ప్రైవేటు స్కూళ్లకు ఎర్నింగ్ గా మారిన ఈ..లెర్నింగ్
ఆన్‌లైన్‌లోనే విద్యార్థులకు హెం వర్కులు..మరో పక్క ఫీజుల వసూళ్లు
- ప్రైవేటు స్కూళ్లకు కలిసొస్తున్న లాక్ డౌన్
- టీచర్లకు జీతాలివ్వకుండా తప్పించుకుంటున్న యాజమాన్యాలు
- విద్యార్థులకు ఆన్లైన్లోనే హెూం వర్కులు
- వాట్సాప్లో మర్నాటి కార్యక్రమ వివరాలు
- మార్చి, ఏప్రిల్, మే నెల ఫీజులు కట్టాలంటూ ఒత్తిళ్లు
- అందుకోసమే ఆన్లైన్ ఎత్తుగడలు
- సెలవల్లో అన్నీ మర్చిపోతారని పేరెంట్స్ కు హితవు
- యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గుతున్న తల్లిదండ్రులు
- వచ్చే సంవత్సరం ఫీజులు అడ్వాన్స్ గా కట్టించుకుంటున్న మరికొందరు
హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. మన దేశంలోనూ కరోనా ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు భారత్ లో ఐదువేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించారు. దీని వల్ల చాలా మంది అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ దేశ ప్రజల ప్రాణాలే ముఖ్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే… ఈ లాక్ డౌన్ వేళ కొందరు మాత్రమే లాభపడ్డారు. వారే ఆన్ లైన్ కంపెనీలు. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. అయితే పలు విద్యా సంస్థలలో ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. మొబైల్, యూట్యూబ్, వర్చువల్ తరగతుల ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. అయితే పలు విద్యా సంస్థలలో ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. మె ఎబైల్, యూట్యూబ్, వర్చువల్ తరగతుల ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఐటీ సంస్థ బ్లిస్ మార్కామ్ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ మాట్లాడుతూ ఇప్పుడు ఆన్లైన్ కంపెనీలకు భారీ అవకాశాలు దక్కుతున్నాయన్నారు. అలాగే పలు ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇ-లెర్నింగ్ ను అమలు చేసేందుకు యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో లాకౌన్ తర్వాత ఇ-లెర్నింగ్ విద్య విధానం అమలుకావచ్చు. విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇ-లెర్నింగ్ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రవేటు స్కూళ్ల ఫీజుల దాహం కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇక ప్రపంచమే ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న వేళ సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఇప్పటికే దీంతో లాక్ డౌన్ అమలవుతున్న నాటి ఇళ్లకే పరిమితం అయిన ప్రజలు పనుల్లేక , పైసల్లేక నానా చావు చస్తున్నారు . ఇక ఈ సమయంలో స్కూళ్ళ నుండి, కాలేజీల నుండి ఫీజులు కట్టమని అడిగితే ఆ చిరాకు ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు . ఆన్ లైన్ క్లాసుల వెనుక మతలబు ఇదే తాజాగా అలాంటి ఒక సందర్భం చోటు చేసుకుంది. ఇక ఆ ఆడియో ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది . ఇక ఈ నేపధ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసులకు తెరతీశాయి. కార్పోరేట్ స్కూళ్ళు తమ విద్యర్థుల పట్ల తమకు ఎంతో శ్రద్ధ ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఎలాగోలా క్లాసుల చెబుతున్నాం కదా, ఫీజులు కట్టమంటూ తల్లిదండ్రుల పై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో కొందరు తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఫీజులు కట్టాలని ఒత్తిడి … కట్టలేమని చెప్తున్న తల్లిదండ్రులు లాక్ డౌన్ తో ఉద్యోగాలు పోయిన కొందరు, వ్యాపారాలు సాగక కొందరు , జీతాల్లో కోత విధించిన కొందరు ఆర్థిక కష్టాలలో , నష్టాలలో తెగ ఇబ్బంది , కాలేజీల నుండి మీ పిల్లల ఫీజులు చెల్లించండి అంటే ఇక ఆ పరిస్థితి తల్లిదండ్రులకు ఎంత ఇబ్బందికరమో అర్ధం చేసుకోవచ్చు . లాక్ డౌన్ సమయం నుంచి ఉపాధి లేక అల్లాడుతుంటే.. ఎక్కడ నుంచి డబ్బు తెచ్చి ఫీజులు కట్టాలని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. కొందరు పిల్లల చదువులు ఎలా అని బాధ పడుతున్నారు. ప్రభుత్వాలు కూడా స్కూల్ ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యం మాత్రం ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాయి. ఫీజు కట్టమంటే ఓ విద్యార్థి తండ్రి రెస్పాన్స్ ఆడియో వైరల్ తాజాగా ఓ విద్యార్థి తండ్రికి కాల్ చేసిన స్కూల్ సిబ్బందిలో ఓ వ్యక్తి ఫీజు కట్టమని అడిగితే ఫోన్లోనే ఆ తండ్రి లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశాడు. మీకసలు మానవత్వం ఉందా అని ప్రశ్నించాడు . అసలు లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ క్లాసులు పెట్టమని మీకు ఎవరు చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రతకటం ఎలాగా అని బాధ పడుతుంటే మీకు చదువులు కావాలా అని గట్టిగా నిలదీశారు. అసలే పనుల్లేక , ఇళ్లకే పరిమితమై చాలా ఇబ్బందిలో ఉన్నామని , ఇంకెవరినీ ఈ తరహా ఫీజుల కోసం అడగొద్దని , అనవసరంగా తిట్లు తినొద్దని వాయించేశారు. ఫీజు కట్టలేమని ఆగ్రహం.. మానవత్వం ఉందా అని ప్రశ్న ” ప్రభుత్వానికి విజ్ఞప్తి ఈ వ్యవహారం సీఎం కేసీఆర్ దాకా తీసుకెళ్తామని గడ్డి పెట్టారు . మీ యాజమాన్యం ఎవరో వాళ్ళ నంబర్ ఇవ్వండి మేం మాట్లాడతాం … ఫీజులు ఇప్పుడు కట్టలేం అని తేల్చి చెప్పారు. లాక్ డౌన్ ముగిసి యధావిధిగా పనులు సాగేవరకు ఫీజులు అడగొద్దని ఆ తండ్రి పేర్కొన్నారు . ఈ టైం లో ఫీజులు అడగటానికి నోరెలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెవరికి ఇలా ఫోన్లు చెయ్యొద్దని హితవు పలికారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలని స్కూళ్ళు , కాలేజీల ఫీజుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సామాన్య , మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించడం ద్వారా తమ పిల్లల చదువులు పాడవుతున్నాయని ఆందోళన చెందుతోన్న తల్లితండ్రులకు తెలంగాణ సర్కార్ శుభవార్త విన్పించింది . ఇక నుంచి ఆన్ లైన్ లో డిజిటల్ విద్యాబోధన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఈ మేరకు సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి , ఆన్ లైన్ క్లాసుల విద్యా బోధన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు . ఈ అవకాశాన్ని తెలంగాణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు . లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే పదవతరగతి విద్యార్థుల పరీక్షలు అర్థాంతరంగా నిలిపోయిన విషయం తెల్సిందే . విద్యార్థులు తాము చదుకున్న పాఠాలు మర్చిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని విద్యా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు . అదే సమయం లో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై క్లాసులకు ప్రమోట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . దీనితో వారు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్తుండడం వల్ల, వారికి పాఠ్య పుస్తకాల్లోని పాఠాలపై ఉ న్న పరిజ్ఞానం ఎంత అన్నది తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది . పరీక్షలు రాయకుండానే పై క్లాసులకు వెళ్లిన వారికి కూడా ఆన్ లైన్ క్లాసుల ద్వారా ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు . ఈ నెల 21 వ తేదీ నుంచి టి శాట్ ఛానల్ ద్వారా ప్రతి రోజు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రతి రోజు ఒక పాఠాన్ని బోధిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు . అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత ప్రతి రోజు ఆన్ లైన్ తరగతులు నిర్వహించడాన్ని టి శాట్ ఛానల్ అన్ని ఏర్పాట్లు చేసిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు . అయితే ఈ ఆన్లైన్ లేక ఈ లెర్నింగ్ విద్యావిధానం ఆలోచన గొప్పదే కానీ దాని ఆచరణ మాత్రం కొందరికి అక్రమ మార్గంలో డబ్బు సంపాదనకు దారితీయిస్తోంది. టీచర్లకు జీతాలివ్వాలని చెప్పి కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు తల్లిదండ్రులనుంచి ఫీజులు వసూలు చేయడమేకాక…వచ్చే సంవత్సరానికి కూడా ఎంతో కొంత అడ్వాన్సులు సైతం కట్టమని అడుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కొంతమేరకు ప్రజలకు సహాయం చేసినా తల్లిదండ్రులే ఈ విధానాలపై అవగాహన పెంచుకోగలిగి ఉండాలి. తమ కళ్ల ముందర జరిగే మోసాలను వాళ్లే ప్రతిఘటించాలి. ఇలాంటి అక్రమాలకు కళ్లెం వేయాలి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం మీకే ఉంది. దీనిపై పునరాలోచన చేయవలసిన బాధ్యత మీదే.