ఆపదమొక్కుల స్వామికి ఆగని కైంకర్యాలు
లా డౌన్లోనూ కొనసాగుతున్న స్వామి వారికి సకల పూజలు దాల
తిరుమల: కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భక్తులకు శ్రీవారి దర్శనం రద్దు చేసినప్పటికీ ఆగమశాస్త్రం ప్రకారం అన్ని రకాల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిత్యం సకల నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్తున్నారు. సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, మితంగా తయారుచేసిన ప్రసాదాలను నైవేద్యంగా స్వామికి సమర్పిస్తున్నారు. ఉదయం 5.30 గంటలకు మొదటి గంట, 10.30 గంటలకు రెండో గంట, మధ్యాహ్నం కల్యాణోత్సవం, రాత్రి ఏకాంత సేవా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో ఉండే వకుళమాత పోటులో శ్రీవైష్ణవులే కట్టెల పొయ్యి పై అన్నప్రసాదాలు తయారు చేస్తారు. మొదటి గంటలో చక్కెర పొంగళి, కదంబం, పులిహోర, మాత్ర, లడ్డూ, వడలను స్వామి వారి గా సమర్పిస్తారు. రెండో ఘంట సమయంలో పెరుగన్నం , చక్కెర పొంగళి, పులి హెూర, మిరియాల పొంగళి, సీరా, సేకరాబాత్, రాత్రి గంటలో కదంబం, మొల హెూరా, తోమాలదోశ, లడ్డూ, వడలను అర్పిస్తారు. వారపు సేవలైన ఆర్జిత సేవల్లో మరికొన్ని ప్రసాదాలు ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణ రోజుల్లో 4 లక్షల లడ్డూలు, 4 నుంచి 5 వేల పెద్ద లడ్డూలు, 2 నుంచి 3 వేల వడలు, 120 నుంచి 150 గంగాళాల అన్నప్రసాదాలు, 50 నుంచి 60 గంపల ఇతర ప్రసాదాలను తయారుచేస్తారు. అన్ని ప్రసాదాల నుంచి ఒక్కో గంగాళాన్ని మాత్రమే శ్రీవారికి సమర్పిస్తారు. లాక్ డౌన్ కారణంగా భక్తులు రాకపోడంతో ప్రస్తుతం 100 చిన్న లడ్డూలు, వడలు, 50 కల్యాణోత్సవ లడ్డూలు, 20 గంగాళాల అన్నప్రసాదాలు, 10 గంపల ఇతర ప్రసాదాలను తయారు చేస్తున్నారు. నైవేద్య సమర్పణ అనంతరం అన్నప్రసాదాలను ఆలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, కార్మికులు, తిరుమల స్థానికులు, పేద విద్యార్థులకు ఉచితంగా పంచి పెడుతున్నారు. లడ్డూలు, వడలు మాత్రం తిరుపతిలో విక్రయిస్తున్నారు. తిరుమలకు భక్తుల అనుమతి లేని కారణంగా తిరుపతిలోని దేవస్థానం పరిపాలన భవనం వద్ద రోజూ 500 కల్యాణోత్సవ లడ్డూలు, వడలు విక్రయిస్తున్నారు.