మోసం చేస్తారా..?

  • పసుపు బోర్డు హా ఇచ్చి మోసం చేస్తారా ?
  • బాండ్‌ ‌పేపర్‌ ‌రాసిచ్చి దగా చేస్తే ఎలా ?
  • ఆదిలాబాద్‌,‌నిజామాబాద్‌ అభిమానులతో షర్మిల భేటీ

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌పసుపు బోర్డ్ ‌తెస్తానని చెప్పిన బీజేపీ ఎంపీ అరవింద్‌ ‌బాండ్‌ ‌పేపర్‌ ఇచ్చి రైతులను మోసం చేశారరి వైఎస్‌ ‌షర్మిల అన్నారు. ఎంపిగా గెలిచాక కూడా ఎందుకు హా నిలబెట్టుకోలదన్నారు. రాజన్న కోసం నేను నిలబడతా.. తెలంగాణ ప్రజల కోసం నేను పోరాడుతా అంటూ లోటస్‌ ‌పాండ్‌ ‌వేదికగా వైఎస్‌ ‌షర్మిల వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌ ,ఆదిలాబాద్‌ ‌జిల్లాలకు చెందిన వైఎస్‌ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన షర్మిల..దేశంలో పసుపు ఉత్పత్తిలో నిజామాబాద్‌ ‌నెంబర్‌ ‌వన్‌ అని అన్నారు. నిజాం షుగర్‌ ‌ప్రాజెక్ట్ ‌ను నడిపించే విధంగా వైఎస్సార్‌ ఆనాడు కేంద్రాన్ని సైతం ఒప్పించారన్నారు. బాసర లో ట్రిపుల్‌ ఐటీ, నిజామాబాద్‌ ‌లో యూనివర్సిటీ వైఎస్సార్‌ ఏర్పాటు చేశార న్నారు. జల్‌ ‌జన్‌ ‌జంగల్‌ ‌పేరుతో నిజాంకి చుక్కలు చూపిన కొమురం భీం పుట్టిన గడ్డ అదిలాబాద్‌ అని అన్నారు. మంత్రి పదవికి రాజీనామ చేసిన కొండా లక్ష్మణ్‌ ‌ది.. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండ రామ్‌ ‌పుట్టిన గడ్డ అదిలాబాద్‌ అని కొనియాడారు. బైంసా అల్లర్లకు ఎవరు బాధ్యులని.. రాజకీయాల కోసం సామాన్యులను ఇబ్బందులపాలు చేస్తారా అని ప్రశ్నించారు. పచ్చటి అడవులు, కుంతాల జలపాతం, తెలంగాణ కాశ్మీర్‌ ‌మన ఆదిలాబాద్‌ ‌జిల్లా అని అభివర్ణించారు. జల్‌ ‌జన్‌ ‌జంగల్‌ ‌పేరుతో నిజాంకి చుక్కలు చూపిన కొమురం భీం పుట్టిన గడ్డ మన ఆదిలాబాద్‌ ‌జిల్లా అని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామ చేసిన కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ ఆదిలాబాద్‌ ‌జిల్లా వాసి అని, ఉద్యమాన్ని నడిపిన కోదండరామ్‌ ‌పుట్టిన గడ్డ అన్నారు. జలియన్‌ ‌వాలా బాగ్‌ను తలపించే ఇంద్రవెల్లి ఘటన ఇంకా మనలను రగిలిస్తూనే ఉందన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి వైఎస్సార్‌ అని గుర్తు చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాద్‌కి తలమానికమన్నారు. బాసరలో ట్రిపుల్‌ ఐటీ, నిజామాబాద్‌లో యూనివర్సిటీని వైఎస్సార్‌ ఏర్పాటు చేశారని షర్మిల తెలిపారు. నిజాం షుగర్‌ ‌ప్రాజెక్ట్‌ను నడిపించే విధంగా అప్పుడు కేంద్రాన్ని సైతం వైఎస్సార్‌ ఒప్పించారని, దేశంలో పసుపు ఉత్పత్తిలో నిజామాబాద్‌ ‌నెంబర్‌ ‌వన్‌ అని పేర్కొన్నారు.