లక్ష్యానికి మించి….

  • పుణే రెండో వన్డేలోనూ చెలరేగిన భారత్‌ ‌బ్యాట్స్‌మెన్‌
  • ‌సెంచరీలు,అర్థసెంచరీలతో చెలరేగిన బ్యాట్స్‌మెన్‌
  • 336 ‌పరుగుల చేసిన టీమిండియా
  • కెఎల్‌ ‌రాహుల్‌ ‌సెంచరీ..పంత్‌ అద్బుత ఇన్నింగ్‌

పుణే•,జ్యోతిన్యూస్‌ :

పరుగల వరద..ఇంగ్‌ం‌డ్‌ ‌బౌలర్లకు చుక్కులు చూపిస్తూ టీమిండియా దంచి కొట్టింది. పుణె వేదికగా రెండో వన్డేలోనూ మొదటి వన్డేను మించి పరుగులు చేసింది. ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణించారు. ఫోర్లు, సిక్సులతో మైదానంలో చిచ్చరపిడుగుల్లా చెలరేగారు. రోహిత్‌ ‌శర్మ, కోహ్లీ,కెఎల్‌ ‌రాహుల్‌, ‌పంత్‌, ఆర్థిక్‌ ‌పాండ్యా, కునాల్‌ ‌పాండ్యా ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు బాలను బాదడంతో పరుగుల వరద పారింది. భారత బ్యాట్‌మెన్‌ను కట్టడి చేయడంలో ఇంగ్లండ్‌ ‌బౌలర్లు ఓ రకంగా విఫలమయ్యారనే చెప్పాలి.ఒకవేళ ఎవరైనా ఔటయినా వచ్చి కొత్త బ్యాట్స్‌మెన్‌ ‌కూడా చెలరేగి పోయాడు. దీంతో భారత్‌ ‌నిర్ణీత 50 ఓవర్లలో 336 పరుగుల భారీ స్కోరు చేసింది. 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ‌ముందుంచింది. ఇలా కోహ్లీసేన మరోసారి ఇంగ్లండ్‌కు భారీ టార్గెట్‌ను విసిరింది. టాస్‌ ‌గెల్చిన ఇగ్లండ్‌ ‌బౌలింగ్‌ ఎం‌చుకుంది. పుణెలో జరుగుతున్న రెండవ వన్డేలో భారత్‌.. ‌నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 రన్స్ ‌చేసింది. మిడిల్‌ ఆర్డర్‌లో కేఎల్‌ ‌రాహుల్‌ ‌మరోసారి సత్తా చాటాడు. వన్డేల్లో 5వ సెంచరీ నమో దు చేశాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో రాహుల్‌ 108 ‌రన్స్ ‌చేసి ఔటయ్యాడు. శ్రేయర్‌ ‌స్థానంలో వచ్చిన రిషబ్‌ ‌పంత్‌ ‌దూకుడు బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. కేవలం 40 బంతుల్లో 77 రన్స్ ‌చేశాడతను. పంత్‌ ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఇక చివర్లో హార్దిక్‌ ‌పాండ్యా కూడా రఫాడించాడు. 16 బంతుల్లో 35 రన్స్ ‌చేసి ఔటయ్యాడు. కెప్టెన్‌ ‌విరాట్‌ ‌కోహ్లీ 66 రన్స్ ‌చేశాడు. తొలి వన్డేలో భారత్‌ 66 ‌రన్స్ ‌తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కెఎల్‌ ••‌హుల్‌(108) అద్భుత శతకానికి తోడు పంత్‌(40 ‌బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం, కోహ్లి(66) బాధ్యతాయుత హాఫ్‌ ‌సెంచరీ, ఆఖర్లో హార్ధిక్‌(16 ‌బంతుల్లో 35; ఫోర్‌, 4 ‌సిక్సర్లు) వీరవిహారం తోడవటంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 6 ‌వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ‌బౌలర్లు టాప్లే, టామ్‌ ‌కర్రన్‌ ‌చెరో రెండు వికెట్లు, రషీద్‌, ‌సామ్‌ ‌కర్రన్‌ ‌తలో వికెట్‌ ‌దక్కించుకున్నారు. వరుస సిక్సర్లతో చెలరేగిన హార్ధిక్‌ ‌పాండ్యాను టాప్లే బోల్తా కొట్టించాడు. హార్ధిక్‌(16 ‌బంతుల్లో 35; ఫోర్‌, 4 ‌సిక్సర్లు).. మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో జేసన్‌ ‌రాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 49.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 334/6. ‌శార్ధూల్‌ ‌క్రీజ్‌లోకి వచ్చాడు. భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన రిషబ్‌ ‌పంత్‌(40 ‌బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఎట్టకేలకు అవుటయ్యాడు. టామ్‌ ‌కర్రన్‌ ‌బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పంత్‌.. ‌జేసన్‌ ‌రాయ్‌ అద్భుతంగా క్యాచ్‌ ‌పట్టడంతో పెవిలియన్‌ ‌బాట పట్టాడు.
రాహుల్‌ ‌సెంచరీ..కోహ్లీ అర్థ సెంచరీ
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మన్‌ ‌కేఎల్‌ ‌రాహుల్‌ ‌సెంచరీతో అదరగొట్టాడు. 108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 100 పరుగులు చేశాడు. టీ20 సిరీస్‌లో విఫలమైనా వన్డేల్లో జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తొలి వన్డేలో అర్థసెంచరీతో అజేయంగా నిలిచిన రాహుల్‌ ఈ ‌మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. మొదటి నుంచి సంయమనంతో ఆడుతూ చెత్త బంతులను మాత్రం బౌండరీలుగా మలుస్తూ సెంచరీ దిశగా సాగిపోయాడు. మొదట కోహ్లీ, ఆ తర్వాత పంత్‌ అం‌డగా సెంచరీ పూర్తి చేశాడు. 114 బంతుల్లో 108 పరుగులు చేసి టాప్‌ ‌కర్రాన్‌ ‌బౌలింగ్‌లో థర్డ్ ‌మ్యాన్‌ ‌దిశగా భారీ షాట్‌ ఆడబోయి టాప్‌లీకి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో అతడి సెంచరీ ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ ‌పడింది. కేఎల్‌ ‌రాహుల్‌ ‌చెలరేగాడు. ఇంగ్లండ్‌తో పుణెలో జరుగుతున్న రెండవ వన్డేలో సెంచరీ నమోదు చేశాడు. నిజానికి ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచుల్లో దారుణంగా విఫలమైన రాహుల్‌.. ‌వన్డేల్లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. తొలి వన్డేలో 43 బంతుల్లో 62 రన్స్ ‌చేసి నాటౌట్‌గా నిలిచిన రాహుల్‌.. ‌రెండవ వన్డేలో సెంచరీ కొట్టాడు. రాహుల్‌కు ఇది వన్డేల్లో అయిదువ సెంచరీ కావడం విశేషం. రాహుల్‌ 114 ‌బంతుల్లో 108 రన్స్ ‌చేసి క్యాచ్‌ అవుటయ్యాడు. ఇక అయ్యర్‌ ‌స్థానంలో వచ్చిన రిషబ్‌ ‌పంత్‌.. ‌బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించాడు. శరవేగంగా హాఫ్‌ ‌సెంచరీ అందుకున్నాడు. 28 బంతుల్లోనే పంత్‌ 50 ‌రన్స్ ‌చేశాడు. 45 ఓవర్లలో భారత్‌ 4 ‌వికెట్ల నష్టానికి 273 రన్స్ ‌చేసింది. కెప్టెన్‌ ‌విరాట్‌ ‌కోహ్లీ హాఫ్‌ ‌సెంచరీలు చేశాడు. అయితే కోహ్లీ 66 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ ‌వద్ద ఔటయ్యాడు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. కేఎల్‌ ‌రాహుల్‌ ‌వరుసగా రెండవ అర్థ సెంచరీ నమోదు చేశాడు. అప్పుడు 33 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన ఇండియా 164 రన్స్ ‌చేసింది. రషీద్‌ ‌బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లీ ఔటయ్యాడు.