటికీ తిరిగి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారికి వైద్య పరీక్షలు చేయించారు. ఎప్పటికప్పుడు సర్వేలో గుర్తించిన అనుమానితుల వివరాలు మండల వైద్యాధికారి దృష్టికి తీసుకొస్తున్నారు. నిత్యం గ్రామాల్లో ఇతర దేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి, వైద్య సిబ్బందికి తెలియజేయడం, అనుమానితులను హెూం క్వారంటైన్లో పెట్టించడంతో పాటు నిత్యం వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. దేశాన్ని గడగడలాడిస్తున్న మర్కజ్ లింకును గుర్తించడంలో ఆశా వర్కర్లది కీలక పాత్ర. ఇంటింటికీ తిరుగుతూ వారి వివరాలు సేకరించి, వైద్యాధికారులు, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.