రంగంలో దిగమంటారా?

ఏపీ సర్కారు శాంతిభద్రత వైఫ్యంపై హైకోర్టు సీరియస్‌

`కేంద్రం జోక్యం చేసుకోవాని రాస్తాం
`తదుపరి వ్యవహారాన్ని చూసుకుంటుంది
`క్షేత్ర స్థాయిలో జరుగుతోంది వేరు.. కోర్టులో చెబుతోంది వేరు
`రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
`భూమును లాక్కోవద్దన్న ఎస్సీ, ఎస్టీపై కేసు పెడతారా?
 కోడ్‌ అమల్లోకి వచ్చినందున ఇళ్ల పట్టా పంపిణీ వద్దు
`ఇరకాటంలో పడ్డ జగన్‌ సర్కారు
`దిద్దుబాటు చర్యపై దృష్టి సారింపు

‘‘కోర్టులో మీరు చెప్పేది వేరు.. క్షేత్ర స్థాయిలో జరుగుతోంది వేరు… పోలీసు తీరు ఇలాగే కొనసాగితే కేంద్ర హోంశాఖకు రాస్తాం. కేంద్ర ప్రభుత్వం తదుపరి వ్యవహారం చూసుకుంటుంది. రెవెన్యూ అధికాయి రికార్డుల్లో పేర్లను తారుమారు చేస్తారా? వారిపై ఐపీసీ 467 (ఫోర్జరీ), 468 సెక్షన్ల కింద కేసు పెట్టండి. అధికారులే ఇలా రికార్డును తారుమారు చేయడం వ్యవస్థను అవహేళన చేయడమే’’ – హైకోర్టు

అమరావతి:
ఏపీలో స్ధానిక ఎన్నిక పోరుకు ముందు, ఆ తర్వాత చోటు చేసుకున్న దాడుకు సంబంధించి హైకోర్టు సీరియస్‌ అయిన 24 గంటల్లోనే కేంద్రం కూడా గవర్నర్‌ నివేదిక కోరింది. ఏపీలో తాజా శాంతి భద్రత పరిస్ధితిపై ఓ నివేదిక పంపాని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కు కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చింది. ఏపీలో టీడీపీకి చెందిన పువురు నేతపై స్ధానిక ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న దాడు, అంతకు ముందు విశాఖ విమానాశ్రయంలో విపక్ష నేత చంద్రబాబును అడ్డుకోవడంపై కేంద్ర హోంశాఖ స్పందించి నివేదిక కోరినట్లు తొస్తోంది.
ఏపీలో స్ధానిక ఎన్నికు సమీపిస్తున్న నేపథ్యంలోనే విశాఖ పర్యటనకు వెళ్లిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ కార్యకర్తు అడ్డుకున్నారు. దీంతో ఆయన విశాఖ పర్యటనకు వెళ్లకుండానే విమానాశ్రయం నుంచే వెనుదిరిగారు. తాజాగా గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ కార్యకర్తపై దాడుతో పాటు పల్నాడు వెళ్తున్న టీడీపీ నేతు బోండా ఉమ, బుద్ధా వెంకన్న కారుపై సైతం దాడు జరిగాయి. ఇందులో వైసీపీ నేతు పాుపంచుకున్నట్లు పోలీసు నిర్ధారించారు. అయితే ఇవన్నీ స్ధానిక ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న దాడులేనని వైసీపీ సర్కారు చెబుతోంది.
దాడుపై హైకోర్టు సీరియస్‌..
విశాఖ పర్యటన సందర్భంగా విపక్ష నేతకు అనుమతి ఇచ్చి, ఆ తర్వాత తిరిగి 151 సెక్షన్‌ కింద నోటీసు ఇచ్చి వెనక్కి పంపడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వైసీపీ కార్యకర్తు విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకోవడంపై స్పందించిన హైకోర్టు.. చర్యు తీసుకుంటారా లేక మమ్మల్ని తీసుకోమంటారా అని ప్రశ్నించింది. దీంతో ఈ వ్యవహారం వైసీపీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో డీజీపీ సవాంగ్‌ కు కూడా హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి రావడం సమస్యగా మారింది.
పల్నాడులో ఎన్నిక దాడు
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో స్ధానిక ఎన్నికల్లో నామనేషన్లు దాఖు చేయడానికి వెళుతున్న టీడీపీ అభ్యర్ధును వైసీపీ కార్యకర్తు పుచోట్ల అడ్డుకున్నారు. అదే సమయంలో విజయవాడ నుంచి వారిని పరామర్శించడానికి బయుదేరిన టీడీపీ నేతు బోండా ఉమ, బుద్ధా వెంకన్న కారుపైనా వెదురు బొంగుతో వైసీపీ నేత కిషోర్‌ దాడికి ప్పాడ్డారు. అయితే ఈ దాడును స్ధానిక పోరులో భాగంగానే చూడాని హోంమంత్రి సుచరిత చెప్పుకొచ్చారు. అంతే కాదు టీడీపీ నేతు బయటికి వెళ్లటప్పుడు పోలీసుకు సమాచారం ఇచ్చి వెళ్లాని కూడా సహా ఇచ్చారు.
‘గతంలో ఇచ్చిన భూముకు పరిహారం ఇచ్చి తీసుకోవడం.. ఆ తీసుకున్న భూముల్ని మరొకరికి ఇవ్వడం.. మళ్లీ పరిహారం చెల్లించి ఇచ్చిన భూముల్ని తీసుకోవడం.. ఇంకొకరికి ఇవ్వడం… ఇదేం పద్ధతి?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిదీసింది. భూమి లేని నిరుపేద పేరు చెప్పి గతంలో ఇచ్చిన అసైన్డ్‌ భూముల్ని తీసుకుని ఇతర పేదకు అసైన్డ్‌ చేయడం ఎందుకు? తమ భూమును లాక్కోవద్దని ఆందోళన చేస్తున్న ఎస్సీ, ఎస్టీపై కేసు పెడతారా? మీ తీరు సరి కాదు’ అని స్పష్టం చేసింది. ఇళ్ల స్థలాకు భూమిని సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్ల స్థలా కోసం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అసైన్డ్‌ భూముల్ని అధికాయి బవంతంగా తీసుకోవడాన్ని నిువరించాని, ప్రభుత్వ భూమిని స్వాధీనంలో ఉంచుకున్న పట్టాు లేని పేదను ఖాళీ చేయించకుండా ఆదేశాు జారీ చేయాని కోరుతూ ‘కువివక్ష వ్యతిరేక పోరాట సంఘం-కేవీపీఎస్‌) ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
‘తమకు అందిన లేఖతో జత చేసిన ఫొటోను చూస్తుంటే బవంత భూసమీకరణకు జేసీబీు తెచ్చినట్లున్నారు. పక్కన కొట్టేసిన చెట్లున్నాయి. చెట్లు కొట్టేయడం నేరం. ఆ చర్య సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం. అందుకు బాధ్యులైన అధికారులెవరో చెప్పండి. చర్యకు ఆదేశిస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఏజీ శ్రీరాం బదులిస్తూ… భూముల్ని వెనక్కి తీసుకున్నందుకు పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం భూమును తీసుకోవచ్చని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఎంత మందికి పరిహారం చెల్లించారు? తీసుకున్న భూముకు సంబంధించిన రికార్డును మా ముందు ఉంచండి’ అని ఏజీకి తేల్చి చెప్పింది. విచారణను వాయిదా వేసింది.
అధికారులే రికార్డును  తారుమారు చేయడమా?
విశాఖ జిల్లాలోని దొండపూడి గ్రామంలో తమ వ్యవసాయ భూముల్లో రావికమతం తహసీల్దారు జోక్యం చేసుకోవడాన్ని నిువరించాని కోరుతూ 74 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం రెవెన్యూ, పోలీసు అధికారు తీరును తీవ్రంగా తప్పుపట్టింది.
‘పంటను ధ్వంసం చేస్తున్నట్లు ఫొటోల్లో ఉంది. పోలీసు సహకారంతో భూమును స్వాధీనం చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. తీవ్రమైన నేరం జరిగితేనే పోలీసు ఆ ప్రాంతానికి వెళ్లాలి. అలాంటి పరిస్థితి లేనప్పుడు పోలీసు అక్కడికి ఎందుకు కెళ్లారు. పోలీసు తీరు ఇలా ఉంది కాబట్టే మిమ్మల్ని కోర్టుకు పిలిపించాం’ అని డీజీపీ గౌతం సవాంగ్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసు చర్యను ఏజీ సమర్థించే ప్రయత్నం చేశారు. ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.
విశాఖ జిల్లాలో ఇళ్ల స్థలా పంపిణీ కోసం సుమారు 6వే ఎకరా అసైన్డ్‌ భూముల్ని నిబంధనకు విరుద్ధంగా అధికాయి సమీకరిస్తున్నారని పేర్కొంటూ ‘భూసేకరణ ల్యాండ్‌ పూలింగ్‌ రైతు కూలీ నిర్వాసితు సంక్షేమ సంఘం’ దాఖు చేసిన పిల్‌పై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హడావుడిగా భూములెందుకు సమీకరిస్తున్నారని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఎన్నిక ప్రకటన జారీ అయిన నేపథ్యంలో ఇళ్ల స్థలాను కేటాయించొద్దు’ అని ఏజీకి సూచించింది.