పెద్దన్న వచ్చింది అందుకేనా?
తక్కువ పెట్టుబడితో వచ్చే సౌకర్యాను ఇతర దేశా నుండి పొందకుండా, దేశం స్వయం సమృద్ధం కాకుండా అడ్డుపడుతున్న దాంట్లో అమెరికా హస్తం ఉంది. అమెరికా విధానాు భారత ప్రజ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయి. అందువ్ల ట్రంప్ భారత పర్యటనలో ఎలాంటి ఆయుధ ఒప్పందాు గాని, వ్యవసాయ ఉత్పత్తు దిగుమతి ఒప్పందాు గాని జరగకుండా నిరాకరించాలి. మన దేశంపై పెట్టిన ఆంక్షను, సుంకమేతర ఆంక్షను ఎత్తివేసే దిశగా అమెరికా అధ్యక్షునిపై ఒత్తిడి తేవాలి. మన ఎగుమతుపై ఎలాంటి ఆంక్షు పెట్టకుండా అమెరికాతో ఒప్పందాు చేసుకోవాలి. రక్షణ ఒప్పందం నుండి అమెరికాకు స్వస్తి పకాలి.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ఎంతో ఆర్భాటంగా వచ్చారు. ఢల్లీి, అహ్మదాబాద్ తదితర నగరా పర్యటనతోపాటు 1.867 బిలియన్ డార్ల వైమానిక ఆయుధ ఒప్పందం, 2.6 బిలియన్ల డార్ల నౌకా హెలికాప్టర్ల ఒప్పందంతో పాటు భారతదేశంతో అనేక వ్యాపార ఒప్పందాను చేసుకోవడానికి ఈ పర్యటనను ఉద్దేశించారు. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలో అమెరికా ప్రజ ఓట్లు సాధించడానికి భారత-అమెరికా వ్యాపార ఒప్పందం సమిధ కాబోతున్నది. అమెరికా తన స్వార్థ ప్రయోజనాు ఆశించి వ్యాపార ఒప్పందాు చేసుకుంటుందే తప్ప ఏ దేశం తోనూ సమాన అవకాశాు ఉండే ఒప్పందాు ఇంత వరకు చేసుకోలేదు. ఇప్పటికే భారత్-అమెరికా మధ్య రక్షణ ఒప్పందంతో పాటు అనేక వ్యాపార ఒప్పందాు కొనసాగుతున్నాయి. 2019లో భారత దేశం నుండి అమెరికాకు 34,409.6 మిలియన్ డార్లు ఎగుమతు కాగా, అమెరికా నుండి భారత దేశానికి వచ్చిన దిగుమతు 57,665.5 మిలియన్ డార్లు. భారతదేశానికి 23,255.9 మిలియన్ డార్ల వ్యాపార లోటు ఉంది. 2018లో 20,846.5 మిలియన్ డార్ల లోటుతో ఉంది. అమెరికాతో జరిగిన వ్యాపార లావాదేవీలో భారతదేశానికి నిరంతరం వ్యాపార లోటు లోనే కొనసాగుతోంది.
భారతదేశం 2025 నాటికి 5 ట్రిలియన్ డార్ల జాతీయ స్థూ ఉత్పత్తికి పెరగడానికి అమెరికా సహకరిస్తుందని ట్రంప్ తన అభిలాషను వెలిబుచ్చారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బం పెంచుకోవడానికి, చైనాతో పోటీకి నివడానికి భారత్‌కు అన్ని విధా సైనిక సహకారం అందిస్తానని ప్రకటించారు. కానీ అమెరికా తన స్వప్రయోజనా కోసం భారత ఆర్థిక వ్యవస్థపై అనేక ఆంక్షు, నిర్బంధాు, దాడు సాగించింది. 2012 జూన్ 24న తుర్కుమెనిస్థాన్, ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్‌తో మన దేశం ఇరాన్ నుండి సహజ వాయువు పైప్ లైన్‌కు ఒప్పందం కుదుర్చుకుంది. 1680 కి.మీ పైప్ లైన్ వేయడానికి నాడు 760 కోట్ల డార్లతో ఒప్పందం కుదిరింది. 2018 నాటికి గ్యాస్ వినియోగం లోకి రావాలి. అయితే ఇరాన్‌పై ఆంక్షు విధించిన అమెరికా, భారత్‌పై ఒత్తిడి తెచ్చి ఈ ఒప్పందాన్ని రద్దు చేయించింది. ఆ పైప్ లైన్ వస్తే గ్యాస్ కొరతను నివారించుకుని పారిశ్రామికంగా భారత్ అభివ ృద్ధి జరిగే అవకాశాున్నాయి. కానీ ఇరాన్ నుండి పెట్రోలియం ఉత్పత్తును కొనుగోు చేయకుండా అమెరికా ఆంక్షు విధించింది. డబ్ల్యుటివో నిర్ణయాకు భిన్నంగా అమెరికా తమ దేశీయ వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుకు అనేక రకా రాయితీను ఇస్తోంది. గ్రీన్ బాక్స్ (అంతర్గత ఉత్పత్తికి ఆర్థిక సహకారం), బ్లూ బాక్స్ (నేరుగా ఉత్పత్తిదారుకు నగదు సహాయం), అంబర్ బాక్స్ (ఉత్పత్తిదారుకు గిట్టుబాటు ధర చెల్లింపు) ద్వారా వే కోట్ల రూపాయ రాయితీను ఇస్తోంది. అంతేకాక సుంకమేతర ఆంక్షను భారతదేశంపై విధించింది. స్పెషల్ 301 (వ్యవసాయ ఉత్పత్తుతో ప్రాణ హాని ఉంటుందని భావిస్తే దిగుమతు నిషేధం), సూపర్ 301 (తమదేశ బహుళజాతి సంస్థకు నష్టం ఉంటే దిగుమతు నిషేధం), హెల్మ్స్ బర్టన్ చట్టం (క్యూబాతో సంబంధాు కొనసాగిస్తే ఆంక్షు విధించడం), డి.అమాటో యాక్ట్ (లిబియా, ఇరాన్ ఉగ్ర దేశాతో సంబంధాు కలిగినట్లు తెలిస్తే ఆంక్షు), ప్రెస్లర్ యాక్ట్ (భారత్, పాకిస్తాన్ దేశాు అణు ఆయుధాు తయారు చేసినచో ఆంక్షు) న్యూక్లియర్ యాక్ట్ (అణు ఉత్పత్తు సాగిస్తున్న భారత్, ఉత్తర కొరియాపై ఆంక్షు విధించడం) పేర్లతో భారత దేశంపై అనేక సందర్భాలో ఆంక్షు విధిస్తోంది. ఒక దశలో మిరపకాయు దిగుమతి చేసుకున్న అమెరికా ఆ మిరపకాయలో ‘రెసిడ్యూస్’ ఉన్నాయని దిగుమతి చేసుకోకపోవడం వ్ల భారత వ్యాపారుకు వే కోట్ల రూపాయల్లో నష్టం జరిగింది. భారత్ నుండి ఎగుమతి చేసిన కాటన్ రెడీమేడ్ దుస్తుకు అమెరికాలో గిరాకీ పెరగగా ఆ దిగుమతు నిషేధానికి ‘రెడీమేడ్ బట్టు నిప్పును త్వరగా ఆకర్షిస్తాయి’ అన్న సాకుతో టెక్స్టైల్ దిగుమతును నిషేధించింది. ‘తాను ఎగుమతి సబ్సిడీు ఇస్తూ భారతదేశం పత్తికి ఎగుమతి సబ్సిడీు ఇవ్వకూడద’ని విధించిన ఆంక్ష ఒప్పందం పై అమెరికాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకం చేశారు. అమెరికా తన వ్యవసాయ రంగానికి 4 శాతం బడ్జెట్ కేటాయించింది. అందులో 8.2 శాతం బీమాకు, రైతుకు లోటు మార్కెట్ ధరను చెల్లించడానికి ఖర్చు చేసింది. భారతదేశం చెరుకు రైతుకు సబ్సిడీ ఇస్తున్నదని (ఇవ్వడం లేదు) డబ్ల్యుటివో లో బ్రెజిల్ అధ్యక్షుడు బ్సోనారో భారత్‌పై కేసు పెట్టించారు. అటువంటి బ్సోనారోను రిపబ్లిక్‌డే దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించింది మన కేంద్ర ప్రభుత్వం. అమెరికా క్లిష్ట పరిస్థితుల్లో అనేక సందర్భాలో భారతదేశం సహకరించింది. కంప్యూటర్లలో 2-కె సమస్యను పరిష్కరించింది భారత ఇంజనీర్లే. విద్యుత్‌శక్తి గ్రిడ్ ఫెయిల్ అయినప్పుడు సహాయపడిరది భారత ఇంజనీర్లు. అమెరికాలో కనుగొన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో కీక పాత్ర పోషిస్తున్నది భారత శాస్త్రవేత్తు, ఇంజనీర్లే. భారతదేశం నుండి బ్ధి పొందుతున్న అమెరికా ఈ దేశాన్ని అభివ ృద్ధి కాకుండా అనేక ఆటంకాు కలిగిస్తోంది. కశ్మీర్ సమస్యకు మధ్యవర్తిగా ఉంటానని పదేపదే చెబుతోంది. భారతదేశం నిరాకరించినప్పటికీ నేటికీ తన పట్టు వదడం లేదు. భారత-పాకిస్తాన్‌కు తానే ఆయుధాు సరఫరా చేసి ఉద్రిక్తతకు ఆజ్యం పోస్తోంది. ప్రపంచంలో అమెరికా జరుపుతున్న అన్ని యుద్ధాల్లోకి భారతదేశాన్ని లాగడానికి జరిగిన ప్రయత్నాు భారత ప్రజు మర్చిపోలేదు.
అమెరికాలో ఉన్న భారత పౌరుకు వీసాు ఇవ్వడంలో, అక్కడ ఉద్యోగాు చేస్తున్న వారికి రక్షణ ఇవ్వడంలో ట్రంప్ అధికారానికి వచ్చిన తరువాత నిరంతరం ఆందోళను కలిగే చట్టాను కొనసాగిస్తున్నారు. అమెరికాలో జన్మించిన భారత పౌరుకు సహజంగా వచ్చే పౌరసత్వాన్ని సవరించి పౌరసత్వం లేకుండా చేయాన్న ప్రయత్నాు జరుగుతున్నాయి. ఇన్ని విధాలా భారతదేశానికి అంతర్జాతీయ రంగంలోను, దేశీయంగాను నష్టాకు బాధ్యుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన గొపు కోసం భారత్‌తో ఒప్పందం చేసుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. నిన్నగాక మొన్న అవిశ్వాస తీర్మానం నుండి బయటపడి నేరుగా భారతదేశ పర్యటనను ఎంచుకోవడాన్ని గమనించాలి. భారతదేశంలో అమవుతున్న సంస్కరణను మరింత ఉధ ృతం చేయడానికి అమెరికా ఒత్తిడి ప్రధానంగా ఉంది. ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వేు, జీవితబీమా, ఓఎన్జిసి, విమాన రంగంలో మౌలిక వసతును ప్రైవేటీకరించాని నిరంతరం ఒత్తిడి తెస్తున్న అమెరికా భారతదేశం 5 ట్రిలియన్ డార్ల అభివ ృద్ధికి చేరుకోవడానికి చిత్తశుద్ధితో సహకరిస్తుందా ?
గత అమెరికా పాకు చర్యను గమనిస్తే భారతదేశం అభివ ృద్ధిలోకి రాకుండా, అన్ని రంగాలో తమకు జూనియర్ భాగస్వామిగా ఉండాని కోరుకుంటున్నారే తప్ప వారికి మరో ఆలోచన లేదు. తక్కువ పెట్టుబడితో వచ్చే సౌకర్యాను ఇతర దేశా నుండి పొందకుండా, దేశం స్వయం సమ ృద్ధం కాకుండా అడ్డుపడుతున్న దాంట్లో అమెరికా హస్తం ఉంది. కొంత మంది అగ్రరాజ్యంతో అనుకూంగా ఉంటే దేశం అభివ ృద్ధిలోకి వస్తుందని ఆధారాు లేకుండా ప్రచారాు చేస్తున్నారు. 2008 నుండి ప్రారంభమైన ఆర్థిక మాంద్యం నేటికీ కొనసాగుతుండడానికి అమెరికా దాని జి-7 దేశాలే ప్రధాన కారణం. భారత గుత్త పెట్టుబడిదారుకు అండదండు కల్పించే అమెరికా విధానాు భారత ప్రజ అభివ ృద్ధికి ఆటంకంగా మారుతున్నాయి. అందువ్ల ట్రంప్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఆయుధ ఒప్పందాు గాని, వ్యవసాయ ఉత్పత్తు దిగుమతి ఒప్పందాు గాని జరగకుండా నిరాకరించాలి. మన దేశంపై పెట్టిన ఆంక్షను, సుంకమేతర ఆంక్షను ఎత్తివేసే దిశగా అమెరికా అధ్యక్షునిపై ఒత్తిడి తేవాలి. మన ఎగుమతుపై ఎలాంటి ఆంక్షు పెట్టకుండా అమెరికాతో ఒప్పందాు చేసుకోవాలి. రక్షణ ఒప్పందం నుండి అమెరికాకు స్వస్తి పకాలి. రెండు దేశా మధ్య సౌభ్రాత ృత్వ సంబంధాు కొనసాగాలే తప్ప, పరస్పర గౌరవం ఉంచుకోవాలే తప్ప బాస్-జూనియర్ తరహా సంబంధాు కొనసాగించడం భారత సార్వభౌమాధికారానికి అత్యంత ప్రమాదకరం.
