వీటిని మరిచారా..!

  • •నిద్రాణదశలో కాళేశ్వర ఆలయ అధికారులు.
  • •వెలుగులోకి తెస్తేనే స్పందిస్తారా..!

మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర
ముక్తీశ్వర స్వామి దేవస్థానంలోని ఆలయ గోపురాలపై రావి మొక్కలు
మొలిశాయి.వాటిలో తూర్పున ప్రధాన ధ్వారం వద్ద ఉన్న “రాజ గోపురంపై రావి
మొక్కలు” అనే శీర్షికతో ఈ నెల 10న ఒక పత్రికలో వార్త రాగ, స్పందించిన ఆలయ
అధికారులు 23వ తేదీన సిబ్బందిచే తొలగించారు.ఇంతవరకు బాగనే ఉన్నా మిగత మూడు
దిక్కులలో ఉన్న గోపురాలపై మొలచిన రావి, పిచ్చి మొక్కలు అలానే
ఉన్నాయి.దీనితో ఆలయ అధికారుల పనితీరు యెలావుందో తెలుస్తుందని
భక్తులు,స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈపాటి పనినే నిర్లక్ష్యం చేసిన ఆలయ
అధికారులు ఇగ ఆలయ అభివృద్ధి పనులకై సీఎం కెసిఆర్ మొదటి విడత గా కేటాయించిన
25 కోట్ల పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయో అని పలువురు గ్రామస్తులు
ఛలోక్తులు విసురుతున్నారు.ఇకనైనా ఆలయ అధికారులు మేల్కోని గోపురాలపై మొలిచిన
మొక్కలు పెద్దవి కాకముందే తొలగించి,ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని భక్తులు కోరుతున్నారు.