సరిలేరు మనకెవ్వరూ!

సర్వేలన్నీ మనకే అనుకూలం..120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో మనదే విజయం..శ్రేణులకు సీఎం దిశానిర్దేశం

  • -పురపాలిక ఓడితే.. మంత్రి పదవికి గండం
  • – మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు
  • -బీజేపీ పోటీ కాదు..అపోహలు వద్దు
  • -అఖండ విజయంతో గెలుస్తున్నాం
  • -అవసరం ఉన్నచోట మంత్రుల ప్రచారం
  • -ప్రతి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం
  • -అస్మదీయులను ఎమ్మెల్యేలే బుజ్జగించాలి
  • -పార్టీ విస్తతస్థాయి సమావేశంలో కేసీఆర్‌
”బీజేపీ మనకు పోటీ అనే అపోహలు వద్దు. మనకు ఎవరితో పోటీ లేదు. పార్టీ ఒకసారి అభ్యర్థిని ఖరారు చేశాక ఆ అభ్యర్థి గెలుపుకోసమే అందరూ పని చేయాలి. వారి గెలుపు బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే.120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తున్నాం.ఎమ్మెల్యేలంతా పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలి. ఒకసారి అభ్యర్థిని ఫైనల్‌ చేసిన తర్వాత ఆ అభ్యర్థి గెలుపు కోసమే పని చెయ్యాలి. అవసరం ఉన్న చోట మంత్రులు ఎన్నికల ప్రచారం చేస్తారు. టికెట్ల పంపిణీ, రెబల్స్‌ బుజ్జగింపులు అన్నీ ఎమ్మెల్యేలదే బాధ్యత” -కేసీఆర్‌

హైదరాబాద్‌: బీజేపీ పోటీ అనే అపోహలు వద్దని, మనకు ఎవరితోనూ పోటీ లేదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. నియోజకవర్గాల్లో క్యాడర్‌తో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని, పాత కొత్త నాయకులు సమన్వయంతో ఉండాలని సూచించారు. మున్సిపల్‌ ఎన్నికలు సందర్భంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. శనివారం పార్టీ విస్త తస్థాయి సమావేశంలో సీఎం మాట్లాడుతూ 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు. అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారని కేసీఆర్‌ చెప్పారు.
రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలోనూ తెరాస విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో తెలంగాణ భవన్‌లో ఆయన విస్తతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలంతా పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సర్వేలన్నీ తెరాసకే అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా కేసీఆర్‌ అన్నారు.
ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ సూచించారు. మున్సిపాలిటీల గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలతోపాటు, మంత్రులకూ కేసీఆర్‌ అప్పగించారు. ఇతర పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలతో మనకు పోటీ లేదన్న కేసీఆర్‌.. మనకు మనమే పోటీ అని శ్రేణులకు సూచించారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని అన్నారు. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకసారి అభ్యర్థిని ఖరారు చేశాక ఇక ఆ అభ్యర్థి గెలుపు కోసమే అందరూ పని చెయ్యాలని ఆదేశించారు. అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారని తెలిపారు.
పురపాలిక ఓడితే.. మంత్రి పదవికి గండం
అభ్యర్థిక ఎంపిక తర్వాత వచ్చే రెబల్స్‌ సమస్యను ఎమ్మెల్యేలే పరిష్కరించాలని కేసీఆర్‌ సూచించారు. ఈ బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలదేనని చెప్పారు. గ్రూపు రాజకీయాలు తగవని, ఏదైనా కార్పొరేషన్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ కనుక ఓడిపోతే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రుల పదవులకు గండం ఉంటుందని కేసీఆర్‌ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు సానుకూల ఫలితాలు ఉంటాయని కేసీఆర్‌ శ్రేణులకు చెప్పినట్లుగా సమాచారం.
”భాజపా మనకు పోటీ అనే అపోహలు వద్దు. మనకు ఎవరితో పోటీ లేదు. పార్టీ ఒకసారి అభ్యర్థిని ఖరారు చేశాక ఆ అభ్యర్థి గెలుపుకోసమే అందరూ పని చేయాలి. వారి గెలుపు బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే” అని కేసీఆర్‌ అన్నారు. మరికాసేపట్లో ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన సమావేశం నిర్వహించనున్నారు.
సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. 120 మున్సిపాలిటీలు,10 కార్పొరేషన్‌లలో మనమే గెలుస్తున్నాం. బీజేపీ మనకు పోటీ అనే అపోహలు వద్దు. మనకు ఎవరితో పోటీ లేదు. పాత, కొత్త నాయకులు సమన్వయంతో పనిచేయాలి. పార్టీ ఒకసారి అభ్యర్థిని ఫైనల్‌ చేసిన తర్వాత ఆ అభ్యర్థి గెలుపు కోసమే పని చెయ్యాలి. అవసరం ఉన్న చోట మంత్రులు ఎన్నికల ప్రచారం చేస్తారు. టికెట్ల పంపిణీ, రెబల్స్‌ బుజ్జగింపులు అన్నీ ఎమ్మెల్యేలదే బాధ్యత’అని కేసీఆర్‌ అన్నారు. ఇక లంచ్‌ విరామం తరువాత ఉమ్మడి జిల్లాల వారిగా పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం కేసీఆర్‌ తిరిగి సమావేశాన్ని ప్రారంభించారు.
పార్టీ విస్తతస్థాయి సమావేశంలో మంత్రులకు సీఎం కేసీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఒక్క మునిసిపాలిటీ, కార్పొరేషన్‌లో ఓడినా మంత్రి పదవులు ఊడతాయని గులాబీ బాస్‌ హెచ్చరించారు. టికెట్ల పంపిణీ, రెబల్స్‌కు బుజ్జగింపుల బాధ్యత ఎమ్మెల్యేలదేనని కేసీఆర్‌ స్పష్టం చేశారు. శనివారం నాడు సుమారు రెండున్నర గంటలపాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికలపై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనేతలకు కేసీఆర్‌ సలహాలు, సూచనలు ఇచ్చారు.
మనకు ఎవరితోనూ పోటీ లేదు..!
‘120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తున్నాం. సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. బీజేపీ పోటీ అనే అపోహలు వద్దు..మనకు ఎవరితోనూ పోటీ లేదు. నియోజకవర్గాల్లో క్యాడర్‌తో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలి. పాత కొత్త నాయకులు సమన్వయంతో ఉండాలి. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలి. అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారు’ అని సమావేశంలో కేసీఆర్‌ సూచించారు.
గొడవపై కేసీఆర్‌ ఆరా..
ఇదిలా ఉంటే.. సమావేశంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మధ్య జరిగిన గొడవపై కేసీఆర్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది. సమావేశంలోనే సుధీర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారని సమాచారం.మొన్న మేడ్చల్‌ ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనపై సుధీర్‌రెడ్డి వివరణ ఇచ్చారని తెలుస్తోంది.