స్వీయ నిర్బంధంలోకి పాక్ ప్రధాని
కరోనా పాజిటివ్ వ్యక్తిని కలిసిన ఇమ్రాన్‌ఖాన్..అనుమానంతో కోవిడ్ పరీక్షలు
హైదరాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల ఆయన ఓ ప్రముఖ దాతను కలిశారు. ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో తాను సెల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్తున్నట్లు ప్రధాని ఇమ్రాన్ తెలిపారు. ఇమ్రాతో ఇటీవల ప్రముఖ దాత, ఎది ఫౌండేషన్ చైర్మన్ ఫైసల్ ఎది సమావేశమయ్యారు. ఫైసల్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఇమ్రాన్ కూడా పరీక్షలు చేయించుకున్నారు. మంగళవారం ఇమ్రాన్ శ్యాంపిళ్లను డాక్టర్లు సేకరించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం శ్యాంపిళ్లు సేకరించినట్లు డాక్టర్లు తెలిపారు. పాజిటివ్ వ్యక్తిని ఇమ్రాన్ కలిసినందుకు ఈ పరీక్ష తప్పలేదు. పాక్ లో కరోనా మృతుల సంఖ్య 200 దాటింది. ఎది ఫౌండేషన్ కు చెందిన ఫైసల్ ఇటీవల ఇమ్రాన్ కు పది మిలియన్ల చెక్ ను అందజేశారు. పారిశ్రామికవేత్త అబ్దుల్ సత్తార్ ఎది కుమారుడే ఫైసల్ ఎది. కరోనా సోకిన వ్యక్తితో ఓ రూమ్ లో 15 నిమిషాలు మాట్లాడినా లేక అతనికి ఆరు ఫీట్ల లోపు దగ్గరగా ఉన్నా.. వైరస్ సంక్రమించే అవకాశాలు ఉ న్నట్లు పాక్ జాతీయ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్‌కు పరీక్షలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోయినా.. అందుకున్న చెక్ నుంచి వైరస్ ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. కరోనా కట్టడికి కీలక నిర్ణయం హెం క్వారంటైన్ గడువును 14 నుంచి 28 రోజులకు పెంచిన టి.సర్కార్ హైదరాబాద్: కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెం క్వారంటైన్ గడువును 14 నుంచి 28 రోజులకు పెంచింది. రాష్ట్రంలో కొంత మందికి వైరస్ లక్షణాలు 28 రోజులవరకు బయటపడటం లేదని.. దీని వల్ల సమస్యలు ఉ త్పన్నమవుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో హెూం క్వారంటైన్లో ఉన్నవారు ఇక పై 14 రోజులు కాకుండా 28 రోజులు ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కరోనా టెస్టుల విషయంలోనూ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. కేవలం ప్రైమరీ కాంటాక్టులకే కరోనా పరీక్షలు చేయాలని.. సెకండరీ కాంటాక్టులను టెస్టు చేయొద్దని అధికారులకు స్పష్టం చేసింది. దాంతోపాటు వైరస్ బాధితుడితో ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న వ్యక్తికి మాత్రమే పరీక్షలు చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. సెకండరీ కాంటాక్ట్ ను టెస్ట్ చేయొద్దని.. వారిని హెూం క్వారంటైన్ లో ఉంచితే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెకండరీ కాంటాక్ట్ కు స్టాంప్ వేసి.. 28 రోజులపాటు హెూంక్వారంటైన్ లో ఉంచాలని సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఒడిశా, కేరళ, అస్సాం, జార?ండ్ రాష్ట్రాలు కూడా హం క్వారైంటన్ కాలాన్ని 28 రోజులకు పెంచాయి.