ఎందుకు లాక్‌డౌన్‌ ‌దిశగా ఆలోచించడం లేదు

  • కరోనా టెస్టులు తగ్గించడంలో ఆంతర్యం
  • తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
  • కరోనా కట్టడికి పర్యవేక్షణ బృందాలు
  • హైకోర్టుకు తెలిపిన డిజిపి
  • ఖైదీలు, నిరాశ్రయుల టీకాలపై హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గించడంపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా తీవ్రత పెరుగుతుంటే పరీక్షలు ఎందుకు తగ్గిస్తున్నారని ప్రశ్నించింది. విచారణకు డీహెచ్‌ శ్రీ‌నివాసరావు, డీజీపీ మహేందర్‌ ‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీహెచ్‌ ‌మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 49.97 శాతం పడకలు నిండాయని వివరించారు. ఆక్సిజన్‌ ‌రాష్ట్రానికి రాకుండా తమిళనాడు అడ్డుకుంటోదని కోర్టుకు తెలిపారు. తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ ‌రప్పిస్తామని అదనపు ఎస్‌జే కోర్టుకు వివరించారు. ఇకపోతే రాష్ట్రంలో కరోనా టెస్టులు ఎందుకు పెంచడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో టెస్టులు తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెప్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే రాష్ట్రంలో టెస్టులు పెంచామని పబ్లిక్‌ ‌హెల్‌త్డైరెక్టర్‌ ‌కోర్టుకు తెలపగా.. దీనిపై స్పందించిన హైకోర్టు ఒక్క రోజు కూడా లక్ష టెస్టులు దాటలేదని విమర్శించింది. అసలు లాక్‌డౌన్‌ ‌దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని్గ •ర్‌ అయ్యింది. ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్‌ ‌డేటాను పూర్తి వివరాలతో సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే రోజుకు లక్ష టెస్టులు చేయాలని ఆదేశించింది.
కరోనా కట్టడికి పర్యవేక్షణ బృందాలు
రాష్ట్రంలో కరోనా నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. 859 పెట్రోలింగ్‌ ‌వాహనాలు, 1,523 ద్విచక్ర వాహనాలపై సిబ్బంది నిబంధనలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణకు డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కట్టడికి పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన కోర్టుకు విన్నవించారు. ఆసుపత్రుల వద్ద పోలీసుల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. భౌతికదూరం పాటించని సంస్థలపైనే కేసులు నమోదు చేస్తున్నామని, వ్యక్తులపై నమోదు చేయడం లేదని పేర్కొన్నారు. ఔషధాల అక్రమ విక్రయాలకు సంబంధించి 39 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విచారణకు డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి, రాష్ట్ర హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు హారజయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేసింది. మాస్కు ధరించని వారి వాహనాలను జప్తు చేసే అంశాన్ని పరిశీలించాలని పోలీసు శాఖకు సూచించింది. ఔషధాల అక్రమ విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. ఫంక్షన్‌ ‌హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. వారాంతపు లాక్‌డౌన్‌ ‌లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపు ప్రతిపాదనను పరిశీలించాలి. ప్రైవేట్‌ ‌దవాఖానల్లో చికిత్స, ఔషధాల గరిష్ఠ ధరలు ప్రభుత్వం నిర్ణయించాలి. ప్రైవేట్‌ ‌దవాఖానల్లో కొవిడ్‌ ‌చికిత్సపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలి. కరోనా పరీక్షలు తగ్గించొద్దు.. రోజుకు లక్షకుపైగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సంచార వ్యానుల ద్వారా ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలి. ఖైదీలు నిరాశ్రయులకు టీకాలు ఎలా వేస్తారో స్పష్టం చేయాలి. రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి. నిపుణల కమిటీ సమావేశాల వివరాలు సమర్పించాలి. శ్మశాన వాటికల్లో సదుపాయాల వివరాలు తెలపాలి. శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50 మందికి మించొద్దు. వివాహాలు, అంత్యక్రియల ఆంక్షలపై వెంటనే జీవో ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎం‌సీలో టోల్‌ ‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలుపగా.. వారంలోగా అన్ని జిల్లాల్లో టోల్‌‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆక్సిజన్‌ ‌రాకుండా తమిళనాడు అడ్డుకుంటోందని డీహెచ్‌ ‌హైకోర్టుకు తెలుపగా.. వెంటనే ఇతర రాష్టాల్ర నుంచి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్టు కోరింది.