క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖు

మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాని నిర్భయ దోషి వినతి

న్యూఢల్లీి: నిర్భయ హత్యాచార ఘటనలో దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా (25) సుప్రీం కోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖు చేశాడు. తన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాని పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీంతో పాటు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన డెత్‌ వారెంట్లపై స్టే విధించాని అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ శుక్రవారం పిటిషన్‌ దాఖు చేశారు. నుగురు నిర్భయ దోషుల్లో ఇప్పటి వరకు ఎలాంటి న్యాయపరమైన అవకాశాు వినియోగించుకోని దోషి పవన్‌ గుప్తా ఒక్కడే. దీని తర్వాత రాష్ట్రపతికి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ కేసులో దోషులైన ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ (32), వినయ్‌ కుమార్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ (31) ముగ్గురూ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవడం.. తిరస్కరణకు గురవ్వడం జరిగింది. దీన్ని సవాల్‌ చేస్తూ ముకేశ్‌, వినయ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించడంపై అక్షయ్‌ ఎలాంటి పిటిషన్‌ దాఖు చేయలేదు.
నిర్భయ దోషుల్లో ఒకరి తర్వాత ఒకరు క్యూరేటివ్‌ పిటిషన్‌, క్షమాభిక్ష పిటిషన్‌ పేరిట కాయాపన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వారి ఉరితీత పుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మార్చి 3న ఉదయం 6 గంటకు నుగురు దోషునూ ఉరితీసేందుకు ఈ నె 17న దిల్లీ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసింది. తాజాగా పవన్‌ గుప్తా పిటిషన్‌ నేపథ్యంలో మరోసారి ఉరితీత అము ఆస్యమయ్యే సూచను కనిపిస్తున్నాయి.