‌రాష్ట్రమంతటా‘144 సెక్షన్‌’

  • అసెంబ్లీ,పార్లమెంట్‌ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు
  • స్థానికేతరులు ఆయా ప్రాంతాలను విడిచి వెళ్లాలి
  • ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు
  • 13న ఉదయం 7గంట నుంచి సాయంత్రి 6 వరకు పోలింగ్‌
  • ఆం‌ధప్రదేశ్‌ ‌ప్రధాన ఎన్నికల అధికారి మీనా వెల్లడి

అమరావతి,జ్యోతిన్యూస్‌:

ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంట్‌కు మే 13న పోలింగ్‌ ‌జరుగుతున్న క్రమంలో రాష్ట్రం అంతటా 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్‌ ‌శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకే ముగిసిందని ప్రధాన ఎన్నికల అధికారి నా తెలిపారు. ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ ప్రచారం ముగిసిపోయిందన్నారు.144 సెక్షన్‌ ఏపీ వ్యాప్తంగా అమలవుతు ందని చెప్పుకొచ్చారు. అలాగే 6 గంటల తర్వాత స్థానికేతర రాజకీయ నేతలు అంతా ఆయా నియోజకవర్గాల్లో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.అయితే పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయొద్దని హెచ్చరించారు. శనివారం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ ‌కుమార్‌ ‌నా డియా సమావేశం నిర్వహించి పలు విషయాలు వెల్లడించారు. మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ ‌జరుగుతుందని తెలిపారు. 13న 6 పోలింగ్‌ ‌కేంద్రాల్లో 3 చోట్ల 4 గంటలకు, మూడు చోట్ల 5 గంటలకే పోలింగ్‌ ‌ముగుస్తుందని తెలిపారు.టీవీ,రేడియో, సోషల్‌ ‌డియా ద్వారా ప్రచారం ముగుస్తుందని చెప్పారు.పత్రికల్లో ప్రకటనల కోసం ప్రీ సర్టిఫికేషన్‌ ‌తీసుకోవాలని అన్నారు. ఆదివారం సాయంత్రం ఈవీఏంలు తీసుకుని పోలింగ్‌ ‌సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్తారని తెలిపారు. పోలింగ్‌కు 90 నిమిషాల ముందు మాక్‌ ‌పోల్‌ ‌నిర్వహిస్తామని వివరించారు.13 తేదీన సరిగ్గా 7 గంటలకు పోలింగ్‌ ‌మొదలు అవుతుందని ప్రకటించారు.పోలింగ్‌ ఏజెంట్‌కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చామన్నారు.నియోజకవర్గంలో స్థానికుడైన అభ్యర్థి నుంచి ధ్రువపత్రాల తీసుకుంటే ప్రిసైడింగ్‌ అధికారి ఏజెంట్‌గా అనుమతి ఇవ్వొచ్చని వివరిం చారు.అలాగే పోలింగ్‌ ‌కేంద్రానికి 200 టర్ల పరిధిలో రాజకీయ పార్టీలు ఎలాంటి చిహ్నాలు లేకుండా స్లీప్‌లు పంచుకోవచ్చని అన్నారు.అలాగే పోలింగ్‌ ‌రోజు ప్రజల రవాణాను నిరోధించాలని ఎన్నికల సంఘం ఉద్దేశ్యం కాదన్నా రు.ఓటర్లను రాజకీయ పార్టీలు తరలించడం చట్ట వ్యతిరేకమని అన్నారు. అభ్యర్థికి సంబంధించి వాహనాల పరిమితి ఉందన్నారు. మూడు వాహనాల వరకే సదరు అభ్యర్థి వినియోగించుకోవచ్చని చెప్పారు.పోలింగ్‌ ‌కేంద్రాల్లోకి ప్రిసైడింగ్‌ అధికారి మినహా ఎవరూ ఫోన్లు తీసుకెవెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ఓటర్లు కూడా ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదన్నారు.అలాగే ఆయుధాలతో ఎవరూ పోలింగ్‌ ‌కేంద్రాల్లోకి అనుమతించామని స్పష్టం చేశారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ గన్‌ ‌మెన్లతో పోలింగ్‌ ‌కేంద్రాల్లోకి రావొద్దని విజ్ఞప్తి చేశారు.పోలింగ్‌ ‌కేంద్రాల్లో భద్రత కోసం 1,06,145 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నామని సీఈఓ నా తెలిపారు.