సామాజిక ప్రార్థనలకు స్వస్తి

మరో వారం రోజుల్లో రంజాన్ మాసం…లాక్ డౌ తో ఇళ్లలోనే ప్రార్థనలు

  • లాక్ డౌన్ సడలించినా మసీదు ప్రవేశాలకు అనుమతి లేదు
  • సామాజిక దూరం పాటించాలన్న మైనారిటీ శాఖ మంత్రి నఖ్వీ
  • ఇప్పటికే వక్స్ బోర్డులతో మాట్లాడిన కేంద్రం
  • రంజాన్ మాసంలో మత పెద్దల కొత్త నిబంధనలు
  • వెలవెల బోతున్న రంజాన్ సంబంధిత మార్కెట్లు
  • ఈ సంవత్సరం హలీమ్ రుచులు లేనట్లే
  • ఇళ్లలోనే ఎవరికి వారు తయారు చేసుకోవాల్సిందే

హైదరాబాద్: క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం’. ఈ పావన సమయంలో భక్తితో ఉపవాసం చేసిన వారి అన్ని తప్పులూ మన్నించబడతాయనీ, వీరంతా ‘రయ్యాన్’ అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గ ప్రవేశం చేస్తారనీ పవిత్ర ఖురాన్ చెబుతోంది. ఈ నెల 24 లేదా 25 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. దేశంలో చూడబోతే కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. 21 రోజుల లాక్ డౌన్ నిబంధనలను మరో 19 రోజులపాటు పొడిగించిన విషయం విదితమే. మరి ఈ పరిస్థితులలో ముస్లిం సోదరులు కొన్ని త్యాగాలు చేయవలసిన సమయం ఆసన్నమయింది. అసలు రంజాన్ మాసం అంటేనే ఓ పవిత్రత..సామూహిక ప్రార్థనలు..అంతా కలిసి షాపింగులు..ఇలా ఒకటేమిటి నెల రోజులపాటు సందడి వాతావరణం నెలకొంటుంది. రంజాన్ మాసంలోనే ప్రత్యేకంగా తయారుచేసే హలీమ్ రుచుల కోసం ఇతర మతస్తులు సైతం ఎదురుచూస్తుంటారు. సాధారణంగా ఈ పాటికే రంజాన్ పవిత్ర మాసం ప్రభావంతో మార్కెట్లు కిటకిటలాడుతూ ఉండేవి. రంజాన్ పండుకు ప్రత్యేకంగా కొత్త బట్టలు, రంజాన్ సామాగ్రి, హలీం తయారీ కోసం మేకల విక్రయాల జోరుతో మార్కెట్ లు కళకళలాడుతుండేవి. రంజాన్ పండుగ చేరువవుతుండటంతో ముస్లిములు పండుగకు కావాల్సి వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రధాన మార్కెట్ లకు చేరుకుని కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ. రంజాన్ పండుగకు ముస్లిములు ప్రత్యేకంగా కుందన్, చెమ్కీతో తయారు చేసిన వస్త్రాలను అధికశాతం పండుగ సందర్భంగా కొనుగోలు చేస్తారు. అలాగే ఇమిటేషన్ గోల్డ్ వస్తువులు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. రంజాన్ పండుగ రోజున అచ్చమైన ముస్లిం వస్త్రాలను ధరించి శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. రంజాన్ పండుగకు మహారాష్ట్ర, కోల్ కతా ప్రాంతాల నుంచి ఎక్కువ శాతం వర్క్ వస్త్రాలు హైదరాబాదు దిగుమతి అవుతాయి. హైదరాబాద్ లో ముస్లిములు ఎక్కువగా ఉండే పాత బస్తీ, కార్వాన్, సబ్దిమండి, కోరి ప్రాంతాల్లో వీటి విక్రయాలు జోరుగా కొనసాగుతాయి. ముఖ్యంగా జియాగూడ సబ్దిమండి, పురానపూల్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, బడీచౌడి, జుమ్మెరాత్ బజార్ తదితర ప్రాంతాల్లో రంజాన్ విక్రయాలు జోరుగా సాగుతాయి. చెమ్కీ చెప్పులు, కమ్మలు, జుమ్కాలు, లాకెట్లు, బింగియా, జడ గంటలు తదితరాలు ఎక్కువ శాతం కొనుగోలు చేస్తారు. ప్రతి ఏటా వీటి విక్రయాలు లక్షల్లో ఉంటాయి. రంజాన్ వస్త్రాలను ఆరు నెలల ముందు నుంచే ఇతర రాష్ట్రాలలో తయారై నగరానికి చేరుకుంటాయి. వస్త్రాలలో కుందన్స్ డిజైన్లకు గాగ్రా, చుడీదార్, అనార్కలీ, సారీలు తదితరవి అధిక శాతం కొనుగోలు చేస్తారు. వీటి ధరలు రూ. 1500 నుంచి రూ. 10,000 వరకు వివిధ ధరల్లో అందుబాటులో ఉంటాయి. రంజాన్ సీజన్ లో హలీం తయారీకి మేకల మాంసం అవసరం. వీటి విక్రయాలు కూడా జియాగూడ మేకల మండి, పురానాపూల్, రింగ్ రోడ్, మొఘల్ ఖనాలా, అత్తాపూర్ హై వే రోడ్డు, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో మేకలను విక్రయిస్తుంటారు. మండిలో మేకల విక్రయాలు హలీం తయారీ కోసం జోరుగా కొనసాగుతాయి. హలీం తయారీకి వాడే మేకలు ఝాన్సీ, మహారాష్ట్రాల నుంచి అధిక శాతం మండిలకు దిగుమతి అవుతాయి. దీంతో గొర్రె మేకల ధరలు కూడా సాధారణ రోజుల కంటే ధరలు ఎక్కువగానే ఉంటాయి. జియాగూడ మేకల మండి జాతీయ స్థాయిలో నెం.1 2 మార్కెట్ గా కొనసాగుతుంది. ఇక్కడి నుంచి మాంసం హలీం తయారీ నిమిత్తం నగరంలోని అన్ని హోటళ్లకు సప్లయి చేస్తుంటారు. మండీని ఆధునీకరించినట్లయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. అయితే రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రజలు లా డౌన్ ఆదేశాలను, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి విజ్ఞప్తి చేశారు. ప్రార్థనలు, మత పరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ఈ రోజొక ప్రకటన విడుదల చేశారు. ఇండియాలో స్టేట్ వక్స్ బోర్డుల నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ వక్స్ కౌన్సిల్ చైర్మన్ కూడా అయిన నఖ్వి ఏడు లక్షలకు పైగా రిజిస్టర్ అయిన మసీదులు, ఈద్గాలు, ఇమాంబాద్, దర్గాలు, ఇతర మత సంస్థలు స్టేట్ వక్స్ బోర్డుల కిందకు వస్తాయని తెలిపారు. కరోనా సంక్షోభ నేపథ్యంలో రంజాన్ మాసం వస్తున్నందున లాక్ డౌన్ . నిబంధనలు, సామాజిక దూరం పాటించేలా చూడాలని వివిధ మత నేతలు, అధికారులు, స్టేట్ వక్స్ బోర్డుల ఆఫీసు బేరర్లను ఇప్పటికే కోరాననీ, వారితో స్వయంగా మాట్లాడానని నఖ్వి పేర్కొన్నారు. ఇళ్లలోనే ఉండి రంజాన్ వేడుకలు జరుపుకునేలా చూస్తామని వారు తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో సామూహిక ప్రార్థనలు (నమాజ్ లు) వద్దని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ ఒక్కరు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలంటే రంజాన్ ప్రార్థనల్లోను సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించింది. ఈ మేరకు దేశంలోని అన్ని వర్ఫ్ బోర్డులు పరిస్థితిలో తీవ్రతను, ప్రజారోగ్యాన్ని, ముస్లింల ప్రాణాలను దృష్టిలో వుంచుకుని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ వక్స్ బోర్డులకు వివరించింది. అన్ని రాష్ట్రాల వక్స్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించింది కేంద్రం. ఇందులో తీసుకున్న నిర్ణయాలను వెలువరించారు అధికారులు. రంజాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని వర్ఫ్ బోర్డులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 24 తర్వాత దేశంలో సామూహిక ప్రార్థనలు వద్దని, అది కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా హిందూ దేవాలయాలు, క్రిస్టియన్ చర్చిలతోపాటు ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. గత 22 రోజులుగా ఇదే తరహా ఆంక్షలు అమలవుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు, బిల్డింగుల మీద సామూహిక ప్రార్థనలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు కొందరు. ఇది కేవలం వారి ప్రాణాలకే కాకుండా వారి కుటుంబీకులకు, సన్నిహితులకు ప్రమాదమని చాలా మంది గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలోనే త్వరలో రంజాన్ మాసం ప్రారంభం కాబోతోంది. ఇంకో ఆరేడు రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనల కోసం దేశవ్యాప్తంగా మసీదుల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, కరోనా ప్రభావం ఇంకా తగ్గని నేపథ్యంలో ప్రార్థనల్లో (నమాజ్) నిజాయితీగా వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించాలని వక్స్ బోర్డులకు ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేయాలని సూచించింది. హెల్త్ వర్కర్లు, డాక్టర్లు పోలీసులకు సహకరించాలని కోరింది. ఫేక్ న్యూస్ ను నమ్మవద్దని, 7 లక్షల మసీదులు, ధార్మిక సంస్థల నేతలతో కలిసి పని చేయాలని పిలుపినిచ్చింది. భారత్ సహా ప్రపంచమంతా కరోనా బారినుంచి విముక్తి పొందాలని ప్రార్థనలు చేయాలని ప్రభుత్వం ముస్లింలను కోరింది. ఈ సందర్భంగా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పవిత్ర పుణ్య మాసమైన రంజాన్ తారావీహ్ నమాజ్ లను ఇళ్లలోనే పూర్తి చేసుకోవాలని ఉలేమాలు, ముప్తీలు, ఇస్లామిక్ స్కాలర్లు ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జామియా నిజామియా గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా సహ తో పాటు ఇఫ్తార్లను కూడా ఇళ్లలోనే చేసుకోవాలని కోరింది. డబ్బులు వృథా చేయకుండా పేదలకు చేయూత అందించాలని, లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరింది. . ఇక రంజాన్ నెలలో తారావీహ్ ను ఇంట్లోనే చేసుకోవాలని ఉలేమాన్, ముస్లిలు కోరడాన్ని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. గురువారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేస్తూ కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించినందున ఇదో మంచి విజ్ఞప్తిగా పేర్కొన్నారు. అన్ని ముస్లిమ్ పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేశారని, వీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కచ్చితంగా పాటించాలన్నారు. రంజాన్ మాసం ప్రారంభమవుతుందంటే చాలు.. ఎక్కడ చూసినా హలీం ఘుమఘుమలు నోరూరిస్తుంటాయి. కేవలం ముస్లింలే కాదు.. భోజన ప్రియులందరూ.. రంజాన్ మాసంలో హలీంను ఎక్కువగా తింటుంటారు. ఇక హైదరాబాద్ అయితే హలీం తయారీకి చాలా ఫేమస్. నగరం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు, విదేశాలకు పెద్ద ఎత్తున హలీంను ఎగుమతి చేస్తుంటారు. అయితే కరోనా దెబ్బకు ఈసారి హలీం తయారీదార్లకు పెద్ద ఎత్తున నష్టం వచ్చే అవకాశం ఉ ండగా.. భోజన ప్రియులు ఈసారి హలీంను మరిచిపోవాల్సిందేనని తెలుస్తోంది..! ఈ ఏడాది రంజాన్ మాసం ఏప్రిల్ 25న ప్రారంభం కానుంది. మే 25న రంజాన్ పండుగ జరగనుంది. ఇక రంజాన్ మాసం ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉన్నందున.. హలీం తయారీదార్లు.. ఈ సారి వ్యాపారం ఎలా జరుగుతుంది..? లాక్ డౌన్ ఎత్తేసినా.. హలీం అమ్మేందుకు ప్రభుత్వం అనుమతినిస్తుందా..? వ్యాపారం జరుగుతుందా..? అని ఆలోచిస్తుండగా.. హలీంను తయారు చేసే చిరువ్యాపారులు, అమ్మే చిరు ఉద్యోగులు ఈసారి ఉ పాధి లేకుండా పోతుందని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏప్రిల్ 25న రంజాన్ మాసం ఆరంభం అయినా… లాక్ డౌన్ 30వ తేదీతో ముగుస్తుంది కనుక.. ఒక్క 5 రోజులు ఓపిక పడితే.. ఆ తరువాత నుంచి హలీంను అమ్ముకుందాం.. అన్నట్లుగా కూడా లేదు. ఎందుకంటే లాక్ డౌన్ ఎత్తేశాక కూడా చాలా రోజుల వరకు ఆంక్షలను సడలించరు. లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తేస్తారు. దీంతో హలీం అమ్మడం కష్టమే అవుతుంది. అయితే సామాజిక దూరం పాటిస్తూ హలీంను అమ్ముకునేలా.. కేవలం దాన్ని పార్శిల్ రూపంలో మాత్రమే అమ్మేలా… ప్రభుత్వం, అనుమతిస్తే బాగుంటుందని హెటల్స్, రెస్టారెంట్ల ఓనర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి..!