ఎవరు బాధ్యత వహిస్తున్నారు?’

పుల్వామా దాడి: రాహుల్‌ మూడు ప్రశ్ను

దిల్లీ: పుల్వామా దాడి జరిగి సరిగ్గా నేటికి ఏడాది అవుతున్న సందర్భంగా అధికార భాజపాపై విమర్శ దాడికి దిగారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ. ఈ దాడి వ్ల ఎవరికి ప్రయోజనం కలిగిందంటూ ప్రభుత్వానికి మూడు ప్రశ్ను సంధించారు. ‘పుల్వామా దాడిలో ప్రాణాు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్‌ అమర జవాన్లను మనం ఈ రోజు స్మరించుకుంటున్నాం. ఈ సందర్భంగా కేంద్రాన్ని మనం అడగాల్సినవి ఇవే.. 1. ఈ దాడితో ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరింది? 2. దాడిపై చేపట్టిన దర్యాప్తులో ఏం తేలింది? 3. దాడికి కారణమైన భద్రతా లోపాకు భాజపా ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తున్నారు?’ అని రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్న వర్షం కురిపించారు.
గతేడాది ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడితో యావత్‌ భారతం ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. మన భద్రత, నిఘా వ్యవస్థపై అనేక సందేహాకు ఈ దాడి కారణమైంది. ఈ దాడి తర్వాత ప్రభుత్వంపై విమర్శు మ్లెవెత్తాయి. మరోవైపు ఇటీవ ఉగ్రవాదుకు సాయం చేస్తూ పట్టుబడిన కశ్మీర్‌ పోలీసు అధికారి దవీందర్‌ సింగ్‌కు కూడా పుల్వామా దాడితో సంబంధం ఉందని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ చేసిన తాజా ట్వీట్‌ మరోసారి రాజకీయ వివాదానికి తెరతీసే అవకాశం కన్పిస్తోంది.