రాజ్యసభ డిప్యూటీగా హరివంశ్ సింగ్ నారాయణ
వరుసగా రెండోసారి ఎన్నికైన నేత
న్యూఢల్లీి,జ్యోతిన్యూస్ :
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ మరోమారు ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్‌ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రతిపాదించగా థాపర్‌చంద్ సమర్థించారు. జేడీయూకు చెందిన నారాయణ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా వరుసగా రెండవసారి ఎన్నికయ్యారు. విపక్షా తరపున ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝ బరిలో ఉన్నాడు. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ ఎన్నికైనట్లు సభా చైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. హరివంశ్ పేరును ప్రతిపాదిస్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభలో మొదటి ప్రదిపాదన ప్రవేశపెట్టారు. అనంతరం ఎంపీ తార్వాచంద్ రెండవ ప్రతిపాదన ప్రవేశ పెట్టారు. కాగా డిప్యూటీ చైర్మెన్ పదవికి చైర్మెన్ వెంకయ్యనాయుడు వాయిస్ ఓటింగ్ పెట్టారు. అనంతరం హరివంశ్ ఎన్నికైనట్లు ప్రకటించారు. రాజ్యసభకు డిప్యూటీ చైర్మెన్‌గా హరివంశ్ ఎన్నికవ్వడం ఇది రెండవసారి. హరివంశ్ ఎన్నికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ఆయన శక్తియుక్తు ఎంతగానో ఉపయోగపడతాయని మోదీ ప్రశంసించారు. కాగా విపక్ష నేత గులాంనబీ ఆజాద్.. నూతన డప్యూటీ చైర్మెన్‌కు శుభాకాంక్షు తెలిపారు. ఆయన అన్ని పార్టీ అభ్యర్థని ఆజాద్ అన్నారు.