60 శాతం కేసులు అక్కడినుంచే
హెూంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు అంకితభావంతో పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినవారు తెలంగాణతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లారని, అందువల్లే కొన్ని పాజిటివ్ కేసులు వస్తున్నాయని వివరించారు. హైదరాబాద్ లోని భాజపా నగర కార్యాలయంలో మెడికల్ పోర్టల్ ను దిల్లీ నుంచి ఆన్లైన్లో కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… .. “ తెలంగాణలో నమోదైన కేసుల్లో 60శాతం మర్కజ్ కు వచ్చిన వారివే. హైదరాబాద్ లో ఒక్కో ఇంటి నుంచి 20..30 కేసులు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారుల బ ఎందాన్ని రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం, సలహాలిచ్చేందుకు ఈ బృందం పనిచేస్తుంది. కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో లా డౌన్ అమలు చేస్తోంది. ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేయడంతో ఎమర్జెన్సీ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి…ఇదో విచిత్రమైన పరిస్థితి. అనారోగ్యానికి గురైతే ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరముంది. ఆరోగ్య సేతు యాప్లో ఆరోగ్య వివరాలు పొందుపరిస్తే… తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. అందరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే… మీ చుట్టూ ఉన్న వారికి కరోనా ఉంటే అలర్ట్ చేస్తుంది. చాలా మంది డాక్టర్లు పేద ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.. వారికి అభినందనలు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సేవకులు ఉంటారు. అనారోగ్యంతో బాధపడుతుంటే సంబంధిత డాక్టర్‌కు ఫోన్ చేస్తే వైద్య సహాయం అందిస్తారు. అన్ని విభాగాల వైద్యులు ఇందులో ఉన్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. లాక్ డౌన్ సమయంలో డాక్టర్ల సేవలు వినియోగించుకోవాలి. ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన వారు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అందరికీ మనం అండగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి” అని కిషన్ రెడ్డి తెలిపారు. కొన్ని నగరాలల్లో అధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వస్తున్నాయని, ఇందుకు కారణం మర్కజ్ ప్రార్తనలు చేసిన సభ్యులు తెలంగాణతో పాటు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు వెళ్లారని తెలిపారు. 60 శాతం మర్కజ్ కు వచ్చిన వారి కేసులే ఉన్నాయిని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం, సలహాలిచ్చేందుకు కేంద్ర అధికారుల బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిందని ఆయన తెలిపారు. కొన్ని మినహాయింపులు కేంద్రం ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ చేసిందని ఆయన అన్నారు. సింకింద్రాబాద్లో స్థానిక కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా బీజేపీ కార్యకర్తలు పాటిస్తున్నారని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. (ఆకలితో ఉంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి) ఆసుపత్రుల్లో ఓపీలను మూసివేశారు. ఎమర్జెన్సీ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. ఏదైనా జబ్బు వస్తే ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని, అలాంటి వారిని ఆదుకోవాలని ఆయన తెలిపారు. ‘ఆరోగ్య సేతు’ యాప్లో ఆరోగ్య వివరాలు పొందుపరిస్తే, కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుందని ఆయన చెప్పారు. ప్రజలంతా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే మీ చుట్టూ ఉన్న వారికి కరోనా ఉంటే అలర్ట్ చేస్తుందని మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. అది బాడీగార్డులా పని చేస్తుందని ఆయన అన్నారు. పేదలను వైద్యపరంగా ఆదుకునేందుకు డాక్టర్ల బృందంతో మాట్లాడి ప్రతి నియోజకవర్గంలో సేవలందించడానకి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. చాలా మంది డాక్టర్లు ప్రజలకు సేవలందిస్తామని చెబుతున్నారని, ఒత్తిడిలో ఉన్నా ప్రజాసేవకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. (సఫాయీ.. ఓ సిపాయి) ప్రతి అసెంబ్లీలో నియోజకవర్గంలో సేవకులు ఉంటారని, ఏదైనా అనారోగ్యంతో బాధపడితే సంబందిత డాక్టర్లకు ఫోన్ చేసి మెడికల్ అసిస్టెంట్ తీసుకోవచ్చని, అన్ని విభాగాల డాక్టర్లు ఇందులో ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో ఒక్కో డాక్టర్‌కు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అసిస్టెంట్లుగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమం వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రజలను మంత్రి కోరారు. సంపత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేస్తారని, దివ్యాంగులు, వృద్ధులకు ఇంటికే మెడిసిన్ తెచ్చిస్తారని కిషన్ రెడడ్డి చెప్పారు. ప్రజలు లాక్ డౌనకు సహకరించడం లేదు, దీంతో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకొని కుటుంబ సభ్యలను కాపాడుకోగలమని, కోవిడ్ కు వ్యతిరేకంగా పోరాడుతూ సేవలు అందిస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల ఏ సేవ చేసేందుకు ముందుకు వచ్చినా సామాజిక దూరం పాటించాన్నారు. కమాండ్ కంట్రోల్ రూంలో ఉండే సిబ్బంది పేదలు, వృద్ధులు, మహిళలు ఏ సేవలు అడిగినా విసుక్కోకుండా సేవ చేయాలన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారు మా హెల్ప్ లైన్ నంబర్ 9959261273 లేదా కిషన్ రెడ్డి అనే వెబ్ సైట్, ఫేస్ బుక్, ట్విటర్‌లో పెట్టిన లిస్ట్ చూసి సంప్రదించాలని ఆయన కోరారు. 180 మంది డాక్టరు ఆయా సమయాల్లో అందుబాటులో ఉంటారని మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ప్రకాష్ రెడ్డి, గౌతమ్ రావు, అజయ్, డాక్టర్లు సురేష్ గౌడ్ పాల్గొన్నారు.