తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇవ్వండి

తెలుగు మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించిన డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ ‌రెహమాన్‌

కొత్తగూడెం,జ్యోతిన్యూస్‌ :

2024 ‌జనవరి 5,6,7 తేదీలలో ఆంధప్రదేశ్‌ ‌రాజమండ్రిలో ఆంధ్ర సారస్వత పరిషత్‌,‌చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభల గోడపత్రికను కొత్తగూడెం డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ ‌రెహమాన్‌ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలుగు మహాసభల నిర్వాహకులకు కవులకు, కళాకారులకు డీఎస్పీ రెహమాన్‌ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత,దర్శకులు కొత్తపల్లి శేషు పాల్గొన్నా రు.అనంతరం అంతర్జాతీయ తెలుగు మహాసభల సంచాలకులు,గజల్‌ ‌కవి రాజేష్‌ ‌మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే మహాసభలలో ప్రముఖ గజల్‌ ‌గాయకులు గజల్‌ ‌శ్రీనివాస్‌ ‌నిర్వహణలో వివిధ సాహితీ పక్రియలపై సదస్సులు,కవిసమ్మేళనం, కథా పఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు,కళారూపాలు వంటి అనేక కార్యక్రమాలు వుంటాయని,సుమారు 70 దేశాల నుండి ప్రతినిధులు, లక్షలమంది సాహితీ ప్రియులు పాల్గొంటారని,నాలుగు రాష్ట్రాల గవర్నర్లను, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను,మంత్రులను,చలన చిత్ర ప్రముఖులను, సాహితీవేత్తలను ఆహ్వానించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత దర్శకులు కొత్తపల్లి శేషు పాల్గొన్నారు.