ట్రంప్‌నకు మరపురాని స్వాగతం

అమెరికా అధ్యక్షుడి పర్యటన ఏర్పాట్లపై ప్రధాని వ్యాఖ్య

న్యూఢల్లీి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా భారత్‌లో సాదర స్వాగతం పుకుతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ట్రంప్‌ పర్యటనపై మోదీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ పర్యటన ఇరుదేశా మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ‘ఈ నె చివర్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన సతీమణి మెలానీయా భారత్‌ పర్యటనకు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ అతిథుకు భారత్‌ మర్చిపోలేని స్వాగతం పుకుతుంది. ఈ పర్యటన చాలా ప్రత్యేకం. భారత్‌-అమెరికా మధ్య స్నేహబంధాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామ్యం, బహుళత్వానికి రెండు దేశాు కట్టుబడి ఉన్నాయి. విస్త ృత అంశాల్లో భారత్‌, అమెరికా పరస్పర సహకారం అందించుకుంటున్నాయి. ఇరు దేశా బమైన స్నేహబంధం మన దేశా ప్రజకే గాక.. యావత్‌ ప్రపంచానికి ఉపయుక్తంగా ఉంటుంది’ అని మోదీ వరుస ట్వీట్లలో చెప్పుకొచ్చారు.
భారత పర్యటన కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని ట్రంప్‌ ప్రకటన చేసిన కొద్ది గంటకే మోదీ ఈ ట్వీట్లు చేశారు. ఈ నె 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం మంగళవారం అధికారికంగా వ్లెడిరచింది. దీనిపై ట్రంప్‌ నేడు స్పందిస్తూ.. ఈ పర్యటన కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. అంతేగాక, భారత్‌లో క్షలాది మంది తనకు స్వాగతం పకబోతున్నట్లు మోదీ తనతో చెప్పారని అన్నారు. కనీసం 50క్ష నుంచి 70క్ష మంది స్వాగతం పలికేందుకు రావాని సరదాగా వ్యాఖ్యానించారు.
భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. భారత్‌లో క్షలాది మంది ప్రజు తనకు స్వాగతం చెప్పబోతున్నారన్నారు. మోదీ గొప్ప వ్యక్తి అని, తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు. గతవారం మోదీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. క్షలాది మంది ప్రజు విమానాశ్రయం నుంచి క్రికెట్‌ స్టేడియం వరకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని మోదీ తనతో తెలిపారన్నారు. అమెరికాలో వచ్చినట్లుగా 40 వే నంచి 50 వే మంది వస్తే తనకు అంతగా నచ్చదని.. కనీసం 50 క్ష నుంచి 70 క్ష మంది రావాని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రికెట్‌ స్టేడియంలో తమ సభ జరగబోతోందన్నారు. అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మిస్తున్న ‘మొటెరా’ క్రికెట్‌ స్టేడియంలో ‘హౌడీ-మోదీ’ తరహాలో భారీ సభ జరిగే అవకాశం ఉన్నట్లు తొస్తోంది. భారత్‌తో వాణిజ్యం ఒప్పందంపై మాట్లాడుతూ.. ‘‘సరైన ఒప్పందం చేసుకోగలిగే అవకాశం ఉంటే ఒప్పందం కుదురుతుందని’’ వ్యాఖ్యానించారు. మంగళవారం శ్వేతసౌధంలో విలేకరుతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యు చేశారు.
ట్రంప్‌ తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. భార్య మెలానియాతో కలిసి ఈ నె 24, 25 తేదీల్లో ఆయన దిల్లీ, అహ్మదాబాద్‌లో పర్యటిస్తారు. ఉభయ దేశా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రజ మధ్య సంబంధాను బలోపేతం చేసేందుకు వీరి పర్యటన దోహదపడుతుందని శ్వేతసౌధం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ట్రంప్‌ భారత పర్యటనకు వస్తున్నట్టు విదేశీ వ్యవహారాశాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు.