తాత్కాలిక ‘పద్దు’
- ఏపీ•లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
- ఆమోదించిన కేబినేట్
- మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్
- స్థానిక ఎన్నికలతో అసెంబ్లీ సమావేశాలకు బ్రేక్
- ప్రభుత్వ తీరును దుయ్యబట్టిన టిడిపి నేత యనమల
అమరావతి,జ్యోతిన్యూస్ :2021 ఏడాది బడ్జెట్‌కు సంబంధించి ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బ్జడెట్ ప్రవేశపెట్టనుంది.ఇందు కు సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. మూడు నెలల కాలానికిగాను కేబినెట్ దీనిని ఆమోదించింది. త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జరగలేదు. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్డినెన్సు కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపాల్సి వచ్చింది. ఆర్డినెన్సును ఆన్‌లైన్‌లో మంత్రులు ఆమోదం తెలిపారు. మూడు నెలల కాలానికి ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. రూ.80వేల కోట్ల నుంచి రూ.90వేల కోట్ల వరకు మూడు నెలల బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, నవరత్న పథకాల అమలుకు ఈ నిధులు వినియోగిస్తారు. వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలో బ్జడెట్‌ను రూపొందించారు. ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ఆమోదించ నుంది. ఓటాన్ అకౌంట్ బ్జడెట్‌కు ఆన్ లైన్ ద్వారా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపడంతో రానున్న మూడు నెలల కాలానికి వివిధ పద్దుల కింద అనుమతి లభించనుంది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరగకపోవడంతో.. ప్రభుత్వం మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సుమారు 80 వేల కోట్ల నుంచి 90 వేల కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించిన ఈ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు.. కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపనుంది 2021 ఏడాది బ్జడెట్‌కు సంబంధించి ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బ్జడెట్ ప్రవేశపెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జరగలేదు. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, నవరత్న పథకాల అమలుకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఓటాన్ అకౌంట్ కు ఆమోదం తెలుపుకపోతే రాష్ట వ్యాప్తంగా ఇబ్బందులు తప్పవని.. జీతాలు ఇవ్వడం కూడా ఇబ్బందిగా మారుతుందని.. అందుకే ఓటాన్ అకౌంట్ ను ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ ను ప్రభుత్వం రూపొందించింది. ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బ్జడెట్‌ను ప్రభుత్వం ఆమోదించనుంది. వరుసగా రెండోసారి రాష్ట్ర బ్జడెట్‌ను ఆర్డినెన్స్ రూపంలో వైసీపీ ప్రభుత్వం ఇవ్వటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. పూర్తి స్థాయి బ్జడెట్ సమావేశాలు లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఇలాంటి ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేయకూడదని ఆయన కోరారు. తిరుపతి ఉప ఎన్నిక, పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సాకుతో బ్జడెట్ సమావేశాలు వాయి దా వేయటం పలాయనవాదమని ఆయన ధ్వజమెత్తారు. వార్షిక బ్జడెట్‌ను కూడా ఆర్డినెన్స్ రూపంలో తెచ్చే దుష్ట సంప్రదాయానికి జగన్‌రెడ్డి శ్రీకారం చుట్టడం దారణమన్నారు. ప్రభుత్వానికి ప్రజలు, ప్రతిపక్షాలు, చట్టసభలంటే లెక్కే లేదని విమర్శించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలాంటి కుంటిసాకులు చూపి బ్జడెట్ వాయిదా వేయలేదన్నారు. గతంలోనూ ఇదే తరహాలో తెచ్చిన మొక్కుబడి బ్జడెట్‌తో పాటు 3 రాజధానుల బిల్లును శాసనమండలి వ్యతిరేకించి ందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మమ అనిపించుకున్నారని మండిపడ్డారు.