చేతులెత్తి మొక్కుతున్నా.. వారిని ఉరితీయండి
కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న నిర్భయ తల్లి
న్యూఢల్లీి: ‘మేమూ మనుషుమే. ఏడేళ్లయింది. నా కూతురికి ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది. మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి దోషును ఉరితీయండి’ అని నిర్భయ తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నిర్భయ దోషు ఉరితీతకు కొత్త తేదీని నిర్ణయించవచ్చని సుప్రీంకోర్టు నిన్న కీక వ్యాఖ్యు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషు శిక్ష అముకు కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాని కోరుతూ నిర్భయ తల్లిదండ్రు, దిల్లీ ప్రభుత్వం దిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది.
అయితే తన తరఫున వాదించేందుకు న్యాయవాది ఎవరూ లేరంటూ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా కోర్టుకు విన్నవించాడు. దీంతో అతడి తక్షణమే కోర్టు న్యాయ సహాయం అందించింది. ఎంపానెల్డ్ న్యాయవాదు జాబితాను ఇచ్చి లాయర్‌ను ఎంచుకోవాని సూచించింది. అనంతరం డెత్ వారెంట్ల పిటిషన్లపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన నిర్భయ తల్లి కోర్టు గదిలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘వ్యవస్థపై నాకు నమ్మకం పోతోంది. ఉరితీతను ఆస్యం చేసేందుకు దోషు అనేక ప్రయత్నాు చేస్తున్నారు. న్యాయస్థానం వీటిని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు పవన్ గుప్తాకు కొత్త లాయర్‌ను ఏర్పాటు చేస్తే ఆ న్యాయవాది కేసును ఫైల్ చేయడంలో మరింత ఆస్యం చేస్తారు. ఓ బాధితురాలి తల్లిని నేను. నా హక్కు గురించి ఆలోచించరా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘మీ హక్కు గురించి మా అందరికీ తొసు. దానికి అనుగుణంగానే విచారణు సాగుతున్నాయి. అయితే ప్రతి దోషికీ తన చివరి శ్వాస వరకు న్యాయ సహాయం పొందే అర్హత ఉంది ’ అని వ్లెడిరచారు.