దుబ్బాకలో నువ్వా…నేనా…?

  • ` రాజుకుంటున్న ఉప ఎన్నిక వేడి
  • ` అన్ని పార్టీు రంగంలోకి దిగే ఛాన్స్‌
  • ` బరిలో సోలిపేట సతీమణి సుజాత
  • ` టిఆర్‌ఎస్‌ గొపు సునాయసమే అంటున్న స్థానికు

సిద్ధిపేట,జ్యోతిన్యూస్‌ :
దుబ్బాక ఉపఎన్నిక వేడి రాజుకుంటోంది. అన్ని పార్టీు పోటీకి సిద్దం అంటూ ప్రకటించగా తాజాగా దుబ్బాక అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో నివనున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఇక్కడ ఎవరు పోటీచేసినా క్ష ఓట్లతో గొస్తామన్న భరోసాలో అధికార పార్టీ ఉంది. ఇప్పిటికే అక్కడ అన్ని పార్టీ నేతు ప్రచారంలోకి దిగాయి. బిజెపి, కాంగ్రెస్‌ పార్టీు పోటీకి సిద్దపడుతున్నాయి. బిజెపి నుంచి మరోమారు రఘునందన్‌ రావు పోటీపడే అవకాశాు కనిపిస్తున్నాయి. సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో దుబ్బాక శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చెరుకు ముత్యంరెడ్డి చనిపోయిన సందర్భంలో ఆయన కుటుంబానికి బాసటగా ఉంటానని, రాజకీయంగా ఆదుకుంటామని కేసీఆర్‌ అప్పట్లో హావిూ ఇచ్చారు. ఆ తర్వాత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అంచనా కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న సందర్భంలోనే, ఆయన అకా మృతి నేపథ్యంలో సోలిపేట కుటుంబానికి కూడా హావిూ ఇచ్చారు. దీంతో ఇరువురు నేత తనయు టిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి  టికెట్‌ ఆశించగా.. చివరికి సోలిపేట సతీమణి సుజాతకు అవకాశం ఇచ్చినట్లు తొస్తోంది. ఇకపోతే ఉప ఎన్నికకు ముందు ఇక్కడ పెండిరగ్‌ పను పూర్తి చేయాని అధికారుకు ఆదేశాు జారీ చేసినట్లు తొస్తోంది. కాగా ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజాత పేరు ఏకగ్రీవం కావడంతో దుబ్బాక, సిద్ధిపేటలో సోలిపేట కుటుంబ అనుచర వర్గం సంబరాు చేసుకుంటోంది. మరోవైపు.. టికెట్‌ ఆశించి భంగపడి. అసంతృప్తితో ఉన్న చెరకు ముత్యరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డితో టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యనేతు మంతనాు జరుపుతున్నారు. మొత్తంగా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్యత ఏర్పడిరది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికతోపాటు దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూు మెవడుతుందని ఆ పార్టీ వర్గాు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్‌ మూడోవారంలో ఎన్నిక షెడ్యూు రావచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నిక రాజకీయం వేడెక్కుతోంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.  జర్నలిస్టుగా పనిచేసిన రామలింగారెడ్డి 2004, 2008లో దొమ్మాట నుంచి, 2009, 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. 2009 మినహా అన్ని ఎన్నికల్లోనూ రామలింగారెడ్డి గొపొందారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గాకు దుబ్బాక పొరుగునే ఉంది. మంత్రి హరీష్‌రావు దుబ్బాక నియోజకవర్గంలో మండలావారీగా విస్తృతంగా పర్యటించి కార్యకర్తతో భేటీ అయ్యారు. కళ్యాణక్ష్మి, షాదీముబారక్‌ చెక్కు పంపిణీ, చెరువుల్లో చేపు వదడం వంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కేడర్‌ చెక్కుచెదరకుండా చూడటంతోపాటు అసంతృప్తు బుజ్జగింపు, ఇతర పార్టీ నుంచి చేరికు తదితరాపై ప్రత్యేక దృష్టి పెట్టి పావు కదుపుతున్నారు. ఉప ఎన్నికల్లో తనకు కేసీఆర్‌ ఎక్కడ బాధ్యత అప్పగించినా గెలిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు.