విశ్వ… మరణ మృదంగం

ప్రపంచవ్యాప్తంగా 1.54 లక్షల మంది కరోనాకి బలి..అమెరికాలో 7 లక్షలకు పైగా కేసులు

  • ప్రపంచవ్యాప్తంగా 22 లక్షలకు పైగా కరోనా కేసులు
  • అమెరికాలో 37,158 మృతులు 
  • ఇటలీ 22,745… స్పెయిన్లో 20,002 మృతులు
  • రష్యాలోనూ పెరుగుతున్న కేసుల సంఖ్య
  • ఒక్క రోజులోనే రష్యాలో 4 వేలకు పైగా కేసులు
  • కొత్త లెక్కలు చెబుతున్న చైనా పై విమర్శలు 

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. దాదాపు అన్ని దేశాలను ఈ వైరస్ గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 1,54,256 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాల్లో 5,72,076 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,50,683కు చేరింది. అత్యధికంగా యూఎస్లో 37,158 మంది కరోనా బారిన పడి చనిపోయారు. స్పెయిన్లో 20,002, ఇటలీలో 22,745, ఫ్రాన్స్ లో 18,681, జర్మనీలో 4,352, యూకేలో 14,576, చైనాలో 4,632, ఇరాన్లో 4,958, టర్కీలో 1,769, బెల్జియంలో 5,163, బ్రెజిల్ లో 2,171, కెనడాలో 1,310, నెదర్లాండ్స్ లో 3,459, స్విట్జర్లాండ్ లో 1,327 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికా పై కరోనా వైరస్ పగబట్టింది. తాజాగా అక్కడ కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. ఊహించని విధంగా అమెరికాలో కొవిడ్ 19 వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా నమోదుకానన్ని కేసులు, అత్యధిక మరణాలతో సతమతమవుతున్న అమెరికా.. ఇక పై పెను సవాలును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం అర్థరాత్రి వరకు అక్కడ నమోదైన కేసుల సంఖ్య 7,06,309కి చేరింది. మృతుల సంఖ్య 36,607గా నమోదైంది. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 58,478కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 3,856 మంది మ ృతిచెందారు. ఇందులో కరోనా అనుమానిత మరణాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక అత్యధిక మరణాల్లో రెండో స్థానంలో ఉన్న ఇటలీలో వైరస్ సోకినవారి సంఖ్య 1,72,434కి పెరిగింది. మృతుల సంఖ్య 22,745గా నిర్ధరణ అయ్యింది. ఈ దేశంలో గత 24 గంటల్లో 575 మంది మృతిచెందారు. స్పెయిన్లో మొత్తం కేసుల సంఖ్య 1,90,859కి చేరింది. మృతుల సంఖ్య 20,002గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 687 మంది మ రణించారు. మరోవైపు ఫ్రాన్స్ లో మొత్తం కేసుల సంఖ్య 1,09,252 కాగా, మృతులు 18,681. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 761 మంది మరణించారు చైనా కొత్త లెక్కలు కరోనా ఉద్దృతి పై పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ అమెరికా సహా పలు దేశాలు విమర్శలతో విరుచుకుపడుతున్నవేళ చైనా స్పందించింది. వైరస్ పుట్టుకకు కేంద్రమైన వుహాలో మరణాల సంఖ్యను సవరించింది. కరోనా జాబితాలో కొత్తగా 1,290 మరణాలను చేర్చింది. దీంతో వుహాలో వైరస్ దెబ్బకు కన్నుమూసినవారి సంఖ్య 3,869కి పెరిగింది. 325 కేసులను కూడా కొత్తగా కలిపి.. నగరంలో మొత్తం బాధితుల సంఖ్యను 50,333గా పేర్కొంది. దీంతో చైనాలో కరోనా బాధితుల సంఖ్య 82,692కు, మృతుల సంఖ్య 4,632కు పెరిగింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రుల సంఖ్యను ఒక్కసారిగా గణనీయంగా పెంచామని. ఆ సమయంలో కొన్ని వైద్య కేంద్రాల నుంచి సరైన లెక్కలు అందలేదని, అందుకే ఇప్పుడు లెక్కలు సవరించామని చైనా వివరణ ఇచ్చింది. వైరస్ వ్యాప్తి చెందిన తొలినాళ్లలో పలువురు ఇళ్లలోనే మరణించారని తెలిపింది. ప్రస్తుతం సంబంధిత లెక్కలన్నీ అందుబాటులోకి రావడంతో సవరణలు చేపట్టామని వివరించింది. అమెరికాలో దశలవారీగా ఆంక్షల ఎత్తివేత ప్రపంచంలోనే అతి పెద్దదైన అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరిచేందుకు మూడు దశల ప్రణాళికను ట్రంప్ తాజాగా ఆవిష్కరించారు. సదరు మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయా రాష్ట్రాల్లో నిషేధాజ్ఞలను దశలవారీగా సడలించే అధికారాన్ని గవర్నర్లకు కట్టబెట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించి అమెరికాలోని అత్యుత్తమ వైద్య నిపుణులు 18 పేజీల తాజా మార్గదర్శకాలను రూపొందించారు. వరుసగా 14 రోజులపాటు కేసుల సంఖ్య తగ్గుతూ వెళ్తే తొలి దశ మొదలవుతుంది. ఆ తర్వాత కూడా 14 రోజుల చొప్పున గడిచేకొద్దీ వైరస్ ఉధృతి తగ్గుముఖం పడితే 2, 3 దశలు ప్రారంభమవుతాయి. ఆయా దశల్లో నిబంధనలు ఎలా ఉంటాయంటే.. రష్యాలోనూ కరోనా కోరలు చాస్తోంది. శుక్రవారం ఒక్క రోజే 4,070 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 41 మంది మ రణించారు. ఆ దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 32,008కి చేరింది. మొత్తం 273 మంది చనిపోయారు. దీంతో మాస్కోలో 500 పడకలతో హుటాహుటిన ఆస్పత్రిని నిర్మించారు. ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడంతో పాటు లాక్ డౌన్ ను మే 1 వరకు పొడిగించారు. కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడేందుకు అనుమతించారు. ఇందుకోసం 68 వేల ప్యాకెట్ల క్లోరోక్విన్‌ను చైనా పంపింది. మరోవైపు ప్రపంచవ్యాప్త కరోనా మృతుల సంఖ్య లక్షన్నర దాటింది. ఇందులో దాదాపు లక్షమంది యూర వారే. 22 లక్షలు దాటిన కేసుల్లోనూ సగం వాటా యూ పదే. బ్రిటన్లో 24 గంటల్లో 847 మంది మరణించారు. భారత్ లో చిక్కుకున్న తమ పౌరులను తీసుకెళ్లేందుకు బ్రిటన్ వచ్చే వారం మరో 17 చార్టర్డ్ విమానాలను నడపనుంది. డిశ్చార్జి అయిన 7,829 మందిలో 169 మందికి మళ్లీ పాజిటివ్ వచ్చినట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఆఫ్రికాలో 3లక్షల మంది చనిపోయే చాన్స్! వివిధ జాగ్రత్తల రీత్యా ఆఫ్రికా ఖండంలో కరోనా అదుపులోనే ఉంది. అయినా బలహీన ఆరోగ్య వ్యవస్థల కారణంగా ఈ ఏడాది మహమ్మారికి 3 లక్షల మంది వరకు చనిపోవచ్చని ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ కమిషన్ తెలిపింది. పరీక్షలు, చికిత్సలు, పీపీఈలు, ఇతర రక్షణ సామగ్రి కోసం 44 బిలియన్ డాలర్లు అవసరమని కమిషన్ వెల్లడించింది. బెల్జియం పై పంజా బెల్జియంలో వైర్ సకు బలైనవారి సంఖ్య 5,163కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే 313 మంది చనిపోయారు. ఇరాన్ (4,958)లో మరో 89 మంది మరణించారు. శుక్రవారం 15 మంది మృతితో బంగ్లాదేశ్ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. నేపాల్ లో 14 కొత్త పాజిటివ్ కేసుల్లో 12 మంది భారతీయులే. పాకిస్థాన్లో తల్లీగీ జమాత్ ఫైసలాబాద్ విభాగం చీఫ్ మౌలానా సుహాయిబ్ రూమీ (69) కరోనాతో మృతిచెందాడు.