‘వేగుచుక్క’లాంటిది

  • మంత్రి జగదీష్‌ ‌రెడ్డి

(జిల్లా ప్రతినిధి)
సూర్యాపేట,జ్యోతిన్యూస్‌
‌తెలంగాణ సంస్కృతిని సూర్యాపేట ఎప్పటికీ వదిలిపెట్టదని, న్యాయం కొరకు స్పందించే లక్షణం, మంచి కొరకు త్యాగం చేసే లక్షణం ఇక్కడి ప్రజల రక్తంలో వుందని, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించడం,పోరాటం చేయడం, ఇక్కడి ప్రజల లక్షణమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో జరిగిన శమి పూజ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక నుండి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సూర్యాపేట వేగుచుక్క లాగా, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఒకరి పండుగలు, సంప్రదాయాలు మరొకరు గౌరవించుకొని, కలిసిమెలిసి సుఖశాంతులతో జీవిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరనుండి ప్రకృతి సహకరించి వర్షాలు విస్తారంగా కురుస్తూ, పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. సిఎం కెసిఆర్‌ ‌పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఆయన అన్నారు. గతంలో బతుకమ్మ ఆడుకోవడానికి అరకొర వసతులు వుండేవని, కాని తమ ప్రభుత్వం వచ్చిన తరువాత సూర్యాపేటలో మినీ ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద బతుకమ్మ ఆడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు, వసతులు కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. జమ్మిగడ్డలో శమి పూజ కొరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జమ్మిగడ్డలో ఎంపిపి కార్యాలయంలో శమి పూజలో మంత్రి జగదీష్‌ ‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక నుండి మంత్రి శాంతికి చిహ్నమైన పావురాలను, బెలూన్‌ ‌లను వదిలారు. ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్‌, ‌జెడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌గుజ్జ దీపికా, మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్‌ ‌నిమ్మల శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌మార్కెట్‌ ‌కమిటీ చైర్‌ ‌పర్సన్‌ ఉప్పల లలితాదేవి, జెడ్పీ వైస్‌ ‌చైర్మన్‌ ‌గోపగాని వెంకట నారాయణ గౌడ్‌,‌జెడ్పీటిసి జీడి భిక్షం, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు వైవి, ఉప్పల ఆనంద్‌, ‌గండూరి ప్రకాష్‌, ‌గండూరి క్రపాకర్‌, ‌జుట్టుకొండ సత్యనారాయణ, మాదిపెద్ది శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌కౌన్సిలర్‌ ‌లు, తదితరులు పాల్గొన్నారు.
క్యాంప్‌ ‌కార్యాలయంలో…
దసరా పండుగ సందర్భంగా మంత్రి క్యాంప్‌ ‌కార్యాలయం నందు ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన వారికి మంత్రి జగదీష్‌ ‌రెడ్డి విందు ఏర్పాటు చేసి, వారితో సహపంక్తి భోజనాలు చేశారు. క్యాంప్‌ ‌కార్యాలయం నందు వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించారు. స్ధానిక సాయిబాబా ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం నందు మంత్రి జగదీష్‌ ‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు మంత్రి జగదీష్‌ ‌రెడ్డిని క్యాంప్‌ ‌కార్యాలయం నందు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.