సంక్షేమ’మే’ మరచిన కార్మిక సంఘాలు ఉనికిని కోల్పోతున్న భారత కార్మిక ఫెడరేషన్లు..

నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం

  • 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన యూనియన్లు
  • 1890లోనే ఏర్పడిన భారత తొలి కార్మిక సంఘం
  • ‘బొంబాయి మిల్ హాండ్స్ అసోసియేషన్’ పేరిట తొలి సంఘంవారు
  • పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కార్మిక సంఘాలు
  • రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్న సంఘాలు
  • యూనియన్ల స్వార్థ నిర్ణయాలకు కార్మికులు బలి
  • ఉద్యోగ భద్రత కోల్పోతున్న అసంఘటిత కార్మికులు
  • చరిత్రలో తొలిసారి సమ్మె చేసిన చికాగో కార్మికులు

హైదరాబాద్: ప్రపంచ కార్మిక ప్రతిజ్ఞ దినం మేడే. దేశ దేశాల శ్రామిక వర్గ పండుగ రోజు. సామ్రాజ్యవాద దురాక్రమణ పంథాను ప్రతిఘటిస్తూ, శ్రామిక, కార్మిక వర్గ పోరాటాలకు సంఘీభావం ప్రకటిస్తూ, కవులు, కళాకారులూ ఉచ్ఛ స్వరంతో.. ముక్తకంఠంతో.. నినదించిన రోజు. అన్యాయాలూ, అక్రమాలూ, దోపిడీలూ, దురంతాలను ధిక్కరించి నిలదీసిన రోజు. అప్పటివరకూ అమాయకంగా జోడించిన కార్మికుల చేతులు- ఒక్కసారిగా బిగించిన పిడికిళ్లుగా పైకి లేచాయి. మనుషుల చేత పశువుల్లా పనిచేయించకుండా- పనిగంటలు నిర్ణయించమని చికాగో నగరంలో కార్మికులంతా చరిత్రలో తొలిసారిగా సమ్మె చేశారు. సమభావం మానవాళి..గుండెలలో నిండుగా సకల దేశ కార్మికులకు..ఈనాడే పండుగ లోకానికి శ్రమ విలువను చాటిన ‘మేడే’ పండుగ- కష్టజీవులు ‘పోరాటం’ అనే ఆయుధాన్ని చేపడితే బానిస సంకెళ్ళు తప్ప పోయేదేమీ లేదు అనే భావనతో ప్రపంచ కార్మికులారా! ఏకం కండి! అనే పిలుపుతో ప్రతి ధ్వనించింది. మేడే పండుగ వచ్చింది … ఎర్రని జెండా ఎగిరింది.. కార్మికులంతా ఏకం కండని ..కదన శంఖం ఊదింది. దోపిడీ లేని రాపిడీ లేని, దౌర్జన్యాలకు తావేలేని సమసమాజం వస్తున్నదని..స్వాగత గీతిక ఆలాపిస్తూ మేడే పండుగు వచ్చింది..మదపుటేనుగుల్లాంటి పరిశ్రమల యాజమాన్యాలను సమ్మె అంకుశంతో దారిలోకి తెచ్చుకున్న రోజులు చరిత్రలో కలిసిపోయాయి. కట్టుబట్ట నుండి నొసట బొట్టు దాకా యంత్రాల పై తయారవడంతో పనివాడి చేతులకు, చేతలకు విలువ లేకుండా పోయింది. వడిమాండ్ల సాధనకోసం కార్మిక సంఘాల పిలుపందుకొని కష్టనష్టాలకోర్చి నిలబడ్డ కార్మికుల ఘనత నిన్నటి ప్రస్తావనే. పని దినాల సంఖ్య, పని గంటల కుదింపు, బోనస్, వేతన ఒప్పందాలు, వసతుల పెంపు, ఆరోగ్య భద్రత ఇలా ఏ అంశం తీసుకున్నా ఏదీ ఎదురొచ్చి చేతుల్లో పడలేదు. దశాబ్దాల త్యాగాల పోరు బాట ఫలితాలే ఇవన్నీనూ.భారత కార్మిక చరిత్రలో సంఘాలు ఈ నాటివి కావు. సమ్మెలు కొత్త కాదు. 1890లోనే నారాయణ మేఘాజీ లోకండే నాయకత్వంలో తొలి కార్మిక సంఘం ‘బొంబాయి మిల్ హాండ్స్ అసోసియేషన్’ ఏర్పడింది. వారంలో ఒక రోజు సెలవు కోసం, మధ్యాహ్నం భోజనానికి అరగంట సమయం కోసం ఆయన యాజమాన్యాలతో తలపడ్డారు. ఇప్పటిలా అప్పుడురాజకీయ పార్టీలకు అనుబంధంగా కార్మిక సంఘాలు లేవు. సంఘ సంస్కర్తలు, సామాజిక కార్యకర్తలే కార్మికుల కష్టాలు చూడలేక సంఘటితంగా యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపేవారు. వారికున్న కార్మికుల బలం చూసిఅభ్యర్ధన పరిశీలించడం జరిగేది. 1926లో ఏర్పడిన కార్మిక సంఘాల చట్టం కింద నమోదైన తొలి కార్మిక సంఘం ‘మద్రాస్ లేబర్ యూనియన్’. 1918లో బొమన్ జీ పెస్తోంజీ వాడియా దీని నాయకుడు. తొలి కార్మిక సంఘాల సమాఖ్యగా ఎఐటియుసి 1920లోఏర్పడింది. కార్మికుల తోడ్పాటు లేనిదే పరిశ్రమలు ఉత్పత్తి చేయలేని రోజుల్లో కార్మికులకు సమ్మె ఆయుధంగా ఉండేది. కార్మిక సంఘాలు, నాయకులంటే యాజమాన్యాలకు భయం ఉండేది. 1974లో భారత రైలే ఉద్యోగులు ఇరవై రోజులపాటు సమ్మెలో పాల్గొని రైల్వే రవాణా వ్యవస్థనే స్తంభింపచేసిన సంఘటన ప్రపంచ కార్మిక చరిత్రలో అపూర్వమైనది. ఆ సమ్మె ప్రముఖ పార్లమెంటేరియన్, కార్మిక నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ నేతృత్వంలో సాగింది. ఆ సమ్మెను అణచివేసేందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎందరో కార్మికులను, సంఘ నాయకులను జైళ్లలో పెట్టింది. ఉ ద్యోగాల నుండి తొలగించింది.ఎంత దూరమైనా, ఎంత కాలమైనా రైలులో గడిపే లోకో డ్రైవర్లకు 8 గంటల ఒక రోజు పని దినంగా పరిగణించడానికి ఆ సమ్మె దోహదపడింది. 1982లో బొంబాయిలో సుమారు ఏడాది కాలం పాటు సాగిన ఔళి పరిశ్రమల సమ్మె ఆ వ్యవస్థనే కుదిపివేసింది. బోనస్, వేతన పెంపుదల లక్షంగా సాగిన ఈ సమ్మెలో రెండున్నర లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. ప్రముఖ కార్మిక నాయకుడు దత్తా సామంత్ నేతృత్వంలో ఇది సాగింది. సమ్మెకు బెదిరింపుగా కొన్నిఫ్యాక్టరీలు మూసివేయబడ్డాయి. ఈ సందర్భంలో కార్మికులు అనుభవించిన దుర్భర పరిస్థితుల గురించి పుస్తకాలే కాదు, సినిమాలు డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరించే దత్తా సామంత్ ప్రధాని ఇందిర మాటను కూడా లెక్కచేయలేదు. 1984లో సామంత్ స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్ కు ఎంపికైనారు. క్రమంగా కమ్యూనిస్టు కార్మికోద్యమాలకు దగ్గరయిన ఆయన్ని 16 జనవరి 1997 నాడు గుర్తు తెలియని వ్యక్తులు కారులో ప్రయాణిస్తుండగా కాల్చి చంపారు. ఇదంతా గత చరిత్ర. 1991లో కాంగ్రెస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల కార్మిక సంఘాల ప్రభ క్రమంగా మసకబారనారంభించిందనవచ్చు. ప్రైవేటుయాజమాన్యాలే కాదు. ప్రభుత్వ వైఖరే పూర్తిగా మారిపోయింది. కార్మికుల సంక్షేమం కోసం అడపా దడపా ఆలోచించే ప్రభుత్వాలు ఆ వైపు చూడడం మానేసాయి. పైగా చట్టాలను కఠినతరం చేయనారంభించాయి. 1966లో కేంద్రం నియమించిన తొలి జాతీయ కార్మిక కమిషన్ ఎన్నో కార్మిక సంక్షేమ విధానాలను సిఫారసు చేసింది. ఆగస్టు 1969లో ఇది ఇచ్చిన నివేదికలో పరిహారాల చెల్లింపు, ఇఎస్ఎ ద్వారా వైద్య సదుపాయం, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, జీతభత్యాల్లోసమతుల్యత, ఖనిజ తవ్వకాల వద్ద కార్మికులకు తగిన సదుపాయాలు, ఆరోగ్య భద్రత, బాల కార్మికుల ని షేధం, కనీస వేతన చట్టం లాంటి ఎన్నో అంశాలు అందులో ఉన్నాయి. 1991లో వచ్చిన రెండో జాతీయ కార్మిక కమిషన్ పై నివేదికను కాలరాసేలా కొత్త ఆర్థిక విధానాలననుసరించి సిఫారసులు చేసింది.ప్రభుత్వం చేపట్టిన ఎల్.పి.జి సరళీకృతం, ప్రైవేటేజేషన్, గ్లోబలైజేషన్ వల్ల దేశ కార్మిక ఉద్యమానికి చావుదెబ్బ పడింది. ప్రభుత్వం, ప్రైవేటు యాజమాన్యం చేతుల్లో ఉన్న ప్రసారసాధనాలు ఎల్ పిజి ఆవశ్యకతను ఊదరగొట్టాయి. విదేశీ పెట్టుబడులు, యాంత్రీకరణ వల్లే దేశంలో ఆర్థిక అభివృద్ధి సాధ్యమని అదో అనివార్యత, ఆధునికత అని ప్రభుత్వ పెద్దలు ఘనంగా విన్నవించారు. కొత్త విధానాలతో కార్మికులు, ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. నూతన నియామకాలు ఆగిపోయి ఓవైపు పదవీ విరమణ ద్వారా మరోవైపు కార్మికుల సంఖ్య తగ్గిపోయి సంఘాల సభ్వత్వం, నెలరుసుం పడిపోయి సంఘాలు నిర్వీర్యం కానారంభించాయి. కేంద్రం రాష్ట్రాలకు కూడా కార్మిక చట్టాల సవరణల కోసం కేంద్రం స్వేచనిస్తుంది. శాశ్వత ఉద్యోగాల నియామకం స్థానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిత పెరిగిపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిపిఒ, పెద్ద సైజు రిటైల్ దుకాణాలు, స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఇలా కొత్త రకం ఉద్యోగాల కల్పన కోనసాగడంతో కార్మిక, ఉద్యోగ సంఘాల మనుగడయే ప్రశ్నార్థకమైంది. విదేశీ పెట్టబడుల ద్వారా ప్రారంభమైన సంస్థలకు ప్రభుత్వాలు ఎన్నో వెసులుబాటు కల్పించాయి. వాటికి అనుకూలంగా కార్మిక చట్టాలనుసవరిస్తున్నాయి.యాజమాన్యాలు తగిన భద్రత కల్పిస్తే మహిళలు రాత్రి వేళల్లో కూడా పనిచేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. కార్మిక సంక్షేమ అధికారుల తనిఖీలను కట్టడి చేసే విధంగా కంపెనీలతో స్వీయ ధ్రువీకరణపత్రాల సమర్పణకు అవకాశం ఇస్తోంది. మావద్ద పని చేసే వారందరూ చట్టపర భద్రత కల్పించబడి ఉన్నారని కంపెనీయే ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఎవరైనా ఉద్యోగి సదుపాయాల్లో లేమి ఉందని ఫిర్యాదు చేస్తే తప్పఅధికారులు తనిఖీకి రారు. ఫిర్యాదు చేసేందుకు ఏ ఉద్యోగి ముందుకు రారు. ఎందుకంటే తమ గాథ వినిపించేందుకు అక్కడ ఉద్యోగసంఘాల్లేవు. ఒంటరిగా ముందుకొస్తే ఫలితం కన్నా నష్టమే ఎక్కువ. కార్మికులను సంఘాల నీడలో కాకుండా తమ పిడికిట్లో ఉంచుకునేలా ప్రభుత్వా లు సమ్మెల పై ఎస్మా, నాసాలాంటి క్రూరమైన చట్టాల కోరలకు ప దునుపెడుతున్నాయి. 2000లో ఉత్తరప్రదేశ్ లో జరిగిన విద్యుత్ బోర్డు ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం నాసా ప్రయోగించింది. సెప్టెంబర్ 2002లో తమిళనాడు ప్రభుత్వం ఉపాధ్యాయుల సమ్మెపై ఎస్మాను ఝుళిపించింది. కార్మికుల, ఉద్యోగుల సమస్యలను సావధానంగా ఆలకించవలసిన ప్రభుత్వాలు నాయకులను, నోరెత్తిన ఉద్యోగులనుజైళ్లపాలు చేసి ఉద్యోగాల్లోంచి తీసివేస్తున్నాయి. న్యా యస్థానాలు ప్ర భుత్వాలకే వంతపాడుతున్నాయి. డిసెంబర్ 200 2లో ఢిల్లీలో జరిగిన తపాలా ఉద్యోగుల సమ్మె విషయంలో హైకోర్టు పరుషంగా ప్రవర్తించింది. తపాలా సరీసులు క్రమబద్ధం అయ్యేలా ఉద్యోగుల పై మీరు కోరిన చర్య తీసుకోండి అని ప్రభుత్వాలను ఆదేశించింది. సమ్మె కార్మికులప్రాథమిక, నాయపర, నైతిక హక్కు కాదని తమిళనాడు హైకోర్టు 2003లో తీర్మానించింది. ఇన్ని చెదరింపుల నడుమ ఏ కార్మికుడు సంఘాలకు సైదోడుగా నిలువగలడో ఊహించనున్నా యి. 1991 నుండి సాగుతున్న ప్రభుత్వ సంస్థ ల్లో పెట్టుబడుల ఉపసంహరణను అడ్డుకునే స్థాయిలో నేడు సంఘా లు లేవనవచ్చు. ఉద్యోగులకున్న మరో ఇబ్బందికర స్థితి ఏమిటంటే ప్రధాన సంఘాలు అన్నీ ఏదో రాజకీయ పార్టీలకి అనుబంధంగా మారడమే. ఆర్థిక సంస్కరణలు కాంగ్రెస్ హయాంలో మొదలైనా దాని అనుబంధ కార్మిక సంస్థ అయిన ఐఎన్‌టియుసి మెదలకుండా ఉండవలసి వచ్చింది. పలు సంస్థల్లో బలంగా ఉన్న భారతీయ మ జూర్ సంఘ్ బిజెపి ప్రభుత్వానికి విరుద్ధంగా నడవదు. ఈ పరిస్థితు లు కార్మిక సంఘాల కళ్ళకు బంధనాలుగా అయ్యాయి. మనుషుల స్థానంలో యంత్రాలు ఎంతకాలం కొనసాగుతాయి.. యంత్రాలకు ప్రత్యామ్నయంగా మరేదైనా వస్తుందా.. తిరిగి మనిషి సంఘటిత శక్తికి మంచిరోజులొస్తాయా.. ప్రస్తుతానికి ఇది జవాబు దొరకని ప్రశ్న..