శ్రీ‌రామా..! నీ భూములు కావటా..!?

  • యాంజాల దేవాలయ భూములపై కొత్త మెలిక
  • అసలవి దేవాలయ భూములే కావంటున్న రైతులు
  • అప్పనంగా కాజేసారన్న వంశపారంపర్య పూజారులు
  • మరోవైపు యధావిధిగా కొనసాగుతున్న విచారణ

మేడ్చల్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌దేవరయాంజాల్‌ ‌భూముల వ్వయహారంలో కొత్త మెలికలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ భూములు తమవేనని దేవాలయ భూములు కావని రైతు సమాఖ్య నేతలు వెల్లడించారు. అయితే ఈ భూములు ఆలయానికి చెందినవేనని ఆలయ అనువంశిక అర్చకులు పేర్కొంటున్నారు రాజకీయ ఒత్తిళ్లతో ఎంతకాలంగా అప్పనంగా కాజేశారని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇక్కడి వెలిసిన కట్టడాలను అధికారుల బృందం పరిశీలించి నివేదిక రూపొందించే పనిలో పడింది. హైదరాబాద్‌కు చేరువగా ఉండడంతో ఇక్కడి భూమలుకు దరలు రావడంతో అందిర కన్నూ పడింది. అలాగే తమవే అని కొందరు్ల యిమ్‌ ‌చేసి అప్పనంగా అమ్ముకున్నారు. ఈ వ్యవహారంలో అనువంశిక పూజార్లు మాత్రం ప్రేక్షకుల్లా మిగిలారు. దేవరయాంజాల్‌లో సీతారామచంద్రస్వామి ఆలయం పేరున భూములే లేవని 75 సంవత్సరాలుగా రైతులే సాగుచేసుకుంటున్నారని రైతు సమాఖ్య నేతలు తెలిపారు. వాటిపై ఎండోమెంట్‌ అధికారుల దగ్గర ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు. 1953 రెవెన్యూ నిబంధనల ప్రకారం నాటి హైదరాబాద్‌ ‌జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ ‌మెహతా అనుమతితో భూములను రైతులు రిజిస్టేష్రన్‌ ‌చేసుకున్నారని వివరించారు. 1923-24 నుంచి కౌలుదారులుగా ఉన్న వారి పేరిటే అప్పటి పట్టాదారులు ఆ భూములను 1953లో రిజిస్టేష్రన్‌ ‌చేశారన్నారు. 1923-24 నాటి పట్టాదారుల పేర్లు కూడా 1953 వరకు రికార్డుల్లో ఉన్నాయని వివరించారు. కాగా, చౌపస్లా, పైసలాపట్టి కాలం రైతుల పేరునే ఉన్నాయన్నారు. ఈ భూములకు శిస్తును కూడా రైతులే చెల్లిస్తున్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని వెల్లడించారు. అయితే ఉద్దేశపూర్వకంగా చేసి, రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. ల్యాండ్‌ ‌సీలింగ్‌ ‌డిక్లరేషన్‌ ‌కూడా రైతులే ఇచ్చారని, ఎయిర్‌ఫోర్సు వారికి ఇచ్చిన భూములకు సంబంధించిన పరిహారం కూడా రైతులకే ఇచ్చారని తెలిపారు. 1996లో రామచంద్రస్వామి గుడిని రిజిస్టేష్రన్‌ ‌చేయించారని, తామంతా అంతకుముందు నుంచే భూముల్లో సాగుచేసుకుంటున్నట్టు వెల్లడించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఏవైనా అవకతవకలకు పాల్పడి ఉంటే విచారణ జరిపి నిగ్గు తేల్చాలి, ఈ వివాదాన్ని మొత్తం గ్రామంలోని వందలాది ఎకరాల భూములకు ముడిపెట్టి రైతులకు నష్టం కల్గించొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు దేవరయాంజాల్‌లోని దేవాదాయ భూములపై ఐఏఎస్‌ల ప్రత్యేక కమిటీ విచారణ వేగవంతం చేసింది. కమిటీ సభ్యులు నాలుగు వేర్వేరు బృందాలుగా ఏర్పడి, దేవాదాయ భూముల్లో అక్రమంగా నిర్మించిన గోదాముల వివరాలను సేకరించారు. అందులో 117 నిర్మాణాలు అక్రమ కట్టడాలుగా గుర్తించారు. వాటిని సర్వే చేయాలని సర్వే అధికారులకు ప్రత్యేక విచారణ కమిటీ ఆదేశాలు ఇచ్చింది. మేడ్చల్‌ ‌జిల్లా యంత్రాంగం దేవాదాయ భూములను సర్వే చేసేందుకు అవసరమయ్యే అధికారులు, సిబ్బందిని ఏర్పాటుచేసింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రఘునందన్‌రావు నేతృత్వంలో ఐఏఎస్‌ అధికారులు మేడ్చల్‌ ‌జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ ‌శ్వేతామొహంతి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ‌జీవన్‌పాటిల్‌,‌మంచిర్యాల కలెక్టర్‌ ‌భారతి హోళికేరి విచారణ చేపట్టారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌దేవాదాయ భూముల్లో అక్రమంగా నిర్మించిన గోదాములపై రైతుల నుంచి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.విచారణ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఐఏఎస్‌ల కమిటీ ఆదేశాల మేరకు మేడ్చల్‌ ‌జిల్లా యంత్రాంగం 8 మండలస్థాయి బృందాలను ఏర్పాటుచేసింది.