తెలంగాణలో కర్ఫ్యూ లేదు…!!
- తెలంగాణలో మళ్లీ నైట్ కర్ఫ్యూ అంటూ ప్రచారం
- అలాంటి ఆలోచన లేదన్న హోంమంత్రి మహ్మూద్ అలీ
- సోషల్ మీమీడియా ప్రచారాలను నమ్మోద్దని హితవు
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
తెలంగాణలో వీకెండ్స్ తో పాటు నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉన్నట్లు మొదలయిన ప్రచారంలో నిజం లేదని హోంమంత్రి మహ్మూద్ అలీ ప్రకటించారు. తెలంగాణలో తిరిగి నైట్ కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదన్నారు. ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలయిందో తెలియని ఈ ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. వారంలో రెండు రోజులపాటు లాక్ డౌన్ విధించాలా? లేదంటే రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఒకటి, రెండు రోజుల్లో దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే రాత్రి కర్ఫ్యూ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఓల్డ్ సిటీ లోని ర్‌చౌక్ ప్రాంతంలో భరోసా కేంద్రానికి పునాది వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మహమూద్ అలీ భారతదేశం అంతటా అలానే పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, హైదరాబాద్ లో రాత్రి కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లు రాష్ట్ర ప్రభుత్వం విధించే ప్రణాళికలు ఏవీ లేవని అన్నారు. ఈ లాక్ డౌన్ అనేది ప్రజల జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి పోలీసులు కర్ఫ్యూ విధించే ఉద్దేశం లేదని మహమూద్ అలీ పేర్కొన్నారు. కేసుల పెరుగుదల నియంత్రించడంలో ప్రజలే ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. కర్ఫ్యూ విధించడం నగరంలోని అనేక మంది జీవితాలను, వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుందని స్పష్టం చేస్తూ, మహమూద్ అలీ ప్రజలు, ముఖ్యంగా ఓల్డ్ సిటీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని అనవసర సమావేశాలను నివారించాలని మరియు ఫేస్ మాస్క్‌లను వెంటనే ఉపయోగించాలని అభ్యర్థించారు. పాఠశాలల్లో అక్షుఎఆ-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, పాఠశాలలు మరియు మదర్సాలు పనిచేయనివ్వాలా ? లేదా అని రాష్ట్ర ప్రభుత్వం ఒకటి లేదా రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.