యోగికి పితృవియోగం

లాక్ డౌన్ నేపథ్యంలో తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేనన్న యుపీ ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ: కరోనా ముప్పు నుంచి ఉత్తర్ ప్రదేశ్ ప్రజలను రక్షించేందుకు తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకావడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. నిస్వార్థంగా సేవచేయాలని చెప్పిన తండ్రిని కడసారి చూసేందుకు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించలేనని తెలిపారు. యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిష్ సోమవారం ఉ దయం 10.44 గంటలకు దిల్లీలోని యిమ్స్ లో కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో ఆయన నెల రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి తండ్రి ఉదయం 10.44 గంటలకు స్వర్గస్థులయ్యారు. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి’ అని యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి అవినాశ్ అవస్థి ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా పై పోరాడుతున్నందుకు మంగళవారం తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం లేదని యోగి ఆదిత్యనాథ్ న్నారు. ‘మా నాన్నగారి మరణవార్త విని బాధపడ్డాను. విశ్వసనీయతతో నిస్వార్థంగా కష్టపడాలని మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు. చివరి క్షణాల్లో నేను ఆయన పక్కనే ఉండాల్సింది. ఉత్తర్ ప్రదేశ్ 23 కోట్ల ప్రజల్ని రక్షించాల్సిన నా బాధ్యతతో అలా ఉండలేకపోయాను. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయ