‘నమస్తే ట్రంప్‌’కు వంద కోట్లా?

ప్రియాంక గాంధీ

న్యూఢల్లీి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాక సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తుండటంపై  కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా ప్రశ్న వర్షం కురిపించారు. ఏ మంత్రిత్వ శాఖ ఈ ఖర్చు పెడుతోందని ఆమె ప్రశ్నించారు.  ‘ట్రంప్‌ పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సొమ్ము ఓ కమిటీ ద్వారా ఖర్చు పెడుతున్నారు. అందులోని మెంబర్లకే తాము మెంబర్లమని తెలియదు. ఈ కమిటీకి ఏ మంత్రిత్వ శాఖ డబ్బు ఇస్తుందో తొసుకునే హక్కు దేశ ప్రజకు లేదా? కమిటీ పేరుతో అసు విషయాను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోంది?’ అని ప్రియాంక హిందీలో రాసిన ఓ ట్వీట్‌లో నిదీశారు. ఈ అంశానికి సంబంధించి ఒక హిందీ వార్తాపత్రిక రాసిన వార్తను కూడా ట్వీట్‌కు ఆమె జతచేశారు. అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాన్ని నాగరిక్‌ అభినందన్‌ సమితి(డీటీఎన్‌ఏఎస) అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ నె 24 నుంచి 25 వరకూ డొనాల్డ్‌ ట్రంప్‌ తన కుటుంబసభ్యుతో కలిసి ఇండియాలో పర్యటించనున్నారు