నాటి మోదీ ప్రణాళికలే.. నేటి కరోనా పాఠాలు

ఆరేళ్ల క్రితమే స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా పథకాలకు అంకురార్పణర 

  • పరిసరాల పరిశుభ్రతే స్వచ్ఛ భారత్ లక్ష్యం
  • కరోనా వైరస్ కట్టడికి దోహదపడుతున్న ‘స్వచ్ఛ’ ప్రణాళిక
  • భారత్ లో కరోనా వ్యాప్తి మందగమనానికి ఇదే నిదర్శనం
  • కరోనా తర్వాత భారత్ కు ఉపకరించే మేక్ ఇన్ ఇండియా
  • మన దేశ భవితను నిర్దేశించనున్న మేక్ ఇన్ ఇండియా
  • పొరుగు దేశాలపై ఆధారపడే ఆవశ్యకత తగ్గుతుంది
  • ప్రతి ఒక్కరినీ ఆలోచంపజేస్తున్న రెండు గొప్ప ప్రాజెక్టులు
  • మోదీ ముందు చూపునకు జేజేలు పలుకుతున్న జనం 

హైదరాబాద్: ‘రోనా వైరస్ వస్తుందని..యావత్ ప్రపంచమే తల్లక్రిందులవుతుందని మనమంతా ఊహించికూడా ఉండము. అలాగని ఏ ఒక్కరూ కోరుకోరు కూడా…ప్రస్తుత విపత్కాలంలో అగ్రరాజ్యాలు సైతం కరోనాను కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో 130 కోట్లు ఉన్న అఖండ భారతావనిని ఒంటిచేత్తో శాసిస్తూ వస్తున్నారు ప్రధాని మోదీ. స్వయంగా ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచ దేశాధినేతలే ఈ విషయాన్ని నిస్సందేహంగా చెబుతున్నారు. అయితే 2014 సంవత్సరంలో మోదీ కలల ప్రాజెక్టులుగా తెర పైకి వచ్చిన రెండు గొప్ప కార్యక్రమాలు ఇప్పుడు కరోనా సంక్షోభానికి సంజీవని మంత్రంగా పనిచేయబోతున్నాయంటే నమ్మశక్యం కావడం లేదా..అయితే ఆ మహత్తర ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాల్సిందే…. ఒక్కోసారి యాథృచ్ఛికంగా మన ప్రమేయం లేకుండానే కొన్ని మంచి పనులకు శ్రీకారం చుడతాయి. 2014లో ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా రెండూ ఇప్పుడు భారత దేశానికి మార్గదర్శకాలుగా మారనున్నాయి. స్వచ్ఛభారత్ పుణ్యమా అని బహిరంగ ప్రదేశాలలో మలమూత్రాదులు తగ్గిపోయాయి. ప్రత్యేకంగా ముంబాయి, ఢిల్లీ, కోల్ కతా లాంటి ప్రధాన నగరాలలో ఉండే మురికివాడల్లోనూ మోదీ చొరవతో పరిశుభ్రతకు చిరునామాగా మారిపోయాయి. దేశంలోని ప్రధాన నగరాలన్నీ స్వచ్ఛభారత్ స్ఫూర్తితో పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వడం ఇప్పటి కరోనా కట్టడికి పనికొచ్చే అంశంగా మారింది. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం వలనే కరోనా వ్యాప్తి భారతదేశంలో తక్కువ గా ఉన్నట్లు సంకేతాలిస్తోంది. లేకుంటే మురికి వాడలలోకి కరోనా అమిత వేగంతో వ్యాప్తి చెందడమేగాక మరణాల సంఖ్య కూడా భారీగానే ఉండేదంటున్నారు విశ్లేషకులు. ఇక కరోనా కట్టడికి లాక్ డౌన్ నేపథ్యంలో చాలా రంగాల పై దాని ప్రభావం పడనుంది. మరో రెండు లేక మూడేళ్ల దాకా ఇతర దేశాల నుంచి ముడి సరుకు రావడం కూడా కష్టమే అనిపిస్తోంది. దీనికి కూడా 2014లోనే మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తిని రగిలించారు. దాని ప్రధాన ఉద్దేశం ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనకి మనమే స్వావలంభన సాధించడం. అంటే మన దేశంలోనే తయారయిన వస్తువులను ప్రోత్సహించడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడం..అలాగే మన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతులు చేసి ప్రపంచంలోనే భారత శక్తిని చాటడం. స్వచ్ఛ భారత్ లక్ష్యాలు మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2014, అక్టోబర్ 2 న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబరు 24న భారత కేంద్ర కేబినెట్, పట్టణ ప్రాంతాలలో స్వచ్చ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది. ఈ మిషన్ ను దేశంలోని 4041 పైగా పట్టణాల్లో అమలు చేస్తారు. మొత్తం ఖర్చు 62,009 కోట్ల రూపాయలలో 14623 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని పట్టణాల్లో పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది. గ్రామాల్లో, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది. ఒక ఉలికిపాటు. ఒక విపత్తు. ఎప్పుడూ లేదు. ఒకప్పుడు ఇలాంటి ఎదు రుచూడని వైపరీత్యాలు జరిగి ఉండచ్చు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో సమాచారాన్ని విశ్వమంతా చేరవేయగల సాంకేతిక పరిజ్ఞానం మనిషి వేళ్ల కొసమీద ఉంది. కొద్ది గంటల్లో నేలమీద ఏ మూల నుంచి ఏ మూలకైనా చేరగల సౌకర్య సామర్థ్యాలను మనిషి సాధించాడు. అదే ఇప్పుడు ఈ పెనుముప్పుకి దోహదమైంది. కరోనా అంటువ్యాధి విమానాలెక్కి సముద్రాలు దాటి ఖండాంతరాలను వచ్చి చేరింది. నూతన సంవత్సరం 2020 ఈ విపత్తులో ప్రారంభం కావడం మొత్తం మానవాళిని అల్ల కల్లోలం చేస్తోంది. ఇంతవరకు కరోనా నైజం ఎవరికీ అంతుబట్టలేదు. శాస్త్రవేత్తలు అవిశ్రాం తంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి తెలిసిందే మంటే వ్యక్తిగత మరియు సమష్టి పరిశుభ్రత మాత్రమే దీనికి విరుగుడుగా నిర్ధారించారు. వయ సుమళ్లినవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. మాటిమా టికీ చేతులు శుభ్రం చేసుకోవాలని హెచ్చరి స్తున్నారు. పరిశుభ్రతలోనే పరమేశ్వరుడున్నాడని అనా దిగా మనం విశ్వసిస్తున్నాం. పాటిస్తున్నాం. రోజూ కనీసం మూడుసార్లు నదీ స్నానం, దైవ ధ్యానం, అగ్ని హెూత్ర ఆరాధన లాంటి నియమాలను మన ఋషులు శాస్రోక్షంగా ఆచరించి మరీ ఉ ద్బోధిం చారు. రోజులు మారాయి. ఎవరికీ తీరిక ఓపికలు లేవు. రోజూ ఒక స్నానానికి కూడా వ్యవధి లేదు. ప్రపంచీకరణ తర్వాత అవకాశమున్న అన్ని వెసులు బాట్లని మనం దినచర్యలోకి అలవాటుగా తెచ్చు కుని, అదే నాగరికత అనుకుంటున్నాం. ఒక నాటి ముతక ఖద్దరు వస్త్రాలు, వాటిని రోజూ ఉతికి ఆరేసి ధరించడం అనాగరికం అయింది. ఇప్పుడు మనం ధరించే చాలా రకాల దుస్తులు ఉతికే పనిలేదు. ఒంటిమీదే పుట్టి ఒంటిమీదే చిరి గిపోతాయ్. ఇంటికి ఎలాంటి పరాయి మనిషి వచ్చినా, అతిథి వచ్చినా కాళ్లకి నీళ్లివ్వడం మన ఆచారం. అదిప్పుడు అనాచారం. మరీ పసిపిల్ల లున్న ఇళ్లలోకి ఈ శుభ్రత పాటించకుండా ఎవరూ గడపలోకి అడుగు పెట్టేవారు కాదు. మళ్లీ ఇన్నాళ్లకి ఆచారాలు గుర్తుకొస్తున్నాయ్. స్వచ్ఛభారత్ ఒక శుభారంభం. కానీ మన ప్రజల ఉదాసీనత, తరాలుగా ఉన్న అశ్రద్ధ, అవ గాహనా రాహిత్యంతో ఆ ఉద్యమం చేరాల్సిన స్థాయికి చేరలేదు. మన రైలు బోగీలు, మన ప్రయాణికుల బస్సులు, ఆయా స్టేషన్లు ఇన్నాళ్లూ శాని టైజేషన్ ని చూడలేదు. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అవన్నీ నడుస్తున్నాయి. మనకి చెత్త చెదారం ఇంకా చిమ్మేసినవన్నీ తీసి గోడవతల వెయ్యడం మనకో అలవాటు..ఇప్పుడీ అలవాట్ల నుంచి మెల్లిగా ప్రజలంతా దారికొస్తున్నారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పైనా ఇక పై జాగ్రత్తలు పాటిస్తారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి మనకి సూర్యుడు రక్షాకరుడు. రోజులో పది నించి పన్నెండు గంటలు రకరకాల కిరణాలను భూమికి పంపుతూ అనేకానేక సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తున్నాడు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడుగా పూజ లందుకుంటున్నాడు. సూర్యభగవానుడు నిజానికి మన జెండా మీద ఉండాలి. మనకి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అలవాటే. కరోనాకి అవగాహనే ప్రస్తుతానికి మందు. ప్రపంచ దేశా లన్నీ ముందు జాగ్రత్త కీ, తర్వాత వైద్యానికి మందుల పరిశోధనతో తలమునకలవుతు న్నాయ్. త్వరలోనే పరిష్కారం వస్తుందన్నది నిస్సంశయం. భారతదేశం లో సంస్థలను వారి ఉత్పత్తులను తయారు చేయుటకు ప్రోత్సహించటానికి భారతదేశం ప్రభుత్వం యొక్క నూతన పథకం/చొరవ. దీనిని 25 సెప్టెంబర్ 2014 న ప్రధాన మంత్రి, నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఈ చొరవ ప్రధానంగా దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదారులకు 125 కోట్ల జనాభాతో బలమ్కెన భారతదేశం – ఒక తయారీ కేంద్రంగా నిర్మించడానికి మరియు ఉద్యోగావకాశాలు సృష్టించడానికి హామీ పూర్వక అనుకూలమ్కెన వాతావరణం కల్పిస్తుంది. ఈ చొరవ వెనుక ప్రధాన లక్ష్యం నూతన ఉద్యోగ సృష్టి మరియు న్కెపుణ్యం అభివృద్ధికి తోడ్పడటం. ఆర్ధిక వ్యవస్థలోని 25 రంగాల మీద ఇది దృష్టి సారిస్తుంది. ఈ రంగాల్లో కొన్ని: ఆటోమొబ్కెల్స్, రసాయనాలు, ఐటి, ఫార్మాస్యూటికల్స్, వస్త్రాలు, పోర్టులు, ఏవియేషన్, లెదర్, పర్యాటక మరియు ఆతిధ్యం, వెల్నెస్, ర్కెల్వేలు, ఆటో భాగాలు, డిజ్కెన్ తయారీ, పునరుత్పాదక శక్తి, మ్కెనింగ్, బయో-టెక్నాలజీ, మరియు ఎలక్ట్రానిక్స్ మొదలగునవి. ఇది జి.డి.పి. ( %+m% ) పెరుగుదల మరియు పన్ను ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అధిక నాణ్యత ప్రమాణాల లక్ష్యంతో పర్యావరణం ప్కె ప్రభావంని తగ్గించడం. ఈ చొరవ భారతదేశానికి సాంకేతిక పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. . భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా దాని ఉనికిని చాటుకుంది. 2020 సం. కల్లా భారతదేశం ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మరియు తయారీ రంగంలో మొదటి మూడు గమ్యస్థానాలలో ఒకటిగా ఉండాలని భావిస్తున్నారు. భారత తయారీ రంగం తదుపరి 2-3 దశాబ్దాల వరకూ “అనుకూలమ్కెన జనసంఖ్య డివిడెండ్” వంటి సానుకూల అంశాలను కలిగి ఉండటం. నాణ్యమ్కెన శ్రామిక బలం నిలకడగా లభిస్తూ ఉండటం ఉద్యోగుల వ్యయం ఇతర దేశాలతో పోలిస్తే సాపేక్షంగా తక్కువ ఉండటం విశ్వసనీయత మరియు స్కెపుణ్యాలతో పనిచేస్తున్న బాధ్యతాయుత వ్యాపార సంస్థలు కలిగి ఉండటం దేశీయ మార్కెట్లో బలమ్కెన వినిమయతత్వం. ఉత్తమ శాస్త్రీయ మరియు సాంకేతిక సంస్థల మద్దతు ద్వారా బలమ్కెన సాంకేతిక మరియు ఇంజనీరింగ్ సామర్థ్యాలను కలిగి ఉండటం. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించుటకు ఉత్తమ నియంత్రిత మరియు స్థిరమ్కెన ఆర్ధిక వ మార్కెట్లను కలిగి ఉండటం. సాంకేతిక సముపార్జన మరియు అభివృద్ధి నిధి తగిన సాంకేతికను కొనుగోలు చేయడం కొరకు ప్రతిపాదించబడింది. ఒక పేటెంట్ పూల్ ను సృష్టించి పరికరాలు దేశీయ తయారీని అభివృద్ధి చేసి కాలుష్య నియంత్రణ మరియు శక్తి వినియోగం తగ్గించడం కోసం ఉపయోగిస్తారు. ఈ ఫండ్ ఒక స్వాధికార పేటెంట్ పూల్ గా కూడా మరియు ల్కె సెన్సుల జారీ సంస్థగా పని చేస్తుంది. ఇది పేటెంట్ కలిగినవారి నుండి మేధో సంపత్తి హక్కులు కొనుగోలు చేస్తుంది.