ఐఫా వేడుకు వాయిదా

 ప్రతిష్టాత్మక సినీ ఉత్సవంపై పడిన కరోనా ప్రభావం

ముంబయి: కరోనా ఎఫెక్ట్‌ వ్ల 21వ ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డు (ఐఫా) ఉత్సవం వాయిదా పడిరది. మార్చి చివరిలో భోపాల్‌లో ఈ వేడుకను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాు జరిగాయి. అయితే కరోనా వైరస్‌ ప్రభావం వ్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కొత్త తేదీని నిర్వాహకు ప్రకటించాల్సి ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత ‘ఐఫా’ వేడుకల్ని వాయిదా వేసినట్లు నిర్వాహకు పేర్కొన్నారు.
కరోనా భారత ప్రజల్ని కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు మన దేశంలో 31 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో హోలీ జరుపుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం సాధ్యమైనంత వరకు ప్రజు గుంపుగా ఏర్పడవద్దని ప్రపంచ వ్యాప్తంగా నిపుణు సూచిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీలో మార్చి 31 వరకు పాఠశాలకు సెవు ప్రకటించారు. మరో పక్క కొన్ని సినిమా షూటింగ్‌ు వాయిదా పడుతున్నాయి. మరికొన్ని సినిమాు విడుద తేదీని మార్చుకుంటున్నాయి.