అసు దేశంలో న్యాయం ఉందా..?

టెలికాం సంస్థపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

దిల్లీ: టెలికాం సంస్థపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ ఛార్జీ కింద బకాయి పడ్డ రూ.వే కోట్లను ఇంకా ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల్ని ఎందుకు పాటించలేదంటూ కడిగి పారేసింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాని సమన్లు జారీ చేసింది. సంస్థ నుంచి బకాయిను రాబట్టడంలో విఫలైమన ప్రభుత్వంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ ఛార్జీ కింద టెలికాం సంస్థు ప్రభుత్వానికి రూ.92,000 కోట్లు చెల్లించాని కోర్టు గతంలో ఆదేశించింది. ఇప్పటి వరకు బకాయిు చెల్లించకపోవడంతో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎంటీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, రియన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా టెలికమ్యూనికేషన్స్‌ సహా మిగిలిన టెలికాం సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ టెలికాం విభాగంలోని డెస్క్‌ ఆఫీసర్‌పై న్యాయమూర్తు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును ప్రభావితం చేసేలా ఆదేశాు జారీ చేసినందుకు న్యాయస్థానం మందలించింది. ‘‘ఈ నాన్సెన్స్‌ పను ఎవరు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. దేశంలో అసు న్యాయం ఉందా?. వారు ఈ దేశంలో జీవించడం కంటే విడిచివెళ్లడం మేలేమో’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఏజీఆర్‌ ఛార్జీను వసూు చేయడంలో సంస్థపై ఒత్తిడి తేవొద్దని డెస్క్‌ ఆఫీసర్‌ అధికారుకు లేఖ రాసినట్లు కోర్టు ద ృష్టికి వచ్చింది. అలాగే ఎలాంటి చర్యు కూడా తీసుకోవద్దని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోర్టు ఆఫీసర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తొస్తోంది