అక్షయ బంగారం కొనుగోళ్లు ‘క్షయం’

నేడు అక్షయ తృతీయ… బంగారం అమ్మకాలపై లాక్ డౌన్ ఎఫెక్ట్

  • గతేడాది రికార్డు స్థాయిలో బంగారం అమ్మకాలు
  • ఈ సంవత్సరం కరోనా ప్రభావంతో షాపులన్నీ వెలవెల
  • ఆన్‌లైన్లో అమ్మకాలకు తెరతీసిన కొన్ని సంస్థలు
  • దానికి కూడా పెద్దగా ఆదరణ కనిపించక వ్యాపారుల ఆందోళన
  • కొనుగోళ్లు లేకున్నా తగ్గని బంగారం డిమాండ్
  • డబ్బును బంగారం రూపంలో దాచుకోవానుకుంటున్న జనాలు
  • ఎన్ని ఉపధ్రువాలు వచ్చినా బంగారానకి డోకా లేదంటున్న విశ్లేషకులు
  • లాక్ డౌన్ తర్వాత కూడా పెరగనున్న బంగారు ఆభరణాల విలువ

హైదరాబాద్: ప్రతి ఏడాది లాగా ఈ సారి కూడా అక్షయ తృతీయ వచ్చింది. అయితే లాక్ డౌన్ ఉండడంతో అక్షయ తృతీయ రోజు ఎంతో కొంత బంగారం కొంటున్న వారు… ఈ సారి ఏం చేయాలి అన్న చర్చ మొదలైంది. గోల్డ్ షాపులు తెరిచి ఉంటే బయటకు వెళ్లి… బంగారం కొని సెంటిమెంట్ ను కొనసాగించేవారు. ఇటు గోల్డ్ షాపులు కూడా అక్షయ తృతీయ ఆఫర్లు కూడా ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అక్షయ తృతీయ వస్తే చాలు బంగారం దుకాణాలన్నీ కిటకిటలాడుతుంటాయి. ఉన్నవారైన.. లైనివారైన సరే ఎంతోకొంత పసిడిని కొని సంతోషపడతారు. ఇలా చేస్తే సిరిసంపదలు కలిసి వస్తాయని నమ్ముతుంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితుల్లో పండితులు అక్షయ తృతియ రోజు ఏం చేయాలో సలహలు సూచనలు ఇస్తున్నారు. లాక్ డౌన్ ఉంది కాబట్టి… అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మంచిదో చెబుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉండడంతో పలు గోల్డ్ షాపులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పలు కంపెనీలు అక్షయ తృతీయ రోజు బంగారం కొన్న కస్టమర్లకు గోల్డ్ ఓనర్ షిప్ సర్టిఫికేట్లను పం పేందుకు సిద్ధం అవుతున్నాయి. మొత్తానికి ఏదో ఓ విధంగా సెంటిమెంట్ ఫాలో అయ్యామన్న సంతృప్తి చెందితే చాలనుకుంటున్నారు పసిడి ప్రేమికులు. బంగారం ధరలు అధికంగా పెరుగనున్నాయి. ఒకవైపు ఆర్థిక మాంద్యం బుసలు కొడుతుంటే మరోవైపు కరోనా రక్కసి విస్తరించడంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతుండటంతో తమ పెట్టుబడులు సురక్షితమైన, అతి విలువైన లోహాల వైపు మళ్లిస్తుండటంతో వీటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు రూ.50 వేల నుంచి రూ. 55 వేల మధ్యలోకి చేరుకోనున్నాయని విశ్లేషకులు అంచనా వేసున్నారు. న్యూయార్క్ బులియన్ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ ధర ఏడేళ్ల గరిష్టానికి 1715.25 డాలర్లు పలికింది. డిసెంబర్ 2012లో నమోదైన 1722 డాలర్ల తర్వాత ఇదే గరిష్ట స్థాయి ధరలు కావడం గమనార్హం. అమెరికా గోల్డ్ ఫ్యూచర్ లో 1770.20 డాలర్లుగా ట్రేడ్ అవుతోంది. కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాల ఆర్థిక సంక్షోభం పసిడి ధరలు పెరిగేందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు తెలిపారు. 2019లో 23.74 శాతం రిటర్నులు పంచిన బంగారం … ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో పది గ్రాముల ధర రూ.6,94 లేదా 17.31 శాతం ఎగబాకింది. ఇప్పటి వరకు 15.19 శాతం రిటర్నులు పంచింది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటంతో వచ్చే రెండు మూడేళ్ల వరకు బంగారం మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయని పీఎన్ జీ జువెల్లరీ ఎండీ సౌరభ్ గాడ్జిల్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా యుద్ధం లేదా సంక్షోభం జరిగిన వెంటనే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఏప్రిల్ 20 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బంగారం ధరల్లో సందిగ్ధత నెలకొంది. అయితే ఓ వారం భారీగా పెరిగితే, మరో వారం భారీగా పతనం అవుతున్నాయి. దీంతో పసిడి బాట ఎటువైపు అనేది బులియన్ పండితులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రూ.45 వేల మార్క్ క్రాస్ చేసి ఆల్ టైం రికార్డు అందుకుంది. అయితే మళ్లీ ఆ స్థాయి నుంచి పతనమైంది. ఇదంతా గడిచిన నెల రోజుల వ్యవధిలో చోటుచేసుకుంది. ఓ దశలో పసిడి ధరలు ఆల్ టైం రికార్డుల మోత మోగిస్తూ ఏడు సంవత్సరాల రికార్డు స్థాయిన తాకింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ విజృంభించడంతో ప్రపంచ ఆర్థిక ప్రగతి పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలోని సొమ్మును మదుపరులు భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారం, వెండి వైపు తరలిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఊపందుకుంది. తత్ఫలితంగా ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర మరోసారి 1,600 డాలర్ల ఎగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగానూ విలువైన లోహాల రేట్లు ఎగబాకాయి. అమెరికా, యూరప్ లో కరోనా దెబ్బతో మరణాలు ఒక్కసారిగా వేలల్లోకి చేరడంతో పాటు ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు చమురు ధరలు సైతం భారీగా పతనమవుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ క్రూడాయిల్ ధర 30 డాలర్ల దిగువకు పతనమైంది. దీంతో అందరి కన్ను సేఫ్ పెట్టుబడిగా భావించే బంగారం పై పడింది. ముఖ్యంగా ఇన్వెస్టర్లు కరోనా వైరస్ భయాలతో ఉత్పత్తి మందగించిందని, అంచనాకు వస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు 2 నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్) దాకా నష్టపోవచ్చని ఏడీబీ పేర్కొంది. గ్లోబల్ జీడీపీలో ఇది 2.3-4.8 శాతానికి సమానంగా ఉంటుందని వివరించింది. వర్ధమాన ఆసియా దేశాలు కరోనా వైరస్ వల్ల అత్యధికంగా నష్టపోనున్నాయని తెలిపింది. దీంతో ఇప్పటికే ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈక్విటీ మార్కెట్లలోని బేరిష్ ట్రెండ్ అటు బంగారానికి మాత్రం బుల్లిష్ ధోరణిని పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం అంత తొందరగా బంగారం వైపు మదుపరులు తమ పెట్టుబడులు తరలించకపోయినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం మరింత ధర పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశీయ బులియన్ మార్కెట్ల పై దీని ప్రభావం ప్రత్యక్షంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1600 డాలర్లు తాకింది. గత సంవత్సరం డిసెంబర్ 16న ఔన్సు బంగారం ధర 1472 డాలర్లు ఉండగా. ప్రస్తుతం 1600 డాలర్లకు ఎగిసింది. అంటే ఏకంగా 130 డాలర్లు పెరిగింది. ఫలితంగా అటు దేశీయంగా సైతం బంగారం ధరలు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఇప్పటికే దేశీయంగా 24 కేరట్ల ధర 44 వేల పై చిలుకే పలుకుతుండగా, ఔన్సు బంగారం 2,000 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్ అంచనా వేసింది. మరోవైపు కరోనా ఎఫెక్ట్ నుంచి బయట పడిన తర్వాత అభివ ృద్ధి చెందిన దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సహా పలు యూరప్ దేశాలు తమ పసిడి నిలువలను ప్రపంచ మార్కెట్ లో అమ్మకానికి పెట్టే అవకాశం ఉందని, అప్పుడు బంగారం ధరలు పతనమయ్యే చాన్స్ ఉందనే విశ్లేషణలు కూడా ఏర్పడుతున్నాయి. అయితే దీనికి ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. భారత్ లో బంగారం ప్రియులెక్కువే. ఇదివరకెన్నడూ బంగారం కొనుగోలు చేయని 29 శాతం దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లు సైతం ఈ లోహం పై దృష్టిసారించారట. వీరు కూడా పసిడి కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక వెల్లడించింది. ‘ఇండియా రిటైల్ ఇన్వెస్టర్ ఇన్ సైట్స్’ పేరుతో డబ్ల్యూజీసీ విడుదల చేసిన తాజా నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు… బంగారు భారత్! ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ఈ విషయంలో చైనా తర్వాత స్థానం మనదే. పండగలు, పెళ్లిళ్లకు బంగారు ఆభరణాలు, నాణేల కొనుగోలు సంప్రదాయంగా మారింది. పెట్టుబడి అవసరాల కోసం గోల్డ్ ఈటీఎఫలు, గోల్డ్ ఫండ్స్, ప్రభుత్వ పసిడి బాండ్లు అందుబాటులోకి వచ్చాయి. విశ్వసనీయత లేకే.. బంగారం నాణ్యత పై విశ్వసనీయతే కొనుగోళ్లకు అతి పెద్ద సమస్య అని డబ్ల్యూజీసీ నివేదిక అంటోంది. లోహ నాణ్యత పై విశ్వసనీయత లేకపోవడం వల్లే చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ముందుకు రావట్లేదంటోంది. భారత్ లో 61 శాతం మంది ఈ ఆందోళనను వ్యక్తపర్చగా.. గ్లోబల్ గా ఈ వాటా 48 శాతమని డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది. బంగారం వినియోగంలో ప్రపంచంలోనే నం.1 దేశం చైనా. దీని సెంట్రల్ బ్యాంక్ వద్దనున్న బంగారం నిల్వలు సైతం చాలా ఎక్కువే. గతేడాది చివరినాటికి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ) వద్ద సుమారు 1,950 టన్నుల బంగారం నిల్వలున్నాయి. మొత్తం విదేశీ మారక నిల్వలు 3 లక్షల కోట్ల డాలర్ల పైమాటే. కరోనా సంక్షోభంతో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. దీంతో అమెరికన్ డాలర్‌తో పాటు ఇతర ప్రధాన కరెన్సీల విలువ పై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో పీబీఓసీ తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉంది. హెడ్డింగ్ కోసం విదేశీ మారక నిల్వల్లో భారీ మొత్తాన్ని బంగారం రూపంలోకి మార్చుకోవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. గోల్డ్ ఏ రూ.80,000! కరోనా కల్లోలంలో ‘కనకం’ కొండెక్కుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారం పై ఇన్వెస్టర్ల దృష్టి మళ్లింది. పసిడిలో పెట్టుబడులు కుమ్మరించడంతో గడిచిన రెండు నెలల్లో ధర అమాంతం పెరిగింది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం 1,750 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. ఈ ధర కాస్తా వచ్చే 18 నెలల్లో 3,000 డాలర్లకు చేరుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బోఫా) అంచనా వేసింది. ఈ లెక్కన మన దేశంలో 10 గ్రాముల బంగారం (ప్రస్తుత రూపాయి మారకం రేటు, దిగుమతి సుంకం ప్రకారం) దాదాపు రూ.80,000కు చేరుకునే అవకాశం ఉంది.