విద్యుత్ మీటర్లు మోటార్లులా తిరుగుతున్నాయి

వర్క్ ఫ్రం హెం, అధిక ఉష్ణోగ్రతలు, నెట్ వీక్షణంతో పెరిగిపోతున్న గృహ విద్యుత్ వినియోగం

  • గత వారం రోజులుగా పెరిగిపోయిన గృహ విద్యుత్ వాడకం
  • పంట పొలాల్లో తగ్గిన విద్యుత్ వాడకం
  • వ్యవసాయ పనులు లేకపోవడంతో ప్రభావం
  • ఒక్కసారిగా పెరిగిపోయిన ఉక్కపోత
  • ఏసీలు, ఫ్రిజ్ లు, టీవీలు, ల్యాప్ టాప్ లతో అధిక వినియోగం
  • తాజాగా కోటి యూనిట్ల నుంచి 4.8 కోట్ల యూనిట్లకు చేరుకున్న వినియోగం
  • కర్మాగారాలలో పూర్తిగా తగ్గిపోయిన వినియోగం
  • గుండె గుభిల్లనిపించేలా వస్తున్న గృహ విద్యుత్ బిల్లులు

హైదరాబాద్: ఇంతకాలంగా తగ్గుతూ వచ్చిన విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతున్నది. డిమాండ్ అధికంగా ఉండటంతో వినియోగం సైతం క్రమంగా పెరుగుతున్నది.. ఈ సీజన్లోనే గరిష్ఠానికి చేరుకున్నది. ఏకంగా కోటి యూనిట్లు (10 మిలియన్ యూనిట్లు ) వినియోగం పెరిగి 4. 59 కోట్ల యూనిట్ల (45.9 మిలియన్ యూనిట్లు ) చేరుకున్నది.జనతా కర్ఫ్యూ నుంచి గ్రేటర్ లో విద్యుత్ వినియోగం గణనీయంగా పడిపోతూవస్తున్నది. లాక్ డౌన్ మొదట్లో వినియోగం కోటియూనిట్ల (10 మిలియన్ యూనిట్లు ) పడిపోయి 3.2 కోట్ల – 3. 4 కోట్ల యూనిట్లు ( 32 -34 మిలియన్ యూనిట్లకు) చేరుకున్నది. లాక్ డౌన్ ప్రకటించడం, విడతల వారీగా పొడిగించడంతో విద్యుత్ వినియోగం సైతం తగ్గుతూ వస్తున్నది. మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు అదే పరిస్థితి కొనసాగగా, సరాసరిగా 3.7 -3. 8 కోట్ల యూనిట్ల (37 – 38 ఎంయూ) వరకు వినియోగమయ్యింది. ఏప్రిల్ రెండు, మూడో వారం నుంచి వినియోగం క్రమంగా పెరుగుతూ.. చివరి వారానికి గరిష్ఠానికి చేరుకున్నది. తాజాగా ఒక కోటి యూనిట్ల (10 మిలియన్యూనిట్ల) మేర పెరిగి 4.8 కోట్ల యూనిట్లకు (48 మిలియన్ యూనిట్లకు) చేరుకున్నది. ఏప్రిల్ నెల 23న సీజన్ లోనేగరిష్ఠంగా 4.59 కోట్ల యూనిట్ల వినియోగానికి చేరుకోవడం గమనార్హం. ఉష్ణోగ్రతలతోనే.. ఇక గత పక్షం రోజులుగా గ్రేటర్‌లో ఎండలు పెరిగాయి. ప్రత్యేకించి మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత అధికంగా ఉ ంటున్నది. పైగా రాత్రిపూట ఉక్కపోత సైతం కలవర పెడుతున్నది. దీంతో వీటి నుంచి బయటపడేందుకు జనం ఎయిర్ కండిషనర్లు (ఏసీ), కూలర్లను వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో రాత్రి పగలు తేడాల్లేకుండా ఏసీలు, కూలర్లు వాడుతున్నారు. దీంతో ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరిగిందని డిస్కం అధికారులు అంటున్నారు. అంతే కాకుండా.. లాక్ డౌన్లో పరిశ్రమలు, కమర్షియల్ లోడ్ తగ్గినా, ఫార్మా పరిశ్రమలు, రైస్ మిల్లులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఐటీ కంపెనీల డేటా సెంటర్లు, కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో లోడ్ సైతంపెరిగింది. వర్క్ ఫ్రం హెూమ్ తో..లాక్ డౌన్ ను విడతల వారీగా పొడిగించడం, ఇప్పట్లో సడలింపులకు అవకాశం లేకపోవడంతో కంపెనీలు వర్క్ ఫ్రం హెూమ్ ను ప్రోత్సహిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సహా పలు ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఇండ్ల నుంచే పనిచేస్తున్నారు. దీంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంతో పోల్చితే లాక్ డౌన్ రోజుల్లో గృహ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినట్లుగా డిస్కం అధికారులు పేర్కొన్నారు. పలు ఫీడర్లల్లో అధ్యయనం చేయగా, గత నెలతో పోల్చితే 15 – 20 శాతం గృహ విద్యుత్ వినియోగం పెరిగినట్లుగా తేలిందంటున్నారు. వీటన్నింటి ప్రభావంతో విద్యుత్ వినియోగం పై పైకి పోతుండగా, మే మాసంలో వినియోగం మరింతగా పెరుగుతుందని డిస్కం అధికారులుఅంచనాలేస్తున్నారు. నెల రోజులకు పైగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం భారీగా తగ్గింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, పలు పరిశ్రమలు మూసివేయడంతో గరిష్ఠ డిమాండ్లో సుమారు 20గిగావాట్ల విద్యుత్ తగ్గినట్లు తెలుస్తోంది. అయితే గృహ సంబంధమైన విద్యుత్ వినియోగం, డిమాండ్ మాత్రం భారీగా పెరిగినట్టు చెబుతున్నాయి గణాంకాలు. -తెలంగాణలో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోతోంది. లాక్డౌన్లో వినియోగం తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు విద్యుత్ అధికారులు. సాధారణంగా వేసవిలో పరిశ్రమలు, పంటల సాగు కోసం అధిక , డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య సంస్థలన్నీ మూతపడటంతో విద్యుత్ వినియోగం నిలిచిపోయింది. వరి కోతలు పూర్తవడంతో వ్యవసాయ కనెక్షన్లకు వాడకం తగ్గిపోయింది. అయితే ప్రస్తుతం గృహ విద్యుత్ వినియోగంమాత్రమే ఉందని తెలుస్తోంది. గత నెల 21న ఒకరోజు గరిష్ఠ విద్యుత్ డిమాండు 11,541 మెగావాట్లు ఉండగా.. మంగళవారం సాయంత్రం ఏడాదిలోనే కనిష్ఠంగా 4,147 మెగావాట్లు నమోదైంది. విద్యుత్ వినియోగం తగ్గిపోవడం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు. సౌత్ గ్రిడ్ లోనూ దాదాపు 8వేలమెగావాట్ల విద్యుత్ డిమాండ్ తగ్గింది. తెలంగాణలో 1500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పడిపోగా.. హైదరాబాద్ పరిధిలో 500 మెగావాట్ల వరకు తక్కువయింది. రాష్ట్రంలో వినియోగిస్తున్న విద్యుత్ లో దాదాపు 37 శాతం వ్యవసాయ రంగానికే వాడుతున్నట్టు విద్యుత్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ నెల 24న గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 9,832మెగావాట్లుగా నమోదు అయ్యింది. ఈ వేసవిలో దాదాపు 38 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయడం.. భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉండటంతో రైతులు విద్యుత్ ను భారీగా వినియోగిస్తున్నారు. పంటలు చివరి దశకు చేరడంతో మరో పక్షం రోజులు ఇలాగే ఉండే అవకావం ఉన్నదని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.గత మార్చి నెలలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో కరెంట్ డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి 28న ఉ దయం 7 గంటల 52నిమిషాలకు రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,168మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి 23న 13, 162 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదు కాగా ప్రస్తుతం ఆ రికార్డు చెరిగిపోయింది. కాగా తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఫిబ్రవరి, మార్చి మొదటి వారంలో పెరుగగా… లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి భారీగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం విద్యుత్ కు డిమాండులేకపోవడంతో సింగరేణి ప్లాంటులో ఉత్పత్తి నిలిపివేశారు. భూపాలపల్లిలో 500 మెగావాట్లు, మంచిర్యాలజిల్లా జైపుర్ లో 500 మెగావాట్లు ఉత్పత్తి తగ్గించారు. మిగతా థర్మల్ కేంద్రాల్లోనూ విద్యుత్ ఉత్పత్తి కుదించారు అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 13,73,819 స ర్వీసులు ఉన్నాయి. వీటికిగాను వసూలు కావాల్సిన బిల్లులు రూ.47.36 కోట్లు. ప్రతి నెల ఇప్పటికే 40 శాతం బిల్లులు వసూలు అయ్యేవి.కానీ ప్రస్తుతం 3.38 శాతం మాత్రమే వచ్చాయి. గత ఐదారు రోజుల నుంచి బిల్లులు వసూలు చేయడం ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు కేవలం రూ.1.59 కోట్లు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో విద్యుత్ కనెక్షన్లలో గృహ వినియోగసర్వీసులే 8,38,8 12 ఉన్నాయి. వీటికిగాను చెల్లించాల్సిన కరెంట్ బిల్లు రూ.22.35 కోట్లు కాగా, కేవలం రూ. 1. 22 కోట్లు మాత్రమే వసూలు కాగా, ఇంకా రూ.21.13 కోట్లు రావాల్సి ఉంది. కరోనా కారణంగా ఖర్చులు పెరగడంతో పాటు,ఉద్యోగుల జీతభత్యాల్లో ప్రభుత్వం కోత పెట్టడంతో కరెంట్ బిల్లులు చెల్లించేందుకు కూడా చేతిలో డబ్బు లేకుండా పోయిందని కొందరు చిరుద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే వైరస్వ్యాప్తి చెందకుం డా లాక్ డౌన్ప్రకటించడంతో గత నెల 21 నుంచే వ్యాపారాలు పూర్తిగా బందయ్యాయి. దీంతో కమర్షియల్ కేటగిరీలోకి వచ్చే దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలకు సంబంధించిన కరెంట్ బిల్లులు కూడా వసూలు కావడం లేదు. ఈ కేటగిరి కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వసూలు కావాల్సిన బిల్లులు రూ.8.05 కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.26.48 లక్షలు మాత్రమే వచ్చాయి. పరిశ్రమల కేటగిరీ లో వసూలు కావాల్సిన విద్యుత్ బిల్లులు సుమారు రూ.3 కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.9 లక్షలు మాత్రమే చెల్లించారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో వీధిలైట్లు, వాటర్ వర్క్స్కు సంబంధించి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బిల్లులు రూ.11.72 కోట్లు కాగా, ఇప్పటి వరకు నయా పైసా చెల్లించలేదు.