ప్రార్థనా మందిరాల ప్రవేశంపై

విచారణ వాయిదా

న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల సహా ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే స్పష్టంచేశారు. విచారణ చేపట్టాల్సిన అంశాల క్రోడీకరణ కోసం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఈ అంశంపై వాదనలు వినిపించేందుకు న్యాయవాదులకు సమయం చెబుతామని ఎస్‌ఏ బోబ్డే నేతత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. శబరిమలపై దాఖలైన రివ్యూ పిటిషన్లతో పాటు ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపైనా రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోలేదని సీజేఐ వెల్లడించారు. మత విశ్వాసాలు, వాటిలో జోక్యం చేసుకొనే విషయంలో న్యాయ పరిధిపై మాత్రమే విచారణ ఖరారు చేయనున్నారు.