బడుగు,బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఎన్టీఆర్‌

  • ‌రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది చారిత్రక పాత్ర
  • తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు స్వాగతోపన్యాసం
  • వర్చువల్‌గా టిడిపి మహానాడు
  • రెండ్రోజుల సమావేశాలు ప్రారంభం
  • మరణించిన నేతలకు తొలుత సంతాపం

అమరావతి,జ్యోతిన్యూస్‌ :
‌తెలుగుదేశం రాకతో నూతన చరిత్ర మొదలైందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. బడుగు బలహీనవర్గాలకు అండగా టిడిపి చారిత్రాత్మక పాత్ర పోషించిందన్నారు.వారికి రాజకీయంగా ఉన్నతస్థాయిని కల్పించిన ఘనత దివంగత ఎన్టీర్‌కు దక్కిందన్నారు. ఎన్టీఆర్‌ ‌టిడిపి పార్టీ పెట్టి ఎందరికో రాజకీయ అందలం కల్పించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ డిజిటల్‌ ‌మహానాడు గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి మహానాడులో ఆ ఏడాదిలో మరణించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంతాపం తెలియజేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పార్టీకి వారు చేసిన సేవలు, అందించిన కృషిని ఎప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. కరోనా కారణంగా ఎంతో మంది గొప్ప నాయకులను మనం కోల్పోయా మన్నారు. పార్టీకి త్యాగం చేసిన వారు కరోనా కారణంగా చనిపోయిన వారికి టీడీపీ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చనిపోయిన కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు జాతీ అంటే దివంగత ఎన్టీ రామారావు గుర్తుకు వస్తారని, సమాజ హితం కోసం తెలుగుదేశం పనిచేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మే 28 యుగపురుషుడు ఎన్టీఆర్‌ ‌పుట్టినరోజని, ఎన్టీఆర్‌ ‌తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచారని, ప్రపంచంలోని ఏ మూలన చూసినా తెలుగువారు ఉన్నారన్నారు. సమస్యలపై ప్రజా చైతన్యం తీసుకొచ్చేలా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. సమాజహితం టీడీపీ ధ్యేయమని అన్నారు. కోవిడ్‌తో పెనుమార్పులు వస్తున్నాయని, కరోనాను ఎదుర్కొంటూ పోరాడాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.వైసీపీ ప్రభుత్వం సరైన రీతిలో ప్రజల్ని ఆదుకునే చర్యలు తీసుకోలేదని చంద్రబాబు విమర్శించారు. ఆక్సిజన్‌ ‌లేక, మందులు కొనలేక ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసి పని చేద్దామని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నా బాధ్యత లేకుండా వ్యవహరించారని విమర్శించారు. సలహాలు, సూచన లను ఎగతాళి చేసి పారాసిట్‌మాల్‌, ‌బ్లీచింగ్‌తో పోతుందని మాట్లాడారన్నారు. కరోనాతో సహజీవనం చేయాలంటూ.. ప్రజలకు భరోసా ఇచ్చే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదని మండిపడ్డారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చనిపోయిన వారి సంఖ్యను దాచిపెట్టి అవాస్తవాలు చెప్పారన్నారు. మానవ హక్కుల సంఘం విచారణ చేపడితే 23మందికి పరిహారం ఇస్తామని లెక్క మార్చారన్నారు. ఆనందయ్య వైద్యంపైనా నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని మండిపడ్డారు. ఆనందయ్య వైద్యంపై తప్పు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా పరామ ర్శించే టీడీపీ నేతలపై చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ ‌ట్రస్టు ద్వారా తోచిన సాయం చేస్తూ 4 ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లకు శ్రీకారం చుట్టామన్నారు. మాట్లాడే వారి నోరు మూసేయాలంటూ స్టేట్‌ ‌టెర్రరిజానికి అధికారపార్టీ నేతలు పాల్పడతున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పతనం చేసే పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా తీసుకొచ్చారని ఆరోపించారు. న్యాయస్థానాల్ని కూడా బెదిరించే పరిస్థితికి వస్తే ప్రజా స్వామ్యం ఎటుపోతోందో అర్థం చేసుకోవాలన్నారు. అచ్చెన్నాయుడుతో మొదలు పెట్టిన అక్రమ కేసులు బీసీ జనార్థన్‌ ‌రెడ్డి వరకూ కొనసాగించారని.. రఘురామ కృష్ణం రాజుపై తప్పుడు కేసులు పెట్టి పోలీసు కస్టడీలో హింసించారన్నా రు. స్థానికంగా అంతా మేనేజ్‌ ‌చేశారు.. కానీ సుప్రీం కోర్టులో అడ్డంగా దొరికి పోయారన్నారు. బెయిల్‌ ‌రాకుండా ఉండేందుకు ఏడేళ్లు పైబడి శిక్షపడే కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శిం చారు. వైద్యుడు సుధాకర్‌, ‌కోడెల శివప్రసాదరావు సహా ఎంతోమంది ప్రభుత్వ వేధింపులు భరించలేక చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పౌరహక్కులు, మాట్లాడే వాక్‌ ‌స్వాతంత్య్ర ఎక్కడుందని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిని వెంటాడుతున్నారని, రాష్ట్ర ఉగ్రవాదాన్ని అంతా ఖండించాలని పిలుపు ఇచ్చారు. చేయని తప్పుకు వేధిస్తున్న తెలుగుదేశం శ్రేణుల కుటుంబ సభ్యుల్ని తలచి నిద్రపోని రాత్రులు గడిపానని చంద్రబాబు అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినవారు, చట్టవ్యతిరేకంగా పనిచేసే ఎవ్వరైనా శిక్షార్హులేనని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం సరైన రీతిలో ప్రజల్ని ఆదుకునే చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆక్సిజన్‌ ‌లేక, మందులు కొనలేక ప్రజలు ఆర్థికంగా చితికిపోయారన్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నా బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సోషల్‌ ‌డియాలో పోస్టులు పెట్టే వారిని వెంటాడుతున్నారని, వారిపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారన్నారు. పన్నుల భారం మోపి, ధరలు పెంచి ప్రజల జీవన ప్రమాణాలపై దెబ్బకొట్టారన్నా రు. పేదరికం పెరిగిపోయి ప్రజలు ఆర్థికంగా తలకిందలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అసత్యాలు చెప్తూ కక్షసాధింపుతో ముందుకు పోతున్నారన్నారు. ఏ ఒక్కరికైనా పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు
వర్చువల్‌గా టిడిపి మహానాడు….
టీడీపీ మహానాడు గురువారం ఉదయం ప్రారంభమైంది. మా తెలుగుతల్లి గీతాలాపన తో కార్యక్రమం మొదలైంది. గత మహానాడు నుంచి ఈ మహానాడు వరకు అసువులు బాసిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు మహానాడు సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాన్ని గూడూరు ఎరిక్షన్‌ ‌బాబు ప్రవేశ పెట్టారు. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కరోనా వైరస్‌ ‌నేపథ్యంలో ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ డిజిటల్‌ ‌మహానాడు పేరుతో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. గురువారం ప్రారంభమైన ఈ సమావేశాలు శుక్రవరాం కూడా జరుగుతాయి. ప్రత్యేక అనుమతులు తీసుకోవడం ద్వారా ఎనిమిది నుంచి పది వేల మంది ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌లో నమోదు చేసుకొని పాల్గొనేలా ప్రయత్నిస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పుట్టిన రోజు సందర్భంగా మహానాడు సమావేశాలు నిర్వహించడం టీడీపీలో ఆనవాయితీగా వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ విభాగాలకు కలిపి దీనిని నిర్వహిస్తున్నారు. రెండు రోజుల్లో కలిపి మొత్తం పదిహేను తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందులో పది తీర్మానాలు ఆంధప్రదేశ్‌… ఐదు తీర్మానాలు తెలంగాణకు సంబంధించినవి. మహానాడులో కీలకమైన రాజకీయ తీర్మానాన్ని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ సంక్షోభం-సమస్యల సుడిలో అన్నదాత, సంక్షేమానికి కోతలు- మారని బలహీనవర్గాల తలరాతలు, ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరుద్యోగ సమస్య-పరిశ్రమల మూసివేత, కొరవడిన మహిళా వికాసంపై పార్టీ నేతలు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.