బీజేపీకి ‘కొత్త జట్టు

  • – జాతీయకార్యవర్గం పునర్వ్యవస్థీకరణ
  • – తెలుగు మహిళలకు చోటు
  • – జాతీయ ఉపాధ్యక్షురాలిగా డికె అరుణ
  • – జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి
  • – జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్‌
  • – ఓబిసి జాతీయ మోర్చా అద్యక్షుడుగా డాక్టర్‌ లక్ష్మణ్‌
  • – కొత్త కార్యవర్గంలో చోటు దక్కని రాంమాధవ్‌, మురళీధర్‌ రావు

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :
భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. పలువురు కొత్త ముఖాలకు చోటు కల్పించారు. పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్‌,మురళీధర్‌ రావులకు కొత్త కార్యవర్గంలో చోటు దక్కలేదు. ఇకపోతే ఎపి, తెలంగాణ నుంచి పలువురికి చోటు కల్పించారు. మాజీకేంద్ర మంత్రి పురంధేశ్వరిని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శగా నియమించారు. అలాగే తెలంగాణ నుంచి మాజీ మంత్రి డికె అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా 13 మంది , 13 మంది జాతీయ కార్యదర్శులు, 23 మంది జాతీయ అధికార ప్రతినిధులు, ఎనిమిది మందికి ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో తెలంగాణ నాయకు రాలు డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి కట్టబెట్టిన అధిష్టానం, ఆంధ్రప్రదేశ్‌ నేత పురందేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్‌, ఓబీసీ జాతీయ మో ర్చా అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ను నియమించింది. ఇక రామ్‌ మాధవ్‌, మురళీధర్‌రావు, జీవీఎల్‌ నరసింహారావు కు జాతీయ కార్యవర్గంలో చోటు లభించలేదు. కాగా ఈ ఏడాది జనవరిలో జేపీ నడ్డా పార్టీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడం గమనార్హం. బీజేపీ నూతన కార్యవర్గ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పార్టీ సంప్రదాయా న్ని నిలబెడుతూ దేశం కోసం నిస్వార్థంగా, అంకిత భావంతో పని చేయాలని ఆకాంక్షించారు. పేద ప్రజలు, అణగారి న వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తారని ఆశిస్తున్నానన్నారు. బీజేపీ నూతన కార్యవర్గానికి ఆ పార్టీ నేత రామ్‌ మాధవ్‌ అభినందనలు తెలిపారు. అదే విధంగా.. ఇప్పటిదాకా ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు నిర్వహించే అవకాశం తనకు కల్పించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రామ్‌ మాధవ్‌ ట్వీట్‌ చేశారు. ఇందులో భాగం గా యువమోర్చా అధ్యక్షుడుగా ఎంపీ తేజస్వి సూర్య,జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడుగా డాక్టర్‌ లక్ష్మణ్‌,కిసాన్‌ మో ర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ రాజ్‌ కుమార్‌ చాహర్‌,ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు- లాల్‌ సింగ్‌ ఆర్య, ఎస్టీ మో ర్చా జాతీయ అధ్యక్షుడుగా సవిూర్‌ ఒరాన్‌,మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్‌ సిద్ధికి నియమితులయ్యారు.