ఆక్సిజన్‌ ‌సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

  • 45 ఏళ్లు పైబడ్డ వారికే తొలుత వ్యాక్సినేషన్‌
  • కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయం
  • కర్నాటక, ఒడిషా,తమిళనాడుల నుంచి ఆక్సిజన్‌ ‌తెప్పించే ప్రయత్నం
  • సహకార డెయిరీలన్నీ అమూల్‌కు అప్పగింత
  • 13న రైతు భరోసా తొలి విడత జమ
  • పూజారులు, ఇమాంల జీతాలు పదివేలకు పెంపు
  • వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీకి లేఖ రాయాలని సీఎం జగన్‌ ‌నిర్ణయం
  • ఏపీ• కేబినేట్‌ ‌కీలక నిర్ణయాలు

విజయవాడ,జ్యోతిన్యూస్‌ :
‌వాక్సినేషన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ విషయమై ప్రధానికి సీఎం జగన్‌ ‌లేఖ రాయనున్నారు. మంగళవారం సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోనా కట్టడి చర్యలు.. వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా చర్చించారు. ఆక్సిజన్‌ ‌సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ ‌రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. నేటి నుంచి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయిం చారు. 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు నడపకూడదని నిర్ణయించారు.ఉదయం 11.30 గంటల వరకే కళాశాలల నిర్వహణకు అవకాశం ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలకు అనుమతి ఇవ్వాలని.. మధ్యాహ్నం నుంచి ప్రజా రవాణా వాహనాలను నిలిపేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోనున్నాయి. . ఆక్సిజన్‌ ‌సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ ‌తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. రేపటి నుంచి కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సులను, ఆటోలను కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత నడపకూడదన్నా రు. అలాగే కరోనా కట్టడి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి మధ్యాహ్నం 12గంటల తర్వాత పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో కర్ఫ్యూ సహా, పలు అంశాలను చర్చించారు.బీసీల రిజర్వేషన్లు మరో పదేళ్లు పెంపునకు ఆదేశించారు. ఈనెల 13న రైతు భరోసా తొలి విడత జమ. 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4వేల 40 కోట్లు జమ. మే 25న 38లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,805 కోట్లు జమ చేయనున్నారు. వైఎస్‌ఆర్‌ ‌మత్స్యకార భరోసా కింద కుటుంబానికి రూ.10వేలు పరిహారం. 2021 మే 18న మరో 1లక్షా 460మందికి అందజేత చేస్తారు. రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ ‌సబ్సిడీ జమ చేశాం. గత ప్రభుత్వ బకాయిలు పెట్టిన ఇన్‌పుట్‌ ‌సబ్సిడీ కూడా అందచేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో 7వ నుంచి సీబీఎస్‌ఈ ‌ద్వారా విద్యా బోధన. 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ ‌విధానంలో చదువుకుని, పరీక్ష రాస్తారు. రాష్ట్రంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ ‌విధానం అమలు చేయనున్నారు. 2018-19 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 52,23,000 విద్యార్థులు ఉంటే, 2020-21 సంవత్సరానికి ఆ సంఖ్య 59,30,000 చేరింది. నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏపీలో మూసేసిన సహకార డెయిరీలను అమూల్‌కు లీజుకిస్తున్నాం. మొత్తం 708 గ్రామాల్లో అమూల్‌ ‌సేవలు అందుబాటులోకి తెస్తారు. అర్చకులకు రూ.10వేల నుంచి రూ.15వేల గౌరవ వేతనం పెంపు. బి కేటగిరి ఆలయాల్లో రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంచారు. ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంపు. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేల గౌరవ వేతనంపెంచారు.