గ్రామీణ పేదలకు ఉరటనిస్తున్న ఉపాధి హామీ పథకం
కరోనా మహమ్మరి నుంచి కార్మికుల రక్షణకు పలు చర్యలు – ఊతమిస్తున్న కేంద్ర పథకాలు
హైదరాబాద్,జ్యోతిన్యూస్ : గ్రామీణ ప్రాంతాల నుంచి నగర, పట్టణ ప్రాంతాలకు కార్మికుల వలసలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో గ్రామీణ కూలీలకు ఎంతో ఊరటనిస్తోంది. ఉన్న ఊరిలోనే ఉపాధి లభిస్తుండటంతో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం దినసరి వేతనాన్ని 182 రూపాయల నుంచి 202 రూపాయలకు పెంచడం పట్ల కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కరోనా సంభ సమయంలో ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడం, తాము పనిచేసే చిన్నపాటి పరిశ్రమలు లాక్ డౌన్ వల్ల మూతపడటంతో వారు ఈ పథకం కింద ఉపాధి పొందడానికి ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి తొమ్మిది లక్షల మంది కూలీలు నమోదై ఉండగా వీరిలో 60 లక్షల మంది చురుగ్గా ఉన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ పథకం కింద 9.75 కోట్ల పనిదినాలు కల్పించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా లేకపోవడంతో పాటు ఎలాంటి ప్రయాణాలు చేయవలసిన అవసరం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద పనులు చేపట్టడానికి అనుమతి ంచింది. పనులు జరిగే చోట కూలీల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా చూడాలని, కార్మికులకు మాస్కులను అందించాలని ప్రభుత్వం పేర్కొంది. బ్యాచ్ ల వారీగా పని కల్పించాలని, ఒకే చోట కాకుండా వేర్వేరు చోట్ల పనులు చేపట్టాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉపాధి పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వంద శాతం పనులు కూడా పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే లాక్ డౌన్ కారణంగా సొంత ఊళ్ళకు వెళ్లలేక అక్కడే నిలిచిపోయిన వలస కార్మికులకు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి చేకూరే విధంగా అక్కడి కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి హామీ పనులు చేయునపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు… – ఉపాధి హామీ పధకం కింద పనికి వచ్చే వారు కొన్ని నియమాలు పాటించే విధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ క్రింది ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించాలని జిల్లాలోని కార్యక్రమ సమన్వయ కర్తలు, మండల అభివృద్ధి అధికారులు సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. – కంటైన్ మెంట్ జోన్ గా గుర్తించిన ప్రాంతాలలో నిబంధనలు అమలులో ఉన్నంత కాల ఎట్టి పరిస్తుతులల్లోనూ పనులను ప్రారంభించకూడదు. – కూలీలు పని ప్రదేశమునకు వచ్చేటప్పుడు, పని ప్రదేశంలోను, ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ముఖమ ఎనకు మాస్కూలు, చేతి రుమాలు,కండువాలను ముక్కు, నోరును కప్పే విదముగా ఒక రక్షణ వస్త్రమును ధరించవలెను. – ఈ మాస్కులను చేతి రుమాలును ఇంటిలోనే తయారు చేసుకొని, వాటిని శుభ్రముగా తిరిగి ఉపయోగించుకోవడం వంటి విషయాల పైనా అవగాహన కల్పించాలి. – ఉపాధి హామీ పధకము ద్వారా కల్పిస్తున్న పనులకు హాజరయ్యే కూలీలు వీలైనన్ని ఎక్కువ సార్లు పనికి వచ్చే ముందు, పని చేసిన తర్వాత, పని నుండి ఇళ్లలోకి చేరుకోగానే వారి చేత సబ్బుతో కానీ,సబ్బు నీటితో కానీ శానిటైజర్ తో కానీ శుభ్రముగా కడుక్కోవాలి. – కూలీలందరి పనులను ఒకే పని ప్రదేశములో కాకుండా, వీలైనన్ని ఎక్కువ వేరు వేరు పని ప్రదేశములలో కల్పించ వలెను. కూలీలు పనికి వచ్చే మార్గములో చేస్తున్నప్పుడు, మరియు పని చేసిన తర్వాత ఇంటికి చేరేటప్పుడు ఒకరికి ఒకరికి మ కనీసం ఆరు ఫీట్ల దూరంను విధిగా పాటించవలెను – పని ప్రదేశములో ఉమ్మి వేయడం గాని, పొగ తాగడం కానీ, పాన్ లేక గుట్కా వంటివి కానీ చేయకూడదు – ఉపాధి కూలీలు పని ప్రదేశములో పని చేస్తున్నపుడు, శరీరం పై ఏర్పడే – ఎప్పటికపుడు శుభ్రమైన చేతి రుమాలు టవల్ తో ను తుడుచుకోవలెను. ఇతరులు వ ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించ కూడదు. – పని ప్రదేశములో విశ్రాంతి తీసుకునేటప్పుడు కూలీలు గుంపులుగా కూర్చోకూడదు. ఎటువంటి సమావేశాలు కానీ నిర్వహించ కూడదు. – కూలీలలో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, తుమ్ములు మరియు శ్వాస సంబంధిత వంటి వాటితో ఇబ్బంది పడుతుంటే, తమకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వెంటనే చికిత్స పొందవలెను. వారు వెంటనే తమను తాము నిర్బంధించుకోవాలి. – ఉపాధి పనుల్లో చేపట్టవలసిన పనులలో ప్రాముఖ్యత ఇవ్వవలసినవి: నీటి పారుదల మరియు నీటి సండే సంభందించిన పనులను ఎక్కువగా చేపట్టవచ్చును. – వ్యక్తిగత, ఉమ్మడి మరియు సామాజిక పనులు: ఫీడర్ ఛానెల్స్, డిస్ట్రిబ్యూటర్ కాలువ, నీటి పారుదల కాలువలు, వ్యవసాయ బావుల త్రవ్వకం, ఫారం నిర్మాణం, ఊటకుంటల నిర్మాణము, ఎన్ని రకాల నీటి నిల్వ కందకాలు, రీచార్జి పిట్స్ గుట్టల చుట్టూ నీటి నిల్వ కందకాల వంటి పనులు చేపట్టడం, అదేవిధంగా రకాల కాలువల్లో మరియు చెరువులల్లో పూడికతీత వంటి పనులను చేపట్టవచ్చును. ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్న ప్రస్తుత సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పధకాన్ని ప్రారంభించడమే కాకుండా రోజు వారీ కులీని మరో 20 రూపాయలకు పెంచడం పేదవారికి ఎంతో ఊరటనిస్తుంది. ఈ సందర్భంగా కొంత మండి కూలీలతో మాట్లాడినపుడు ప్రభుత్వం తమకు ఊయపాధి కల్పించి ఆదుకుంటుందని హర్షం వ్యక్తం చేశారు.