పారాసైట్‌కు అస్కార్ పంట
అంగరంగ వైభవంగా లాస్‌ఏంజిల్స్‌లో ఆస్కార్ పండగ
సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డు ‘ఆస్కార్’ ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. సినీ ప్రియుకు పండగ లాంటి ఆస్కార్ వేడుకకుహాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథు హాజరయ్యారు. విభిన్న దుస్తు ధరించిన నటీమణు తమ అందచందాతో వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు.
‘జోకర్’లో అద్భుత నటనకుగానూ వాకిన్ ఫీనెక్స్ ఉత్తమ నటుడిగా అవార్డును దక్కించుకోగా, ‘జూడీ’ చిత్రంలో నటనకు రెనీ జెల్‌వెగర్‌ను ఉత్తమ నటి పురస్కారం వరించింది. ఇక ఉత్తమ చిత్రంగా ‘పారాసైట్’ నిలిచింది. హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ చిత్రంలో నటనకు గానూ ఆయన్ని ఈ అవార్డువరించింది. ఇక ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ చిత్రంగా ‘టాయ్ స్టోరీ 4’కు అవార్డు భించింది.
దక్షిణ కొరియా చిత్రం పారాసైట్‌కు ఆస్కార్ అవార్డు పంట పండిరది. మొత్తం నాుగు కేటగిరీల్లో నాుగు అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌పై్లతో పాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ పిల్మ్ విభాగాల్లో అస్కార్ అవార్డును దక్కించుకుంది. ముందు నుండి ఎన్నో అంచనాని పెంచుకున్న పారాసైట్ చిత్రం ఆస్కార్ కిరీటం దక్కించుకోవడం విశేషం.మేకింగ్‌తో పాటు కంటెంట్‌లోను హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఈ సినిమాను తెరకెక్కించారు. డార్క్ థ్ల్రిర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఓ ధనిక కుటుంబాన్ని ఓ పేదకుటుంబం తెలివిగా బోల్తా కొట్టించివాళ్ల ఇంట్లో పనిలోకి ప్రవేశిస్తుంది. పేద, ధనిక అంతరా వన సమాజంలో ఎలాంటి విపత్కర పరిస్థితు ఏర్పడుతాయో పారా సైట్ అనే చిత్రం ద్వారా దర్శకుడు బాంగ్ జోన్-హో చూపించారు. లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్న 92వ ఆస్కార్ అవార్డ్ వేడుకలో పారాసైట్ చిత్రంతో పాటు జోకర్, 1917 చిత్రాు కూడా తమ హవాను చూపాయి. జోకర్ చిత్రానికి గాను హీరో జోక్విన్ ఫినిక్స్‌ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఇక 1917 సినిమా మూడు విభాగాల్లో (విజువల్ ఎఫెక్ట్, సౌండ్ మిక్సింగ్, సినిమాటోగ్రఫీ) అవార్డును ఎగరేసుకుపోయింది.
విజేతు వీరే..
` ఉత్తమ చిత్రం: పారాసైట్
` ఉత్తమ నటి: రెనీ జెల్‌వెగర్ (జూడీ)
`ఉత్తమ నటుడు: వాకిన్ ఫీనెక్స్(జోకర్)
`ఉత్తమ దర్శకుడు: పారాసైట్ (బోన్‌జోన్ హో)
` ఉత్తమ సంగీతం: జోకర్ (హిల్దార్)
` మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: బాంబ్ షెల్
`ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: పారాసైట్
` ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: 1917 (రోచ్‌రాన్, గ్రెగ్ బట్లర్, డోమినిక్ తువే)
` ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ(మైఖేల్ మెక్‌సుకర్, ఆండ్రూ బక్‌ల్యాండ్)
` ఉత్తమ సినిమాటోగ్రఫీ: 1917(రోజర్ డికెన్స్)
` ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ(డొనాల్డ్ సిల్వెస్టర్)
` ఉత్తమ సౌండ్ మిక్సింగ్: 1917(మార్క్ టేర్, స్టువర్ట్ వ్సిన్)
`ఉత్తమ సహాయనటి: లారా డ్రెన్(మ్యారేజ్ స్టోరీ)
` ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్ పిట్( వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
` ఉత్తమ యానిమేషన్ చిత్రం: టాయ్ స్టోరీ4
`ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: బాంగ్ జూన్ హో (పారాసైట్)
`ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: హెయిర్ వ్
` ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: తైకా వెయిటిటి (జోజో ర్యాబిట్)
` ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్- ది నైబర్స్ విండో
` ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
` ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: జాక్వెలిన్ దురన్ (లిటిల్ విమన్)
` ఉత్తమ డాక్యుమెంటరీ(ఫీచర్): అమెరికన్ ఫ్యాక్టరీ