నిండా ముంచిన ‘ వానలు’
- ఆపార నష్టాన్ని మిగిల్చిన వానలు
- నాలుగైదు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం..
- నిండుకుండలా ప్రాజెక్టులు
- గోదావరి ముంచేస్తోంది…
హైదరాబాద్, జ్యోతి న్యూస్ : ముసురుతో ప్రారంభమైన వాన పెనునష్టాల్ని మిగులుస్తోంది. వారం రోజులుగా రాష్ట్రాన్ని చుట్టుముట్టిన వరదలు జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇండ్ల మధ్యలో నీరు నిలవడంతో గజగజ వణికి పోతున్న ప్రజల బతుకు లు అగమ్యగోచరంగా మారుతున్నాయి. మట్టి ఇండ్లు కూలిపోయి గూడు కూడుకు దూరమవుతున్న కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తుండటంతో ఎన్నో కష్టనష్టాలకోర్చి వేసిన పంటలు కనుచూపుమేరలో కనిపించక అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. కొన్ని జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో వేల కోట్ల రూపాయల నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏజెన్సీ, మారు మూల ప్రాంతాల్లో రహదారులు సరిగ్గా లేక గర్భణులు, ఇతర రోగులు ఆస్పత్రులకు వెళ్లలేక అవస్థలు పడుతుం డగా.. వరంగల్ నగరం పరిస్థితిపై స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగి సమీక్షిస్తున్నారు. ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు వరంగల్ అతలాకుతలమైంది. నగరం పూర్తిగా నీటితో నిండిపోయింది. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకు న్నారు. 3 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏటూరునాగారం ఉధృతంగా ప్రవహించడంతో ఆకులవారి ఘనపురం, చల్పాక, బానాజీ బందం, కంతనపల్లి, ఏటూరునాగారం 1వ వార్డు నుండి 6వ వార్డు, రామన్నగూడెం, పత్కాపురం, శివపురం గ్రామాలకు చెందిన 500 కుటుంబాలకు ఎటురునాగారంలోని ఆరు ప్రభుత్వ
హాస్టళ్లలో ఉంచి సహాయ చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం నుండి వరద ఉధృతి తగ్గడంతో కొందరు పునరావాస కేంద్రాల నుండి ఇండ్లలోకి వెళ్లారు. రెండో ప్రమాద హెచ్చరికనే అమల్లో ఉంది. భూపాలపల్లి,
ములుగులోని పలు గ్రామాలు జలదిగ్బంధనంలో ఉన్నాయి. మంగపేట మండలంతో పాటు గోదావరిని అనుకొని ఉన్న వలు గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించి సోమవారం ఒక్కొక్కరిని ఇంటికి పంపిస్తున్నారు. వరంగల్ లోని వడ్డేపల్లి చెరువు మత్తడి పడుతుండడంతో బ్యాంక్, టీచర్ కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. జేసీబీల ద్వారా మురుగు కాల్వల్లోని చెత్తను తీసీ నీరు వెళ్లి విధంగా చేస్తున్నారు. శివనగర్ జలదిగ్భంధంలో చిక్కుకోవడంతో 700 కుటుంబాలకు పునరావాస కేంద్రాలకు తరలించారు. గోపాలపురం, సంతోషిమాత టెంపుల్ ఏరియాలు ఇంకా నీటిలోనే తేలియాడుతున్నాయి. ఆకేరు వాగులో ఒకరు కొట్టుకుపోగా కాపాడారు. ఖిలావరంగల్ లోని పడమరకోటలో ఇండ్లు కూలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. వరంగల్ లో వృద్ధ మహిళ వర్షం నీటిలో చిక్కుకోగా రెస్క్యూ టీంతో పాటు పలువురు పోలీసులు అక్కడకు చేరుకొని ఒడ్డుకు చేర్చారు. పోలీస్ కమిషనర్, కలెక్టర్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్, మేయర్, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మొత్తంగా 27
సెంటీమీటర్ల వర్షంతో పరిస్థితి తీవ్రంగా మారిందని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతికి అధికారులు వివరించారు. పత్తి వంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారుల్ని మంత్రి దయాకర్‌రావు ఆదేశించారు. అయితే సోమవారం తేలికపాటి వర్షం రావడంతో పరిస్థితి కొంత మెరుగైనట్టు అధికారులు చెబుతున్నారు. నాలుగైదు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 25 మండలాల్లోని 268 గ్రామాల్లో 13,079 మంది రైతులకు చెందిన 18,934 ఎకరాల్లో వానకాలం పంట నష్టం జరిగింది. ఇందులో వరి 4679. పత్తి 7340, పెసర 6915 ఎకరాల్లో నీటమునిగింది. ఉమ్మ డి జిల్లాలో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర నష్టం చవిచూసింది. మూసీ పరవళ్లు తొక్కడంతో పాటు సాగర్ ఆయకట్టు కింద ఉన్న పంట పొలాలు వరదనీటితో ముంపునకు గురి కావడం వల్ల ఈనష్టం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లాలో 12 మండలాల్లోని 110 గ్రామాల్లో 10వేల మందికి పైగా రైతులకు చెందిన వరి 3096, పత్తి 5035, పెసర 6869 ఎకరాల్లో నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసురుతే 121 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. భూపాలపల్లి జిల్లాలో 27వేలా 894 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వరి 17,849, పత్తి 10,045 ఎకరాల్లో నష్టం ఏర్పడినట్లు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో పత్తి, 3వేల ఎకరాల్లో వరి పంటలు నీటమునిగాయి. సంగారెడ్డి జిల్లాలో 1242 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ప్రధానంగా కంది, సోయాబిన్, పేసర, జొన్న, చెరుకు పంటకు నష్టం జరిగింది. జగిత్యాల జిల్లాలో పెర్కపల్లి, హన్మాజీపేట వద్ద రోడ్డు పై వరదనీరు ప్రవహించి వరి పంటలు నీటమునిగాయి. మంథని మండలంలోని చిన్న ఓదాల,గోపాల్పూర్. పెద్ద పెదాల, వెంకటాపూర్, అడవి సోమనపల్లి, స్వర్ణ పల్లి ,మరికొన్ని గ్రామాల్లో 800 వందల ఎకరాల వంటలు నీట మునిగినట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు. మానేరు పరివాహక లోతట్టు ప్రాంత గ్రామమైన అడవి సోమనపల్లిలో సుమారు 60 ఎకరాల వరి పంట, దెబ్బతినగా, 70మోటర్లు నీటిలో మునిగినట్టు రైతులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 500 ఏండ్లనాటి చరిత్ర గల చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ బురుజు వారం రోజులుగా కురుస్తున్న వేర్పాలకు కూలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 62 అడుగులకు చేరుకున్నది. 65 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముంపు గ్రామాలను గోదారమ్మ చుట్టు ముట్టేసింది. గోదావరి పరివాహక ప్రాంతాలైన భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు. అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో ముంపునకు గురైన గ్రామాల ప్రజలను సురక్షింత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు 3500 మందిని తరలించారు. ఆయా మండలాల్లో వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వేరి వంటలు నీట మునిగాయి. దుమ్ముగూడెం మండలం భద్రాచలం-చర్ల ప్రధాన రహదారిపై నీరు చేరడంతో తూరుబాక, నర్సాపురం, రేగుపల్లి, గంగోలు, బుర్రవేముల, బైరాగుల పాడు. వర్ణశాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాలతో పాటు దేవాలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పాటు పర్ణశాల సబ్ స్టేషన్ వరదలో చిక్కుకు ంది. గుండాలలో వరి, పత్తి, మొక్కజొన్న 500 ఎకరాల్లో పంట చేళ్లు నీట మునిగాయి. మల్లన్న వారు వెంట ఉన్న 30
మంది రైతుల మోటర్లు కొట్టుకుపోయాయి. రామానుజవరం వద్ద ఉన్న పుష్కర ఘట్ నీటిలో మునిగిపోయింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల గ్రామపంచాయతీ పరిధి పోచాపూర్ ఆదివాసీ గిరిజనుల బతుకులు ఆగమ్యగోచరంగా ఉన్నాయి. పాచాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాయం వెంకటేశ్వర్లు పోచాపూర్‌లో నివసిస్తుండగా ఫిట్స్ వచ్చింది. వాగు పొంగడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే దారిలేక గ్రామంలోనే ఉంచారు. ఉధృతి తగ్గుముఖం పట్టాక వాగుకు ఇరువైపులా రెండు చెట్లకు తాడునుకట్టి, పదిమంది గిరిజనులు ఆయనను ఎత్తుకుని నెమ్మదిగా వాగు దాటించి హన్మకొండలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆలస్యం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. దహెగాం మండలంలో మల్లన్న ఉప్పొంగి ప్రవహిస్తుం డడంతో ఈ ఒర్రె సమీపంలోని పంట పొలాలన్నీ నీట మునిగాయి. వరి పంట పూర్తిగా నీట మునిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో పౌరుల నుంచి 290 ఫిర్యాదులు వచ్చాయి. జీ హెచ్ ఎంసీ కాల్ సెంటర్‌కు 90, డయల్ 100కు 47, మైజీ హెచ్ఎంసీ యాక్కు
153 ఫిర్యాదులు వచ్చాయి. విరిగిన చెట్లను తొలగించచాలని, పాతభవనాలు, నీటిని గురించి, రోడ్లపై గుంతలను పూడ్చాలని ఫిర్యాదులు వచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నిండుకుండలా మారిన హుస్సేన్‌సాగర్ లో నీటి మట్టం సాధారణ స్థాయికి చేరింది. మధ్యాహ్నం ఒంటిగంటకు 513.50 మీటర్లు, 2గంటలకు 513.49 మీటర్లు, రాత్రి 9గంటలకు 5613.45మీటర్లకు చేరిందని అధికారులు చెబుతున్నారు. దిగువనకు నీటిని వదులుతుండడంతో
ఏలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. నిండుకుండలా ప్రాజెక్టులు… నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని వాగులు, వంకలతో పాటు ప్రధాన నదులన్నీ
ఉరకలెత్తుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్ల ఎగువ రాష్ట్రాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆయా ప్రాజెక్టుల్లోకి ఉధృతంగా ప్రవాహాలు పోటెత్తు తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వరాలతో కృష్ణా నది పరవళ తాకు తుండగా, ఆలటి, నారాయణ పూరకు భారీగా వరద పెరిగింది. ఇక్కడకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మరోపక్క గోదావరి ప్రాజెక్టుల్లోనూ ప్రవాహాలు పుంజుకున్నాయి. ప్రాణహిత మహోగ్రరూపం దాల్చుతోంది. ఎగువన మహా రాష్ట్ర, ఛత్తీస్ గఢీ కురుస్తున్న భారీ వర్షాలకు పరీవాహకంలో కురుస్తున్న వానలు తోడవడంతో రికార్డు స్థాయి వరదతో పోటెత్తుతోంది. ప్రాణహిత నది మహోగ్ర రూపంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏకంగా
నీటి ప్రవాహాలు 9.87 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతున్నాయి. వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ఏకంగా రోజుకు సుమారు 90 టీఎంసీల మేర నీటిని దిగువ నది లోకి వదిలేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యతరహా
ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోగా, భారీ ప్రాజెక్టులన్నీ నిండుకుండలు కానున్నాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ తొణికిసలాడుతుండగా, చెరువులన్నీ అలుగుపోస్తున్నాయి. ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర జల సంఘం హెచ్చరించింది. గోదావరి బేసిన్లో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. పరివాహకం నుంచి వస్తు న్న నీటితో 46 వేల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో నిల్వ 90 టీఎంసీలకుగాను 44.95 టీఎంసీల కు చేరింది. దీంతో పాటే లోయర్ మానేరు, మిడ్ మానేరు, ఎల్లంపల్లికి ప్రవాహాలు పెరగడంతో అవి ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయి మట్టాలకు చేరుకోనున్నాయి. ప్రధాన నదులన్నీ ఉప్పొంగుతుండటంతో మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. గోదావరి బేసిన్లోని 28. కృష్ణా బేసిన్లోని 8 ప్రాజెక్టులు పూర్తి నిల్వలతో తొణికి
సలాడుతున్నాయి. మొత్తం ఈ 36 ప్రాజెక్టుల నీటి నిల్వల సామర్థ్యం 62 టీఎంసీల మేర ఉండగా, 51.28 టీఎంసీల నిల్వలు చేరుకున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు 1.39 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తు న్నారు. ఇదే జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు సైతం 40 వేల ప్రవాహం వస్తుండగా, మహబూబాబాద్లోని బయ్యారం ట్యాంక్ కు 35,590 క్యూసెక్కులు, ఖమ్మం జిల్లాలోని
వైరాకు 8,200, వరంగల్ రూరల్ లోని పాకాల లేక కు 8,402, ములుగు జిల్లాలోని పాలెంవాగుకు 12.452 క్యూసెక్కులు, రామప్ప లేకకు 5,775, లక్నవరం లేకకు 5,300 క్యూ సెక్కుల మేర భారీ ప్రవాహాలు వస్తుండటంతో
వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదిలేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురంభీమ్, వట్టివాగు ప్రాజెక్టులు సైతం ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నిండనున్నాయి. ఎగువ ప్రవాహాలతో మేడిగడ్డ వద్ద ప్రాణహిత ఉధృతి రోజు రోజు కూ పెరుగుతోంది. మూడ్రోజుల కిందట మేడిగడ్డ వద్ద 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉండగా, 3.48 లక్షల క్యూ సెక్కులకు తగ్గింది. అయితే, రెండ్రోజులుగా పరీవాహకంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆదివారం ఉద
యానికి ఏకంగా 7.50 లక్షల క్యూసెక్కులకు, సాయంత్రానికి మరింత పెరిగి 9.87 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఇది దాదాపు 90 టీఎంసీలకు సమానం. మేడిగడ్డ బ్యారేజీలో ఇప్పటికే 16.17 టీఎంసీలకు 9.87 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో బ్యారేజీ 65 గేదైత్తి అంతే నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డ పంలోని వంపులను ఆవేయగా, అన్నారం బ్యారేజీకి సైతం మానేరు వాగు నుంచి ప్రవాహాలు పెరగడంతో
అక్కడి పంహౌస్ మోటార్లను నిలిపివేశారు. ఈ బ్యారేజీకి 1.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు 40 గేటెత్తి దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం అన్నారంలో నీటి నిల్వ 10.87 ఓఎంసీలకుగాను 4
ఉంది. సుందిళ్ల బ్యారేజీలో 8.83 టీఎంసీలకు 6.42 టీఎంసీల నిల్వ ఉండగా, 6.208 క్యూసెక్కు లవీరు స్థానిక వాగుల నుంచి వస్తోంది. ఇక్కడి వంహన్ మోటార్లను నిలిపివేశారు. ఇప్పటివరకు జూన్లో
మొదలైన సీజన్ నుంచి ఇంతవరకు మేడిగడ్డ నుంచి ఏకంగా 365 టీఎంసీల మేర నీరు దిగువకు వెళ్లిపోయిందని ప్రాజెక్టు వర్గాలు వెల్లడించాయి. గోదావరి ముంచేస్తోంది…. –
గోదావరి జిల్లాలకు ఎన్నడూ లేని కష్టం దాపురించింది. ఒక పక్క రాష్ట్రంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదు
అవుతున్నాయి. ఇవి ఇంకా తగ్గుముఖం పెట్టకుండానే గోదావరికి వరద ఉగ్ర రూపంలో వచ్చి విరుచుకుపడుతూ ఉండటంతో పరివాహక ప్రాంతాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ రెండు జిల్లాల ప్రభుత్వ యంత్రాంగానికి ఇప్పుడు కరోనా, వరదలను ఒకేసారి ఎదుర్కోవడం కత్తిమీద సాముగా తయారైంది. ఒక పక్క వరద బాధితులకు పునరావాసానికి తరలించడం, మరోపక్క వైరస్ బాధితులకు క్వారంటైన్ లకు పంపడం వారికి ప్రత్యక్ష
నరకాన్ని చూపిస్తున్నాయి.ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి రికార్డ్ స్థాయిలో ప్రవహిస్తుంది. అటు భద్రాచలం, ఇటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి మూడవ ప్రమాద హెచ్చరిక చాట్ ఉరకలు వేస్తుంది.
కేంద్ర జలవనరుల సంఘం అంచనా ప్రకారం వరద మరికొంత కాలం అతలాకుతలం చేస్తుందనే సమాచారం గోదావరి జిల్లాల వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. గతంలో చెన్నారెడ్డి, ఆ తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి
సమయంలో మాత్రమే ఏటి గట్ల పటిష్టత పై దృష్టి పెట్టారు. గోదావరి వరద చరిత్రలో 1986 వచ్చిన ఫ్లడ్ అత్యధికం, నాడు గట్లు దాటిన వరద గోదావరి కి దాదాపు 33 లక్షల నుంచి 36 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించినట్లు రికార్డ్ లు చెబుతున్నాయి. ఆ స్థాయి కన్నా తక్కువ 1955 లో ఒకసారి మాత్రమే వచ్చింది. అందుకే 1989 లో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రపంచ బ్యాంక్ నిధులతో గోదావరి ఏటిగట్లను 86 వరదల స్థాయికి పెంచారు. ఆ తరువాత వైఎస్ ఉభయగోదావరి లోని 550 కిలోమీటర్ల పరిధిలో పటిష్టత పై దృష్టి పెట్టి వాటిని పటిష్టం చేశారు. ఆ తరువాత ఏ ప్రభుత్వం ఏటిగట్లపై ఆలోచనే చేయలేదు. ఇప్పుడు సుమారు 20 లక్షల క్యూసెక్కుల వరదనీరు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. 1986 వరదల స్థాయి ఇప్పుడు గోదావరి పెరిగితే మాత్రం తట్టుకునే సామర్థ్యం అనుమానమే.ఇదిలా ఉంటే ముంపు ప్రాంతాల్లోని 160 గ్రామాల ప్రజలను తరలించడానికి అధికార యంత్రాంగం నానా తిప్పలు పడుతుంది. కరోనా ప్రభావంతో పునరావాస కేంద్రాలకు తరలిరావడానికి ముందు ప్రాంతాల్లో ఉండేవారు భయపడుతున్నారు. దాంతో వారిని ఒప్పించి ఆ కేంద్రాలకు తరలించడం పెద్ద టాస్క్ గా మారింది అధికార యం
త్రాంగానికి. ఒక పక్క కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ముంపు బాధితులను పునరావాసానికి తరలిస్తూ వారికి భోజన సదుపాయాలు కల్పించడం వారికి సవాల్ గానే మారింది.